హీరో నితిన్ కెరీర్‌లో మైల్‌స్టోన్ 30వ చిత్రంగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `మాస్ట్రో`. రీసెంట్‌గా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ప్లజెంట్ సర్పైజ్ ఇచ్చిన తర్వాత ఈ రోజు ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేశారు మేకర్స్.
ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఈ గ్లింప్స్‌లో నితిన్ కనిపించాడు. నితిన్ పియానో వాయించడంతో ఆహ్లాదకరంగా ప్రారంభమైన ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో అతన్ని ఎవరో అతన్ని నీటిలో ముంచి హత్య చేయడానికి ప్రయత్నిస్తున్న సీన్ తో ముగిసింది. ఈ ప్రత్యేక క్రమంలో నితిన్ అసాధారణంగా నటించారు. ఈ వీడియోలో మహతి స్వరసాగర్ బీజీఎమ్ అద్భుతంగా ఉంది. తమన్నా భాటియా ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నితిన్ జోడీగా నభా నటేష్ నటిస్తున్నారు.
2021లో క్రేజీ ప్రాజెక్టులలో మాస్ట్రో ఒకటి. రీసెంట్‌గా విడుదలైన నితిన్ రంగ్‌దే సినిమా బ్లాక్ బస్టర్ గా మారుతోంది. ఇద్దరు క్రేజీ హీరోయిన్లు తమన్నా భాటియా, నభా నటేష్ ఇందులో భాగమవుతున్నారు.
‘భీష్మ’ మూవీకి సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన మహతి స్వరసాగర్ ఈ చిత్రానికీ సుమధుర బాణీలను సమకూరుస్తున్నారు.
రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీకి జె. యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని జూన్ 11న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
తారాగణం:
నితిన్, తమన్నా భాటియా, నభా నటేష్, నరేష్, జిషుసేన్ గుప్తా, శ్రీముఖి, అనన్య, హర్షవర్ధన్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాస్ రెడ్డి.
సాంకేతిక బృందం:
డైలాగ్స్-డైరెక్షన్: మేర్లపాక గాంధీ
నిర్మాతలు: ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి
బ్యానర్: శ్రేష్ఠ్ మూవీస్
సమర్పణ: రాజ్‌కుమార్ ఆకెళ్ల
మ్యూజిక్: మహతి స్వరసాగర్
సినిమాటోగ్రఫీ: జె. యువరాజ్
ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్
ఆర్ట్: సాహి సురేష్
పీఆర్వో: వంశీ-శేఖర్.