HomeCeleb Interviewsకమర్షియల్‌ ఎలిమెంట్స్ ఉన్న ల‌వ్‌స్టోరీ `మిస్ మ్యాచ్‌` ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది - హీరో ఉద‌య్ శంక‌ర్‌

కమర్షియల్‌ ఎలిమెంట్స్ ఉన్న ల‌వ్‌స్టోరీ `మిస్ మ్యాచ్‌` ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది – హీరో ఉద‌య్ శంక‌ర్‌

‘ఆటగదరా శివ’ లాంటి డీసెంట్‌ హిట్‌ చిత్రంలో సహజమైన నటనతో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పు కున్నారు యంగ్‌ హీరో ఉదయ్‌ శంకర్‌. ప్రస్తుతం ఉదయ్‌ శంకర్‌, ఐశ్వర్య రాజేష్‌ జంటగా అధిరోహ్‌ క్రియేటివ్‌ సైన్స్‌ ఎల్‌.ఎల్‌.పి బేనర్‌ పై జి.శ్రీరామ్‌ రాజు, భరత్‌రామ్‌ నిర్మిస్తున్న చిత్రం ‘మిస్‌ మ్యాచ్‌’. డా.సలీమ్‌ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొం దించిన ఎన్‌.వి. నిర్మల్‌ కుమార్‌ ఈ చిత్రానికి దర్శ కత్వం వహిస్తున్నారు. డిసెంబర్‌ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా హీరో ఉదయ్‌ శంకర్‌ ఇంటర్వ్యూ..

మీ గురించి చెప్పండి?
– మా అమ్మగారిది మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని జడ్చర్ల గ్రామం. నాన్నగారిది గద్వాల దగ్గరున్న మల్దకల్‌. నా స్కూలింగ్‌ అంతా నిజామాబాద్‌లో గడిచింది. ప‌ద‌వ త‌ర‌గతి వ‌ర‌కు అక్క‌డే చ‌దువుకున్నాను. గుంటూరు వికాస్‌ కాలేజీలో ఇంటర్మీడియెట్‌ చదివాను. తర్వాత అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి ఎంఏ సోషియాలజీ చేశాను. నాకు ముందు నుండి న‌ట‌న అంటే చాలా ఆస‌క్తి. అందుక‌నే నేను బీడీఎస్‌లో రెండేళ్లు చ‌దివి మానేశాను. నాన్న ఇంగ్లీష్‌ లెక్చరర్‌గా రిటైర్‌ అయ్యారు. ఫిలాసఫీపై చాలా పుస్తకాలు రాశారు. వాటి ద్వారానే సినీ రాజకీయ ప్రముఖులతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది

తొలి సినిమాగా `ఆట‌గ‌ద‌రా శివ` వంటి డిఫ‌రెంట్ సినిమా ఎందుకు చేశారు?
– నేను ‘లింగ‌, ప‌వ‌ర్‌’లో చిన్న చిన్న పాత్ర‌ల్లో న‌టించాను. అప్పుడు రాక్‌లైన్‌గారితో మంచి అనుబంధం ఏర్ప‌డింది. క‌న్న‌డంలో విజ‌య‌వంత‌మైన `రామా రామా రే`ను తెలుగులో రీమేక్ చేయాల‌నుకున్న‌ప్పుడు నేను సినిమా చూసి హీరో పాత్ర చేస్తాన‌న్నాను. సినిమా కోసం ఏడాది కాలం తీసుకుని జుట్టు పెంచి న‌టించాను. ఈ సినిమా చేసిన త‌ర్వాత తొలి సినిమాకే డిఫ‌రెంట్‌గా చేశాడురా అని అన్నారంద‌రూ. త్రివిక్ర‌మ్‌గారిని రీసెంట్‌గా కలిసిన‌ప్పుడు `ఆట‌గ‌ద‌రా శివ‌` సినిమా చూశాను. చాలా బావుంది. బాగా యాక్ట్ చేశావ‌ని అప్రిషియేట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది.

డైరెక్టర్‌గా నిర్మల్‌ కుమార్‌ ఎవరి ఛాయిస్‌?
– భూపతిరాజా గారే సజెస్ట్‌ చేశారు. ఆయనకూ కథ నచ్చి ఈ మూవీని డైరెక్ట్‌ చేశారు. నిర్మ‌ల్‌గారు, భూప‌తిరాజాగారికి మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాకు డైరెక్ట‌ర్‌గా ఎవ‌రిని తీసుకుందాం అని ఆలోచించుకుంటున్న‌ప్పుడు భూప‌తిగారు నిర్మ‌ల్‌గారైతే సూట్ అవుతార‌ని చెప్పారు. నిర్మ‌ల్‌గారిని పిలిచి క‌థ వినింపించారు. ఆయ‌న‌కు న‌చ్చింది. ఆయ‌న‌కు ఇందులో కథతో పాటు హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్లు బాగా నచ్చాయి. ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఉన్న కథ.

ఐశ్వర్యా రాజేశ్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం?
– ఇది యాక్ట‌ర్‌గా నాకు రెండో సినిమానే, ఐశ్వ‌ర్య‌గారు ఇప్ప‌టికే పాతిక సినిమాలు పైగా చేశారు. ఎలాగా అనుకున్నాను. అయితే నా పాత్ర ప‌రంగా నేను న్యాయం చేయాల‌ని క‌ష్ట‌ప‌డ్డాను. ఐశ్వ‌ర్య‌గారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమె నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌, తమిళంలో స్టార్‌ అయిన ఐశ్వర్యా రాజేశ్‌ మంచి పెర్ఫార్మర్‌. నటన విషయంలో ఆమెతో నేను మిస్‌ మ్యాచ్‌ కాకూడదు. ఫస్ట్‌ టైం నాలో నెర్వస్‌నెస్‌ తను గమనించి, ”టెన్షన్‌ పడకు. ఒక ఫ్రెండ్‌ అనుకొని చెయ్యి” అని చెప్పింది. దాంతో నా ఫోకస్‌ నా క్యారెక్టర్‌ పై పెట్టి చేశాను. నేను బాగా చేశానంటే కారణం… డైరెక్టర్‌తో పాటు ఐశ్వర్య కూడా.

‘ఈ మనసే..’ సాంగ్‌ను రీమిక్స్‌ చేశారు కదా! దాని గురించి చెప్పండి?
-నేను ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారికి పెద్ద ఫ్యాన్‌ని. ‘తొలిప్రేమ’ నా ఫేవరెట్‌ ఫిల్మ్‌. ‘ఈ మనసే’ నా ఆల్‌టైం ఫేవరెట్‌ సాంగ్‌ కూడా. `తొలిప్రేమ` సినిమా చూసిన‌ప్పుడు నేను భ‌విష్య‌త్తులో హీరో అయ్యి.. ఓ ల‌వ్‌స్టోరీ చేస్తే అందులో ఈ పాట‌ను రీమేక్స్ చేయాల‌ని అనుకున్నాను. ఎలాగూ ఇది లవ్‌స్టోరీ కాబ‌ట్టి ఆ పాట‌ను ఇందులో తీసుకోవ‌చ్చా? అని భూపతిరాజాగారిని అడిగాను. ఆయ‌న క‌థ ఫ్లో ఎక్క‌డా మిస్ కాకుండా సెకండాఫ్‌లో పాట‌ను యాడ్ చేయ‌వ‌చ్చ‌ని అన్నారు.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌?
– ప్ర‌స్తుతం ఈ సినిమాపైనే దృష్టి . త‌ర్వాతే ఏ సినిమా చేయాల‌ని ఆలోచిస్తా . అయితే ఇప్ప‌టికే రెండు, మూడు క‌థ‌లు ఫైన‌ల్ చేసుకుని ఉన్నాను అన్నారు హీరో ఉదయ్ శంకర్

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES