యుగల్ మొదటి పోస్టర్ విడుదల

61

శ్రీ లక్ష్మి గణ సుబ్రమణ్య స్వామి ప్రొడక్షన్స్ పతాకంపై నూతన నటుడు మరియు మెగా అభిమాని జి ఎస్ ఎన్ నాయుడు ప్రధాన పాత్రలో ప్రమోద్ కుమార్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో ఆర్ బాలాజీ నిర్మిస్తున్న చిత్రం “యుగల్” ది మాన్ విత్ డైవర్సన్ అనేదే ట్యాగ్ లైన్. ఈ చిత్రం యొక్క మొదటి ప్రచార చిత్రాన్ని పాత్రికేయుల సమక్షంలో విడుదల చేసారు. అనంతరం చిత్ర విశేషాలు తెలియజేస్తూ

హీరో జి ఎస్ ఎన్ నాయుడు మాట్లాడుతూ “రెండు మూడు సంవత్సరాలు గా ఈ చిత్రం పై మేము వర్క్ చేస్తున్నాం. మొదట ఈ చిత్రానికి గన్ని అనే టైటిల్ ను అనుకున్నాం, కానీ టైటిల్ వేరే వాళ్ళు దగ్గర ఉంది, తర్వాత యుగల్ టైటిల్ ను ఖరారు చేసాము. మేము ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నాం. హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. మరిన్ని విషయాలు త్వరలో తెలియజేస్తాను” అని తెలిపారు.

కెమెరా మాన్ ప్రేమ్ జై విన్సన్ట్ మాట్లాడుతూ “మా దర్శకుడు కథ చేపినప్పుడు చాలా ఎక్సట్రాడినరీ గా అనిపించింది. షూటింగ్ జరుగుతుంది” అని తెలిపారు

మహా భరతం ప్రొడ్యూసర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ “మా ప్రమోద్ కుమార్ చాలా టాలెంట్ ఉన్న డైరెక్టర్, మా బ్యానర్ లో మహా భరతం అనే సినిమా చేస్తున్నాడు, ఇప్పుడు ఈ యుగల్ సినిమా మరియు ఇంకో కొత్త సినిమా త్వరలో స్టార్ట్ కాబోతుంది. డైరెక్టర్ ప్రమోద్ కుమార్ చేసే ప్రతి సినిమా హిట్ కావాలి” అని కోరుకున్నారు.

ఫిల్మ్ ఛాంబర్ చీఫ్ సెక్రటరీ అనుపమ్ రెడ్డి మాట్లాడుతూ “యుగల్ ఫస్ట్ లుక్ లాంచ్ జరుపుకుంటున్నాం, చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే చిత్రాన్ని పూర్తి చేసుకుని మీ ముందుకు తీసుకువస్తాం” అని తెలియజేసారు

రాహుల్ మాట్లాడుతూ “మాది చాలా చిన్న సినిమా. వరుసగా చిత్రాలు చేస్తున్నాం. మంచి కథలు ఉన్నాయి. డైరెక్టర్ ప్రమోద్ గారి దగ్గర గొప్ప కథలు ఉన్నాయి. అద్భుతమైన కథనం తో స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఈ యుగల్ చిత్రం కథ చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులకి బాగా నచ్చుతుంది” అని తెలిపారు

కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం వహిస్తున్న ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ “ఈరోజు యుగల్ చిత్రం మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. మా చిత్ర హీరో జి ఎస్ ఎన్ నాయుడు మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని. అందుకే మా చిత్రాన్ని పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు తేదీ సెప్టెంబర్ 2న విడుదల చేస్తున్నాం. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానులకి విపరీతంగా నచ్చుతుంది. కథ స్క్రీన్ ప్లే చాలా బాగా వచ్చింది. షూటింగ్ జరుగుతుంది. మా నిర్మాతలు మాకు అన్ని ఇస్తున్నారు. మా చిత్రానికి జి ఎస్ ఎన్ నాయుడు యాప్ట్ గా ఉంటాడు. మీ అందరికి సినిమా బాగా నచ్చుతుంది” అని తెలిపారు

చిత్రం పేరు : యుగల్

బ్యానర్ : శ్రీ లక్ష్మి గణ సుబ్రమణ్య స్వామి ప్రొడక్షన్స్

మాటలు : ప్రమోద్ కుమార్, రాహుల్ జి గౌలికర్

ఎడిటర్ : అలోషియస్ జేవియర్

కెమెరా మాన్ : ప్రేమ్ జై విన్సన్ట్

సంగీత దర్శకుడు : సన్నీ మాణిక్

పి ఆర్ ఓ : పాల్ పవన్

కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : ప్రమోద్ కుమార్

నిర్మాత : ఆర్ బాలాజీ