మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్న “A” చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్.

909

థ్రిల్లర్ జోనర్లో వస్తున్న తెలుగు సినిమా అనగానే ఏదో ఒక ఇంటర్నేషనల్ సినిమా నుంచి ఇన్స్ పైర్ అయి ఉంటుందని అనుకుంటారు . కానీ తొలిసారి ఓ తెలుగు సినిమా ఇప్పటివరకు ప్రపంచంలో ఏ భాషలో రానటువంటి సరికొత్త కథాంశం తో తెరకెక్కిన అసలుసిసలైన థ్రిల్లర్ “A”, అవంతిక ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోంది. ఇటీవల రిలీజైన టైటిల్ పోస్టర్ కి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి సినిమాలోనే 3 పాత్రల్లో నటిస్తున్న నితిన్ ప్రసన్న దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని, పాత్రల మధ్య వ్యత్యాసం కొరకు ఎన్నో గెటప్స్ ని ట్రై చేస్తూ, నెలల తరబడి రెహార్సల్స్ చేసి ,అద్భుతంగ పోషించి అందరిని మెప్పించాడు . బడ్జెట్ పరిమితిని దాటకుండా, సాధ్యమైనంత వరకు VFX ఉపయోగాన్ని తగ్గించి, పాత కెమెరా ట్రిక్ లను వాడి, మూడు పాత్రలు గల సన్నివేశాలని చిత్రీకరించారు. దీనికోసం సినిమా లోని ప్రతి ఫ్రేమ్ కు స్టోరీబోర్డ్ గీయించారు.

డైరెక్టర్ యుగంధర్ ముని మాట్లాడుతూ… ఈ సన్నివేశాల చిత్రీకరణకు ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారిని ఆదర్శంగా తీసుకున్నానన్నారు. కంటెంట్ పరంగా తెలుగు సినిమా స్థాయిని మా “A ” చిత్రం మరింత పెంచేలా ఉంటుందని గర్వంగా చెప్పగలమన్నారు.
నితిన్ ప్రసన్న ; ప్రీతీ అశ్రాని ( మళ్లీరావా , ప్రెసర్ కుక్కర్ ); స్నేహల్ కమత్; బేబీ దీవెన (జబర్దస్త్); రంగధామ్ ; కృష్ణవేణి; భరద్వాజ్