హుషారు లాంటి సూపర్‌హిట్ చిత్రం లో నటించిన తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా వెంకట్ వందెల దర్శకత్వం లో జి వి ఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారధ్యం లో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావు లు సంయుక్తంగా నిర్మిస్తున్నచిత్రం నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా . ఈ చిత్రానికి సంభందించి మొదటి లుక్ ని , మొదటి సాంగ్ ని ఇప్పటికే విడుదల చేశారు. ఫస్ట్ లుక్ కి, మొదటి సాంగ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పడు ఈ చిత్రానికి సంభందించి రెండవ సాంగ్ ని విడుదల చేశారు. రగిలే వయసుని రెచ్చగొట్టి రైకలోరెగిపండుకెక్కిపెట్టి పంటితో పెదవిని కొరికిపట్టి నారాజదెబ్బలు తూటాలే అనే సాంగ్ ని విడుదల చేశారు. సంగీత దర్శకుడు సందీప్ కుమార్ అందించిన ఈ సాంగ్ ని ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ గారు లాంచ్ చేశారు..
ఈ సందర్బంగా చంద్రబోస్ గారు మాట్లాడుతూ.. ఈ సాంగ్ నేను చూసాను, భవ్వ దీప్తి గారి సాహిత్యం కూడా చాలా బావుంది దర్శకుడు వెంకట్ గారికి, ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మల్లేటి నాగేశ్వరావు, నిర్మాతలు ముల్లెటి కమలాక్షి గుబ్బల వెంకటేశ్వరరావు గారికి నా ప్రత్యేఖమైన శుభాకాంక్షలు. ఈ సాంగ్ గొదారిజిల్లాల్లో చాలా ఫేమస్ అవుతుంది. స్పెషల్ సాంగ్ గా వచ్చే ఈ సాంగ్ ని గోదారి జిల్లాల్లో నాటకాల మాదరిగా పాట టేకాఫ్ వుండటం చాలా బాగుంది. ఈ సాంగ్ కి మంచి ఆదరణ లభించాలని కొరుకుంటున్నాను. అన్నారు
దర్శకుడు వెంకట్ వందెల మాట్లాడుతూ.. పల్లెటూరి నేపధ్యం లో సాగే చక్కటి ప్రేమకథ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. ఈ చిత్రం ఫ్యామిలి మరియు యూత్ ని ఆకట్టకుంటుంది. ఈ సాంగ్ ని గొదారి జిల్లాల్లో షూట్ చేశాము. తప్పకుండా యూత్ ని ఆకట్టకుంటుంది. కంటెట్ నమ్మి మా నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదల చేసిన మొదటి సాంగ్ చాలా మంచి ఆదరణ పోందుతుంది. మా చిత్రం మ్యూజికల్ ఎంటర్టైనర్ గా మంచి విజయాన్ని సాధిస్తుంది.ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ గారు ఈ సాంగ్ ని విడుదల చేసారు. ఆయనకి ప్రత్యఖ ధన్యవాదాలు తెలుపుతున్నాను.
నిర్మాత ముల్లేటి నాగేశ్వరావు మాట్లాడుతూ.. తేజ్ కూరపాటి, ఆఖిల ఆకర్షణ లు జంటగా నటించిన మా చిత్రం నుండి సాంగ్ ని విడుదల చేశాము. ఈ సాంగ్ ని ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ గారు చేతుల మీదుగా విడుదల చేశాము. ఈ సాంగ్ యూత్ అందర్ని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం చక్కటి ఫ్యామిలి ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు
నటీనటులు
తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ , తణికెళ్ళ భరణి, కల్పనా రెడ్డి, జీవా, జొగి బ్రదర్స్, అనంత్, బస్టాప్ కోటేశ్వరావు, డాక్టర్ ప్రసాద్, మాధవి ప్రసాద్, సునీత మనోహర్ తదితలురు నటించగా
సాంకేతికనిపుణులు
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్.. ముల్లేటి నాగేశ్వరావు
నిర్మాతలు.. ముల్లేటి కమలాక్షి, గుబ్బుల వెంకటేశ్వరావు
కథ-స్క్రీన్‌ప్లే- మాటలు దర్శకత్వం.. వెంకట్ వందెల
సినిమాటోగ్రఫి.. పి.వంశి ప్రకాష్
సంగీతం.. సందీప్ కుమార్
స్క్రీన్‌ప్లే- పాటలు.. డాక్టర్ భవ్య ధీప్తి రెడ్డి
ఎడిటర్.. నందమూరి హరి
స్టంట్స్.. రామ కృష్ణ
కొరియోగ్రఫి.. గణేష్ మాస్టర్, నండిపు రమేష్
Eluru Sreenu
P.R.O