దీపావళికి “నమస్తే సేట్ జీ – ఫ్రంట్ లైన్ వారియర్స్” సినీమా నుండి కొత్త పోస్టర్ విడుదల

390

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్ పై తల్లాడ శ్రీనివాస్, మహంకాళి దివాకర్, తల్లాడ సునీల్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న సినిమా ” నమస్తే సేట్ జీ” – ఫ్రంట్ లైన్ వారియర్స్ అనేది ట్యాగ్ లైన్. తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో సాయికృష్ణ, మోనా, స్వప్న చౌదరి, తల్లాడ వెంకన్న, జయ నాయుడు లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా లో జర్నలిస్ట్ పాత్రలో హీరోయిన్ మోనా నటిస్తున్న పోస్టర్ ని దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ చిత్ర బృందం సోషల్ మీడియా లో విడుదల చేసారు. ఈ సందర్భంగా డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ ఫ్రంట్ లైన్ వారియర్స్ అందించిన సేవలు గుర్తు చేసుకుంటూ ఈ కథ సాగనున్నట్లు , అందులో భాగంగా ఒక హీరోయిన్ జర్నలిస్ట్ పాత్రని పోషించింది. ఆ పోస్టర్ ని పండుగ సందర్భంగా విడుదల చేసాం అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ ఒక కిరణా షాపు వ్యక్తి పాత్రలో మా డైరెక్టర్ కమ్ హీరో సాయికృష్ణ కనిపించబోతున్నడు, లాక్డౌన్ సమయంలో కిరణా షాపు వాళ్ళు సైతం ఎన్నో సేవలు అందించారు, ఎన్నో సూపర్ మార్కెట్ లు ఉన్నా సరే, ప్రజలకు మాత్రం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంది కేవలం గల్లీ లో ఉన్న, ఊర్లల్లో ఉన్న కిరణా షాపు లే .. అందుకే యూనివర్సల్ టైటిల్ గా ఉంటుంది అని మా సినిమా కి ” నమస్తే సేట్ జీ – ఫ్రంట్ లైన్ వారియర్స్” అని టైటిల్ ఖరారు చేసాం.

ఈ సినిమా కి కథ మాటలు – శివ కాకు,
రమేష్ కుమార్ వెలుపుకొండ,
కెమెరా – శివ కాకు, వివేకానంద విక్రాంత్,
సంగీతం- రామ్ తవ్వ .