HomeTelugu... టక్ జగదీష్ పరిచయ వేడుకలో నేచురల్ స్టార్ నాని.

… టక్ జగదీష్ పరిచయ వేడుకలో నేచురల్ స్టార్ నాని.


నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. టక్ జగదీష్ పరిచయ వేడుక కార్యక్రమాన్ని రాజమండ్రిలో చిత్రయూనిట్ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నాని, శివ నిర్వాణ, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌లు పాల్గొన్నారు.

అభిమానులు గర్వపడేలా చేస్తాను..నాని మాట్లాడుతూ.. ‘ఈ క్రౌడ్, సౌండ్‌ను చాలా మిస్ అయ్యాను. ఏడాది నుంచి మీ(అభిమానులు) అందరినీ మిస్ అయ్యాను. ఇలా మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. కానీ మళ్లీ పాత రోజులు వచ్చేశాయ్. కాకపోతే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చేసుకుంటున్నాం. ఈ ఫంక్షన్ ఇక్కడ ఫిక్స్ చేశాక వస్తున్నా రాజమండ్రి అని పోస్ట్ పెట్టాను. అయితే శ్యాం సింఘరాయ్ షూటింగ్ కోసం వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. ఓ సారి షూటింగ్ కోసం వెళ్తుంటే ఓ అభిమాని.. ‘నాని గారు మీకు నేను పెద్ద ఫ్యాన్‌ని.. నాతో సెల్ఫీ దిగకపోతే.. షూటింగ్ జరగనివ్వను’ అని వార్నింగ్ ఇచ్చాడు. ప్రపంచంలో ఒక వార్నింగ్‌ను కూడా అంత ప్రేమగా ఇవ్వగలిగేది ఒక్క రాజమండ్రి వాళ్లే. టక్ జగదీష్ సెలెబ్రేషన్స్ ఇక్కడి నుంచి మొదలుపెట్టడం ఆనందంగా ఉంది. పరిచయ వేడుక అనే ఈవెంట్‌ను ఇక్కడ పెట్టడానికి కారణం ఉంది. ఓ ఫ్యామిలీని మరో ఫ్యామిలీ (రాజమండ్రి)కి పరిచయం చేయాలని ఇక్కడ పెట్టాం. టక్ జగదీష్‌ వాళ్ల అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోకుండా ఏ పని మొదలుపెట్టడు.. అలాగే ఈ నానికి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. మా అమ్మ బ్లెస్సింగ్ లేకపోతే బయటకు వెళ్లను. టక్ జగదీష్ ప్రమోషన్స్ మొదలుపెట్టే ముందు ఇక్కడి (రాజమండ్రి) అమ్మల దగ్గరి నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని అనుకుంటున్నాను. మా అమ్మానాన్నలు నన్ను చూసి గర్వపడుతుంటారు.. అలా నన్ను చూసి అభిమానులు గర్వపడేలా చేస్తాను’ అని అన్నారు. ఆది శేష నాయుడు(నాజర్) మా నాన్న, మా అమ్మ అర్జునమ్మ, బోస్ (జగపతి బాబు ) మా అన్నయ్య.. దేవుడు బావ (రావు రమేష్ ).. సత్తిబాబు బావ(నరేష్).. కుమారక్క (రోహిణి), గంగక్క (దేవదర్శిని) అంటూ సినిమాలోని పాత్రలు, పాత్రధారుల పేర్లను, వారి స్వభావాలను నాని  వివరిస్తూ టక్ జగదీష్ కుటుంబాన్ని అందరికీ పరిచయం చేశారు.

ఏప్రిల్ 23న ‘ట‌క్ జ‌గ‌దీష్’ ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్న‌ది.
తారాగ‌ణం:
నేచుర‌ల్ స్టార్ నాని, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌,  నాజ‌ర్, జ‌గ‌ప‌తి బాబు, రావు ర‌మేష్‌, న‌రేష్‌,  డానియ‌ల్ బాలాజీ,  తిరువీర్, రోహిణి,  దేవ‌ద‌ర్శిని, ప్ర‌వీణ్.
సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: శివ నిర్వాణ‌
నిర్మాత‌లు: సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది
బ్యాన‌ర్‌: షైన్ స్క్రీన్స్‌
సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: ప్ర‌సాద్ మూరెళ్ల‌
ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి
ఆర్ట్‌: సాహి సురేష్‌
ఫైట్స్‌: వెంక‌ట్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌. వెంక‌ట‌ర‌త్నం (వెంక‌ట్‌)
కో- డైరెక్ట‌ర్‌: ల‌క్ష్మ‌ణ్‌ ముసులూరి
క్యాస్టూమ్ డిజైన‌ర్‌: నీర‌జ కోన‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES