ఎఫ్3′ ట్రైలర్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఎఫ్3 టీమ్

494

విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఫన్ ఫ్రాంచైజీ ఎఫ్3తో థియేటర్లలో నవ్వులు పంచడానికి సమ్మర్ సోగ్గాళ్ళుగా రాబోతున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ రోజు విడుదలైన అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫుల్ ‘ఎఫ్3’ థియేట్రికల్ ట్రైలర్‌ కు అన్నీ వర్గాల ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. ఫన్ బ్లాస్ట్ ‘ఎఫ్3’ ట్రైలర్ సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్ ఎఎంబీ సినిమాస్ లో నిర్వహించారు. ఈ వేడుకలో వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, నిర్మాత శిరీష్, మెహ్రీన్, సోనాల్ చౌహాన్, అలీ, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎఫ్ 2కంటే ఎఫ్ 3 అద్భుతమైన నవ్వులు పంచాలని సినిమా చేశాం. కోవిడ్ తర్వాత నా రెండు సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. ఎఫ్ 3 తో మీ అందరినీ థియేటర్ లో కలుసుకోవడం ఆనందంగా వుంది. దిల్ రాజు గారు , శిరీష్, అనిల్ రావిపూడి మంచి వండర్ ఫుల్ స్క్రిప్ట్ తో వచ్చారు. ఫ్యామిలీ అంతా కలసివచ్చి ఎంజాయ్ చేసే సినిమా ఎఫ్ 3. మే 27 సినిమా థియేటర్ లోకి వస్తుంది. ఫ్యామిలీ అంతా కలసి సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ఎఫ్2 మాకు ప్రాక్టీస్ మ్యాచ్ లాంటింది. ఎఫ్ 3 మెయిన్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో సిక్స్ కాదు బాల్ స్టేడియం బయటికి వెళుతుంది. కోవిడ్ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. కానీ మనందరికీ నవ్వులు తీసుకొచ్చే చిత్రం మాత్రం ఎఫ్ 3. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీస్ తో వచ్చి సినిమా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం వుంది. ట్రైలర్ లో చూపించింది సినిమాలో ఒక్క శాతం మాత్రమే. సినిమాలో డబుల్ ఫన్ వుంటుంది, వెంకటేష్ గారితో పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. ఎఫ్ 2కి మించి ఎంజాయ్ చేశాం” అన్నారు