భర్త రాక కోసం..భార్య పడే విరహ వేదన నేపథ్యంలో సింగిల్ క్యారక్టర్ తో రూపొందిన చిత్రం `రారా పెనిమిటి`. శ్రీ విజయానంద్ పిక్చర్స్ బేనర్ లో రూపొందిన ఈ చిత్రంలో సింగిల్ క్యారక్టర్ లో నందిత శ్వేత నటించగా సత్య వెంకట గెద్దాడ దర్శకత్వం వహించారు. శ్రీమతి ప్రమీల గెద్దాడ నిర్మాత. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రీ -రిలీజ్ ఏర్పాటు చేశారు…
సంగీత దర్శకుడు మణిశర్మ మాట్లాడుతూ…“దర్శకుడు ఒక మంచి కథతో వచ్చి కలిశారు. మంచి పాటలు చేసే అవకాశం కల్పించిన దర్శకుడు థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇంత వరకు చేసిన కంపోజిషన్ లో నాకు ఇష్టమైన పాటలు ఇందులో ఉన్నాయి. నీలకంఠ చక్కటి సాహిత్యాన్ని సమకూర్చారు. నందిత అద్భుతంగా నటించింది“ అన్నారు.
హీరోయిన్ నందిత శ్వేత మాట్లాడుతూ…“డైరక్టర్ కథ చెప్పి…సింగిల్ క్యారక్టర్ అనగానే … ఈ పాత్ర చేయగలనా అని మొదట భయపడ్డాను. సాహసమే అయినా ఓకే చెప్పాను. ఇలాంటి క్యారక్టర్ చేసే అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నిజంగా ఈ సినిమా చేయడం నా అదృష్టం. డైరక్టర్ గారు చెప్పింది చేసుకుంటూ వెళ్లాను. ఫస్ట్ కాపీ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. కొత్తగా పెళ్లైన అమ్మాయి..తన భర్త రాక కోసం పడే విరహ వేదనే ఈ చిత్రం. అన్ని ఎమోషన్స్ ఈ పాత్రలో ఉన్నాయి. మణిశర్మ గారి సంగీతం ఈ సినిమాకు ప్రాణం. మా నిర్మాత ఎంతో బాగా చూసుకున్నారు. శివశంకర్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ అద్భుతంగా చేశారు. వారు ఇప్పుడు లేకపోవడం బాధాకరం. ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా“ అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ…“ఇప్పుడు వరకు సోలో క్యారక్టర్ తో చాలా చిత్రాలు వచ్చాయి. కానీ విరహ వేదనను కథాంశంగా తీసుకుని సినిమా రావడం ఇదే ప్రథమం. నిజంగా ఇలాంటి సినిమాలు చేయడం సాహసం. ఇలాంటి గొప్ప ప్రయోగం చేయాలంటే అభిరుచి కావాలి. అలాంటి అభిరుచి ఉన్న దర్శక నిర్మాతలను అభినందించి తీరాలి. ఇప్పుడే పాటలు చూసాం. మణిశర్మ గారి సంగీతం, నీలకంఠ గారి సాహిత్యం, నందిత హావభావాలు అద్భుతం. ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే మరెన్నో మంచి చిత్రాలు వస్తాయన్నారు.
నటుడు రాంకీ మాట్లాడుతూ…“ఎంతో గట్స్ ఉంటే కానీ ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేయలేం. నందిత గారు అద్భుతమైన నటన కనబరిచారు. ఒక మంచి సినిమాకు అందరూ సపోర్ట్ చేస్తరు అన్నట్టుగా ఈ చిత్రానికి పెద్ద ఆర్టిస్టులు డబ్బింగ్ చెప్పారు. ఇంత మంచి చిత్రాన్ని మనకు అందిస్తోన్న దర్శక నిర్మాతలను అభినందించి తీరాలి“అన్నారు.
పాటల రచయిత డా. డి.నీలకంఠరావు మాట్లాడుతూ..“మణిశర్మ గారి సంగీతంలో సాహిత్యాన్ని సమకూర్చే అవకాశం రావడం నా అదృష్టం. పాటలకు మంచి స్పందన వస్తోంది. దర్శకుడు నాకు మంచి మిత్రుడు. సినిమా అద్బుతంగా తెరకెక్కించారు. అష్ట విధ లక్షణాలు ఉన్న పాత్రను నందిత గారు అవలీలగా పోషించారు“అన్నారు.
సింగర్ హరిణి ఇవటూరి మాట్లాడుతూ…“మణిశర్మ గారి సంగీతంలో పాడటం అంటేనే అదృష్టం. అలాంటిది ఆయన కెరీర్ లోనే బెస్ట్ కంపోజిషన్ గా రూపొందిన పాటను నేను పాడటం ఎంతో సంతోషాన్నిచ్చింది“ అన్నారు.
దర్శకుడు సత్య వెంకట గెద్దాడ మాట్లాడుతూ…“కొత్తగా పెళ్లైన అమ్మాయి..తన భర్త రాకోసం ఎదరు చూస్తూ పడే విరహ వేదనే ఈ చిత్రం. తన భర్త వచ్చాడా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సింగిల్ క్యారక్టర్ తో రూపొందిన సినిమా ఇది. గ్రామీణ నేపథ్యం లో నడిచే కథ కాబట్టి..ఆ గడుసుతనం ఉన్న అమ్మాయి కావాలని… చాలా మందిని సెర్చ్ చేశాక నందిత గారైతే పర్ఫెక్ట్ అని తీసుకున్నాం. తను నేను అనుకున్న దానికన్నా అద్భుతంగా చేసింది. డైరక్టర్స్ నటి ఆమె. అష్ట లక్షణాలున్న పాత్రను చాలా ఈజీగా చేసింది. మణిశర్మ గారు సినిమా చేయడమే పెద్ద ఎస్సెట్ గా భావిస్తున్నాం. నీలకంఠ నాకు మంచి మిత్రుడు. చక్కటి సాహిత్యాన్ని సమకూర్చారు. రామ్ కుమార్ సినిమాటోగ్రఫీ మరో హైలెట్ గా ఉంటుంది. సింగిల్ క్యారక్టర్ అయినప్పటికీ హీరోయిన్ తో పలు పాత్రలు ఫోన్ లో సంభాషిస్తుంటాయి. ఆ పాత్రలకు బ్రహ్మానందం, తణికెళ్ల భరణి, సునీల్, సప్తగిరి, హేమ, అన్నపూర్ణమ్మ ఇలా పలువురు నటీనటులు డబ్బింగ్ చెప్పారు.వారందరికీ నా ధన్యవాదాలు. సినిమా అంతా పూర్తయింది. త్వరలో విడుదల చేస్తాం“ అన్నారు.
ఈ చిత్రానికి సంగీతంః మణిశర్మ, సాహిత్యంః డా.డి.నీలకంఠరావు, సినిమాటోగ్రఫీః రామ్ కుమార్, పీఆర్వోః రమేష్ చందు, నిర్మాతః శ్రీమతి ప్రమీల గెద్దాడ, రచన-దర్శకత్వంః సత్య వెంకట గెద్దాడ.