సిక్స్ ప్యాక్ బాడీ.. సిక్స్ ఫీట్ కటౌట్ తో అదరగొడుతున్న వరుణ్ తేజ్..

271

ఈ రోజుల్లో సినిమా కోసం హీరోలు ఎంత కష్టపడడానికి అయినా సిద్ధంగా ఉన్నారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఇదే చేస్తున్నారు. ఈయన లేటెస్ట్ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. సినిమా కోసం ట్రాన్స్ ఫామ్ అయిన తీరు అభినందనీయం. ప్రస్తుతం కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న గని సినిమాతో బిజీగా ఉన్నారు. వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం తనని తాను పూర్తిగా మార్చుకున్నారు. ఈయన మేకోవర్ చూసి అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా వారేవా అంటుంది. తాజాగా విడుదలైన వరుణ్ ఫోటోలు చూస్తుంటే ఆయన పడిన కష్టం కళ్ల ముందు కనిపిస్తోంది. సిక్స్ ప్యాక్ బాడీతో ఫిట్ గా కనిపిస్తున్నారు వరుణ్ తేజ్. గ్రీకు శిల్పం లాంటి బాడీ అంటారు కదా.. అలా మారిపోయారు వరుణ్ తేజ్. అచ్చంగా హాలీవుడ్ హీరో మాదిరి ఉన్న ఈయనను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు గని సినిమాను అల్లు అరవింద్ గారి పెద్దబ్బాయి బాబి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మొదటి పాటకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 3న ఈ సినిమా విడుదల కానుంది.