HomeTeluguఅయోధ్య రాముడికి మిషన్ సి 1000 సినిమా పాట అంకితం

అయోధ్య రాముడికి మిషన్ సి 1000 సినిమా పాట అంకితం

అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణం ప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో శ్రీరామచంద్ర భగవానుడికి అంకితం ఇస్తూ ఎస్ వి క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ‘మిషన్ సి 1000’ సినిమా యూనిట్ శ్రీరాముడి పాటను విడుదల చేశారు.
బిజేపి గోల్కొండ జిల్లా ప్రధాన కార్యదర్శి టి. ఉమమహేంద్ర ఆవిష్కరించారు. సంగీత దర్శకుడు శ్రీధర్ ఆత్రేయ ఈ సంగీతం అందించారు. రాముడి పాటను విజయ్ ప్రకాష్ ఆలపించారు. తేజేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అన్ని పనులు పూర్తి చేసి మార్చి లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు తేజేశ్వర్ చెప్పారు.
ఈ సినిమాలో తేజేశ్వర్, ప్రజ్ణ నయన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రల్లో జేపీ, సుధ, కబీర్ సింగ్, సంజయ్ పాండే, అనీష్ కురువిల్లా నటించారు. స్పెషల్ క్యారెక్టర్ లో కాళిచరణ్ మహారాజ్ నటించారు.
ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ సుధాకర్ , సంగీతం శ్రీధర్ ఆత్రేయ, పాట జేవిపి, కొరియోగ్రఫీ గణేష్ స్వామి, స్టంట్స్ జాషువా, కథ, కథనం, డైరెక్టర్ తేజేశ్వర్

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES