పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో `ముఖ్య‌గ‌మ‌నిక‌`

167

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌జిన్ విరాన్ ముత్తం శెట్టి హీరోగా న‌టిస్తోన్న‌ సినిమా `ముఖ్య గ‌మ‌నిక‌`. సీనియ‌ర్‌ సినిమాటోగ్రాఫ‌ర్ వేణు ముర‌ళీధ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. లావ‌ణ్య హీరోయిన్‌గా న‌టిస్తోంది. శివిన్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రాజ‌శేఖ‌ర్‌, సాయికృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ సింగిల్ `ఆ క‌న్ను చూపుల్లోనా..`కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక తాజాగా రిలీజైన ముఖ్య గ‌మ‌నిక టీజ‌ర్ యూట్యూబ్‌లో 12లక్ష‌ల‌కి పైగా వ్యూస్ సాధించింది. దీంతో ప్రేక్ష‌కుల్లో ట్రైల‌ర్‌పై మ‌రింత ఇంట్రెస్ట్ క్రియేటైంది. ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని శ‌ర వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుప‌కుంటోంది. ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో గ్రాండ్‌గా ట్రైల‌ర్‌ని రిలీజ్ చేసి..ఇక ఫిబ్ర‌వ‌రి మూడో వారంలో సినిమాని రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు..ఈ సంద‌ర్భంగా..

నిర్మాత రాజ‌శేఖ‌ర్‌ మాట్లాడుతూ.. ‘మా బేన‌ర్‌లో రూపొందుతున్న ఫ‌స్ట్‌మూవీ `ముఖ్య‌గ‌మ‌నిక`ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కి వ‌స్తోన్న రెస్పాన్స్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాం. ఫ‌స్ట్‌సింగిల్‌ను ద‌ర్శ‌కుడు బాబీగారు రిలీజ్ చేయ‌గా టీజ‌ర్‌ను ద‌ర్శ‌కుడు మారుతి విడుద‌ల చేశారు. త్వ‌ర‌లో మ‌రో సెల‌బ్రిటీ ట్రైల‌ర్‌ను లాంచ్ చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతున్నాయి. అతి త్వ‌ర‌లో విడుద‌ల తేధిని ప్ర‌క‌టిస్తాం. త‌ప్ప‌కుండా మా టీమ్ అంద‌ర‌కీ బెస్ట్ డెబ్యూ మూవీ అవుతుంద‌ని ఆశిస్తున్నాను“ అన్నారు

విరాన్ ముత్తం శెట్టి, లావ‌ణ్య హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి

ద‌ర్శ‌కత్వం: వేణు ముర‌ళీధ‌ర్.వి
బేన‌ర్: శివిన్ ప్రొడ‌క్ష‌న్స్‌
నిర్మాత‌లు: రాజ‌శేఖ‌ర్, సాయికృష్ణ‌
సంగీతం: కిర‌ణ్ వెన్న‌
సింగ‌ర్స్‌: న‌కాశ్ అజీజ్, రేవ‌తి శ్రిత‌
ఎడిట‌ర్‌: శివ శార్వాణి
పీఆర్ఓ: శ్రీ‌ను – సిద్ధు.
Siddu..
9052089496