`మిస్ మ్యాచ్‌` చాలా పెద్ద విజ‌యాన్ని సాధించాలని కోరుకుంటున్నాను – మంత్రి హ‌రీశ్ రావు

525


ఉద‌య్ శంక‌ర్‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరో హీరోయిన్లుగా అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి బ్యాన‌ర్‌పై ఎన్ వి. నిర్మల్ ద‌ర్శ‌క‌త్వంలో జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మిస్తోన్న చిత్రం `మిస్ మ్యాచ్‌`. డిసెంబ‌ర్ 6న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హ‌రీశ్‌రావు, స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేశ్ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు, దేశ‌ప‌తి శ్రీనివాస్‌, శ్రీవిష్ణు స‌హా ఎంటైర్ యూనిట్ ఈ వేడుక‌లో పాల్గొన్నారు. బిగ్‌సీడీని తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హ‌రీశ్‌రావు, స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేశ్ విడుద‌ల చేశారు. బిగ్ టికెట్‌ను విక్ట‌రీ వెంకటేశ్ లాంచ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా..తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ – “శ్రీరాంగారిపై ఉన్న గౌర‌వంతో నేను ఇక్క‌డ‌కు వ‌చ్చాను. ఇప్పుడు సినిమాల్లో కొత్త భావ‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. కొత్త కొత్త ఆలోచ‌న‌ల‌తో, కొత్త క‌థ‌ల‌తో, కొత్త ద‌ర్శ‌కులు, న‌టీన‌టులు అద్భుత‌మైన విజ‌యాల‌ను సాధిస్తున్నారు. ‘మిస్ మ్యాచ్’ కూడా అదే కోవ‌లో క‌న‌ప‌డుతుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమ‌క‌థా చిత్ర‌మిద‌ని నాకు అర్థ‌మైంది. ఓ ప్రేమికురాలి విజ‌యం కోసం ప్రేమికుడు ప‌డే త‌ప‌న‌ను చూపించే చిత్ర‌మిది. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్ర‌మ‌ని అర్థ‌మ‌వుతుంది. ప్రేమ మ‌నిషిని విజ‌యం ప‌థం వైపు న‌డిపించాలి. ` అన్నారు.

విక్ట‌రీ వెంక‌టేశ్ మాట్లాడుతూ – “ఈ సినిమాలో ప‌నిచేసిన ప్ర‌తి ఒక ఆర్టిస్ట్‌, టెక్నీషియ‌న్ నా హృద‌యానికి ఎంతో ద‌గ్గ‌రైనవారు. వారంద‌రికీ ఆల్ ది బెస్ట్‌. ఉద‌య్‌శంక‌ర్ గురించి చెప్పాలంటే త‌న తొలి చిత్రం ఆట‌గ‌ద‌రా శివ‌లో అద్భ‌తుంగా న‌టించాడు. ఇప్పుడు ‘మిస్ మ్యాచ్‌’లో మ‌రో అద్భుత‌మైన పాత్ర‌లో న‌టించాడు. త‌న రియ‌ల్ లైఫ్ క్యారెక్ట‌ర్‌కి ద‌గ్గ‌రైన పాత్ర‌. త‌ను 15ఏళ్ల వ‌య‌సులో గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించ‌డం గొప్ప విష‌యం.

చిత్ర ద‌ర్శ‌కుడు నిర్మ‌ల్ కుమార్ మాట్లాడుతూ – “వేడుక‌కి వ‌చ్చిన హ‌రీశ్‌రావుగారికి, వెంక‌టేశ్‌గారికి థ్యాంక్స్‌. ఈ సినిమా డైరెక్ట్ చేసే అవ‌కాశం ఇచ్చిన జీవీజీ రాజుగారికి, మంచి క‌థ ఇచ్చిన భూప‌తిరాజాగారికి థ్యాంక్స్‌. అన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉన్న క‌థ ఇది. ఉద‌య్‌శంక‌ర్‌గారు చాలా యాక్టివ్ హీరో. ఈ మ‌న‌సే సాంగ్‌ను మూడు రోజులు ప్రాక్టీస్ చేసి సింగిల్ టేక్‌లో చేశారు ఉద‌య్‌శంక‌ర్‌. తెలివైన అబ్బాయి.. విలేజ్ అమ్మాయికి మ‌ధ్య జరిగే క‌థే ఇది. కౌస‌ల్య కృష్ణ‌మూర్తి చిత్రంలో క్రికెట్ ప్లేయ‌ర్‌గా న‌టించిన ఐశ్వ‌ర్యా రాజేష్ ఈ సినిమా కోసం రెజ్లర్ గా న‌టించారు. అందుకోసం ఆమె మూడు నెల‌లు పాటు స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకున్నారు. గిఫ్ట‌న్ సంగీతం చ‌క్క‌గా అందించారు. సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది“ అన్నారు.

నిర్మాత‌లు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ మాట్లాడుతూ – “మా టీమ్‌ను అభినందించ‌డానికి వ‌చ్చిన హ‌రీశ్‌రావుగారికి, వెంక‌టేశ్‌గారికి ధ‌న్య‌వాదాలు. ఉద‌య్‌శంక‌ర్‌, ఐశ్వ‌ర్యా రాజేశ్ స‌హా న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు క‌ష్ట‌ప‌డి సినిమాను తెర‌కెక్కించారు. మంచి క‌థ‌తో రూపొందించిన చిత్రమిది. డిసెంబ‌ర్ 6న విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది“ అన్నారు.