టాలీవుడ్ లో హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుసబెట్టి సినిమా తరువాత సినిమా ఆగకుండా చేసుకుపోయే దర్శకులలో నర్రా శివనాగుని ముందు వరసలో చెప్పుకోవచ్చు.
సూపర్ స్టార్ కృష్ణతో ఆయన చేసిన మాఫియా కాన్సెప్ట్ మూవీ “నెహ్రూ” నుంచి దర్శకుడిగా శివనాగు ప్రస్థానం ప్రారంభమైన నాటి నుంచి మొన్న నందమూరి తారకరత్నతో బెజవాడ రౌడీయిజం మీద చేసిన “దేవినేని” వరకూ విభిన్న కథా చిత్రాల్ని చేసుకుపోతూ తెలుగు ఇండస్ట్రీలో తన ఉనికిని చాటుకుంటున్నాడు. కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్, క్రైం.. ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ లతో విభిన్న దర్శకుడిగా ముందుకు వెళ్తూ ఏదో ఒక జోనర్ పట్టుకుని వేలాడకుండా విభిన్నంగా వెళ్ళడం శివనాగు ప్రత్యేకత.
సూపర్ స్టార్ కృష్ణతో చేసిన “ఈ తరం నెహ్రూ” బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా, ఆ తరువాత వచ్చిన సినిమాలు కొన్ని యావరేజ్ గా నిలబడి ఫర్వాలేదనిపించినా, కొన్ని సినిమాలు డిజాస్టర్ ప్లాపులతో నిరుత్సాహాన్ని మిగిల్చాయి అని చెప్పవచ్చు.
2021 లో వచ్చిన నందమూరి తారకరత్న నటించిన బెజవాడ వివాదాల చిత్రం “దేవినేని” మేకింగ్ పరంగా అద్భుతంగా ఉన్నా నందమూరి అభిమానుల అంచనాలను మించలేదు. ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది.
శివనాగు మంచి టాలెంటెడ్ డైరెక్టర్. కానీ అదృష్టం ఆవగించంతన్న ఉందా అన్నట్టు టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. అంతే కాదు, కంటెంట్ కి తగిన ఖర్చు పెట్టగల నిర్మాతల సహకారం లేకపోవటం కూడా శివనాగు కి మరో లోటు అనే చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం “నటరత్నాలు” మూవీ రిలీజ్ కి రెడీ అయిందట. మంచి కాన్సెప్ట్ తో వస్తుందనే వార్తలైతే టాలీవుడ్లో వినిపిస్తున్నాయి. ఈ మధ్య బిగ్ బాస్ తో పాపులర్ అయిన ఇనయా సుల్తానా “నటరత్నాలు” లో హీరోయిన్ గా, రంగస్థలం మహేష్, సుదర్శన్ రెడ్డి, తాగుబోతు రమేష్ లాంటి కమెడియన్స్ నటించారట. మర్డర్ మిస్టరీతో హాస్యాన్ని జోడించి మేకింగ్ చేశాడట ఈ చిత్రాన్ని. ఇలాంటి కంటెంట్ సినిమాలు ఇప్పుడు బాగానే ఆడుతున్నాయి. మరి ఈ సినిమాతో అయినా కొద్దో, గొప్పో హిట్ కొడతాడేమో డైరెక్టర్ శివనాగు. ఈ సారన్నా అదృష్టం కలిసోస్తుందేమో చూద్దాం.