`నిశ్శ‌బ్దం` రిలీజ్ డేట్ ప్రెస్‌మీట్‌ & stills

480


`అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `నిశ్శ‌బ్దం`. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ బ్యాన‌ర్స్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ క్రాస్ ఓవ‌ర్ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 31, 2020లో విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు నిర్మాత‌లు. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో…

నిర్మాత కోన వెంక‌ట్ మాట్లాడుతూ – “2017లో ఈ క‌థ హేమంత్ మ‌ధుక‌ర్ రూపంలో న‌న్ను వెతుక్కుంటూ వ‌చ్చింది. నిన్నుకోరి సినిమా విష‌యంలోనూ అలాగే జ‌రిగింది. క‌థ మ‌నల్ని క‌దిలిస్తే .. అది సినిమా అవుతుంది. హేమంత్ చెప్పిన పాయింట్ విన్న నాకు అద్భుత‌మైన సినిమా అవుతుంద‌నే ఫీలింగ్ క‌లిగింది. ఇద్ద‌రం రెండేళ్లు ట్రావెల్ అయ్యాం. ఈ ప్ర‌యాణంలో అనుకోని మంచి ఘ‌ట‌న‌లు ఎదుర‌య్యాయి. మేం న‌మ్మిన ఈ క‌థ‌ను ముందుకు తీసుకెళ్ల‌డానికి మాకు విశ్వ‌ప్ర‌సాద్‌గారు దొరికారు. మొత్తం సినిమాను అమెరికాలోనే చిత్రీక‌రించిన తొలి తెలుగు సినిమా ఇదేన‌ని అనుకుంటున్నాను. బావుంటుంది క‌దా! అని అనుకున్నాను. ముందు ఈ పాత్ర‌కు యూనిట్ ఎవ‌రిని అనుకున్నారో ఏమో కానీ.. సినిమా ప్రారంభానికి మూడు, నాలుగు నెల‌ల ముందు నాకు ఈ సినిమాలో న‌టించే అవ‌కాశం ద‌క్కింది. వైర‌టీ క్యారెక్ట‌ర్‌ను ఇచ్చిన హేమంత్‌కి, నిర్మాత‌లు విశ్వ‌ప్రసాద్‌, కోన వెంక‌ట్‌గారికి థ్యాంక్స్‌“ అన్నారు.

స‌హ‌నిర్మాత మాట్లాడుతూ వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ – “ మంచి సినిమా.. సినిమాను అంద‌రూ ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాం“ అన్నారు.

టీజీ విశ్వ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ – “నిన్నుకోరి` సినిమా నుండి కోన వెంక‌ట్‌గారితో అనుబంధం ఉంది. ఆ సినిమాకు లైన్ ప్రొడ‌క్ష‌న్‌లో వ‌ర్క్ చేశాం. టెక్నాలజీ నా వృత్తి అయినా సినిమాలంటే ప్యాష‌న్‌తో ఈ రంగంలోకి అడుగుపెట్టాను. హాలీవుడ్ రేంజ్‌లో ఓ సినిమా చేయాల‌ని అనుకునేవాడిని. నేను ఇదే విష‌యాన్ని కోన‌వెంక‌ట్‌గారితో కలిసి డిస్క‌స్ చేశాను. అలాంటి సినిమా ఇండియన్ ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్‌, హాలీవుడ్ యాక్ట‌ర్స్‌, టెక్నీషియ‌న్స్‌తో సినిమా చేస్తే తీయాల‌ని అనుకున్నాం. రెండేళ్ల క్రితం హేమంత్ ద‌గ్గ‌ర లైన్ విని.. సినిమాను డెవ‌ల‌ప్ చేసుకుంటూ వ‌చ్చాం. హాలీవుడ్ స్టైల్‌లో ఉండే ఇండియ‌న్ మూవీ ఇది. జ‌న‌వ‌రి 31న దీన్ని రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.

డైరెక్ట‌ర్ హేమంత్ మ‌ధుక‌ర్ మాట్లాడుతూ – “నేను, కోన‌గారు క‌లిసి ట్రావెల్ చేసే క్ర‌మంలో విశ్వ‌గారితో ప‌రిచ‌య‌మైంది. సినిమా స్టార్ట్ అయిన త‌ర్వాత నేను ఏది అడిగినా.. ఆయ‌న వెంట‌నే స‌మ‌కూర్చారు. అంత కో ఆప‌రేటివ్ ప్రొడ్యూస‌ర్ నాకు దొర‌క‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. అనుష్కగారు మూడు నాలుగు నెల‌లు క‌ష్ట‌ప‌డి సైన్ లాంగ్వేజ్‌, పెయింటింగ్ నేర్చుకున్నారు. హాలీవుడ్ యాక్ట‌ర్ మైకేల్‌గారు కూడా చ‌క్క‌గా చేశారు. అంజ‌లిగారు ఇందులో ట‌ఫ్ కాప్ రోల్ చేశారు. సుబ్బ‌రాజుగారు కూడా వైర‌టీ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు. జ‌న‌వ‌రి 31న ఈ సినిమాను విడుద‌ల చేస్తాం. టెక్నిక‌ల్‌గా ఇదొక కొత్త చిత్రం. ట్రెండ్ సెట్టింగ్ మూవీ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను. సినిమా అంద‌రినీ ఇంప్రెస్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నాను“ అన్నారు.

అనుష్క శెట్టి, ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో మెయిన్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుంద‌ర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: చాడ్ రాప్టోర్, స్టైలీష్ట్: నీర‌జ కోన‌, స్టంట్స్: ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్ర‌ఫీ: షానియ‌ల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కోన వెంక‌ట్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల; నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్, స్టోరీ, డైరెక్ష‌న్ – హేమంత్ మ‌ధుక‌ర్.