అలాంటి సిత్రాలు` ఒక ప్యూర్ హానెస్ట్ సినిమా – ద‌ర్శకుడు సుప్రీత్ సి. కృష్ణ.

697

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం వైవిధ్య‌మైన క‌థ, క‌థ‌నాల‌తో రూపొందుతున్నచిత్రాల‌కి మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భిస్తోంది. నేప‌థ్యంలో అన్నపూర్ణ ఫిల్మ్‌ స్కూల్ లో స్క్రిప్ట్ & డైరెక్షన్ కోర్స్ లో మాస్టర్స్ పూర్తి చేసి, పూరి జగన్నాధ్ వద్ద రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన సుప్రీత్ సి. కృష్ణ మొదటి ప్రయత్నంలోనే మంచి కాన్సెప్ట్ తో `అలాంటి సిత్రాలు` అనే టైటిల్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఐ &ఐ ఆర్ట్స్, కాస్మిక్ రే ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానినికి రాహుల్ రెడ్డి నిర్మాతగా, ప్రముఖ జర్నలిస్ట్ , శాటిలైట్ & డిజిటల్ కన్సల్టెంట్ కె .రాఘవేంద్రరెడ్డి సమర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ విడుద‌ల కానుంది. ఇటీవ‌ల ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు విడుద‌ల చేసిన టీజ‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల స‌మావేశంలో..

ద‌ర్శ‌కుడు సుప్రీత్ సి. కృష్ణ మాట్లాడుతూ – “ ముందుగా అంద‌రికీ ఒక వివ‌ర‌ణ ఇవ్వాల‌నుకుంటున్నాను. ఈ సినిమా టైటిల్ చూసి చాలా మంది చాలా ర‌కాలుగా అనుకుంటున్నారు. అలాంటిదేం లేదండి ఇది ఒక ప్యూర్ హానెస్ట్ సినిమా. ఆద్యంతం ప్రేక్ష‌కుల‌ను ఎంగేజ్ చేస్తే అంద‌రికీ న‌చ్చే సినిమా. రాఘవేంద్రరెడ్డిగారు మాకు ఫ‌స్ట్ నుండి ఫుల్ స‌పోర్ట్ చేస్తూ ఈ సినిమాకి ఒక బ్యాక్ బోన్‌గా నిల‌బ‌డ్డారు. ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ హార్ట్ అండ్ సోల్ పెట్టి ఈ సినిమాకి వ‌ర్క్ చేశారు. ఒక కొత్త టీమ్ చేస్తోన్న జెన్యూన్ ఎటంప్ట్ ఇది. త‌ప్ప‌కుండా మీ ఆద‌ర‌ణ ఉండాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

ప్రవీణ్ యండమూరి మాట్లాడుతూ – “ ఈ సినిమాలో దిలీప్ అనే క్యారెక్ట‌ర్ చేస్తున్నాను. ఇది నాలుగు పాత్ర‌లు ప్ర‌ధానంగా సాగే ఒక ఆంథాల‌జి ఫిలిం. ఈ సినిమాలో మా ల‌వ్‌స్టోరీ చాల ఎమోష‌న‌ల్‌గా ఉండి క‌న్వీన్సింగ్‌గా ఉంటుంది. ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కుడు స‌ప్రీత్‌కి, మాకు స‌పోర్ట్ చేసిన మా నిర్మాత రాహుల్ రెడ్డి గారికి ఎప్ప‌టికీ రుణ‌ప‌డిఉంటాను. డీఓపి కార్తిక్ అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు“ అన్నారు.

అజయ్ కతుర్వార్ మాట్లాడుతూ – “ఈ సినిమాలో నేను బాక్స‌ర్ రోల్ చేస్తున్నాను. స‌ప్రీత్ నా క్యారెక్ట‌ర్ గురించి చెబుతున్న‌ప్పుడే రెగ్యుల‌ర్‌గా కాదు డిఫ‌రెంట్‌వేలో రియ‌లిస్టిక్‌గా చేద్దాం అని చెప్పారు. చాలా క్లారిటీ ఉన్న డైరెక్ట‌ర్‌. నా పాత్ర‌ని డిఫ‌రెంట్ వేలో పోట్రేట్ చేశారు. నిర్మాత‌లు రాహుల్ రెడ్డి, రాఫ‌వేంద్ర రెడ్డిగారు ఈ క‌థ‌ని జెన్యూన్‌గా తీయ‌మ‌ని ఫుల్ స‌పోర్ట్ చేశారు“ అన్నారు.

నిర్మాత రాహుల్ రెడ్డి మాట్లాడుతూ – “ ఈ క‌థతో రాఘ‌వేంద్ర రెడ్డిగారు మ‌మ్మ‌ల్ని అప్రోచ్ అయ్యారు. మా బేన‌ర్‌లో ఫ‌స్ట్ మూవీ ఇంత మంచి కాన్సెప్ట్ తో వ‌స్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది“ అన్నారు.

యష్ పురి మాట్లాడుతూ – “ న‌న్ను న‌మ్మి ఇంత మంచి పాత్ర ఇచ్చిన ద‌ర్శ‌కుడు సుప్రిత్‌, నిర్మాత‌ల‌కి థ్యాంక్స్‌. సినిమా బ్యూటిఫుల్‌గా వ‌చ్చింది. ఈ సినిమా మార్పు గురించి ఉంటుంది. ఆ చేంజ్‌ అంద‌రినీ ఎలా మార్చింది అనేదే క‌థాంశం“ అన్నారు.

హీరోయిన్ శ్వేతా పరాశర్ మాట్లాడుతూ – “మంచి కాన్సెప్ట్‌తో తీసిన మా సినిమాని అంద‌రూ ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

స‌మ‌ర్ప‌కులు కే. రాఘ‌వేంద్ర రెడ్డి మాట్లాడుతూ – “మా సినిమా టీజ‌ర్ రిలీజ్ చేసి మాకు స‌పోర్ట్ చేసిన దిల్‌రాజు గారికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు“ అన్నారు.

తారాగ‌ణం:
శ్వేతా పరాశర్, యష్ పురి, అజయ్ కతుర్వార్, ప్రవీణ్ యండమూరి

సాంకేతిక బృందం:
సంగీతం: సంతు ఓంకార్, కెమెరా: కార్తీక్ సాయి కుమార్, ఎడిటింగ్ & సౌండ్ డిజైన్: అశ్వథ్‌ శివకుమార్, పీఆర్వో: వంశీ-శేఖర్, దర్శకత్వం: సుప్రీత్ సి. కృష్ణ, నిర్మాత: రాహుల్ రెడ్డి, సమర్పణ: కె. రాఘవేంద్ర రెడ్డి.