‘‘లవ్ స్టోరీ’’ మూవీ నుండి సాయిపల్లవి బర్త్ డే పోస్టర్ రిలీజ్

787

హీరోయిన్స్ లో ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్సా యిప‌ల్ల‌వి. త‌న అంద‌మైన న‌ట‌న‌కు ఆక‌ర్షించ‌బ‌డ‌ని ప్రేక్ష‌కులుండ‌రు.భానుమ‌తిగా ఫిదాతో ప‌రిచ‌యం అయిన సాయి ప‌ల్ల‌వి త‌న సినిమాల‌లో త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూ కెరియ‌ర్ ని లీడ్ చేస్తుంది. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో మ‌రోసారి మ్యాజిక్ చేసేందుకు ల‌వ్ స్టోరీ తో సిద్దం అవుతుంది. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్ క్రేజ్ ల‌వ్ స్టోరీ పై అంచ‌నాల‌ను మ‌రింత పెంచింది. ఇప్పటికే విడుద‌లైన ఫస్ట్ లుక్, ‘‘ఏయ్ పిల్లా’’ సాంగ్ కు విశేష‌మైన స్పంద‌న ల‌భించింది. ల‌వ్ స్టోరీ కి ఇంకా 15 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. లాక్ డౌన్ త‌ర్వాత అప్ప‌టి పరిస్థితుల్ని బేరీజు వేసుకొని షూటింగ్ ప్లాన్ చేస్తుంది యూనిట్. శేఖ‌ర్ క‌మ్ముల సినిమాల‌లో క‌థానాయిక‌లు ఎంత హుందాగా ఉంటారో అంద‌రికీ తెలిసిందే.. భావోద్వేగాల‌తో నిండుకున్న ప్రేమ‌క‌థ‌ల‌తో సెల్యులాయిడ్ పై శేఖ‌ర్ చేసే మ్యాజిక్ ని మ‌రోసారి రిపీట్ అయ్యేటట్టు కనిపిస్తోంది.హీరోయిన్ సాయిపల్లవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా టీం విడుద‌ల చేసిన పోస్ట‌ర్ లో సాయి ప‌ల్ల‌వి మ‌రింత అందంగా క‌నిపించింది. వర్షంలో ఆడుతున్న సాయి పల్లవి స్టిల్ కు సోష‌ల్ మీడియాలో అద్భుత‌మైన స్పంద‌న ల‌భిస్తుంది.
‘‘లవ్ స్టోరీ’’ సినిమాను ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంట గా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి
సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్
ఆర్ట్: రాజీవన్
పి.ఆర్.వో -జి.ఎస్.కె మీడియా
మ్యూజిక్ : పవన్ సి.హెచ్
నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి.రామ్మోహన్ రావు
రచన- దర్శకత్వం : శేఖర్ కమ్ముల.