బిగ్ బాస్ ఫేమ్ పృథ్వి, ప్రవీణ్ K.V, వైష్ణవి,యసికా హీరో హీరోయిన్స్ గా ప్రవీణ్ KV దర్శకత్వంలో స్క్రీన్ ప్లే పిక్చర్స్ పతాకం పై రమనారెడ్డి, మధుసూదన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం మహిష, చిత్రం ట్రైలర్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్ లో వైభంగా జరిగింది. ఈ ట్రైలర్ లాంచ్ ఉప్పల చారి ట్రబుల్ ట్రస్ట్ చైర్మన్, తెలంగాణ మిషన్ భగీరథి చైర్మెన్ ఉప్పల వెంకటేష్ గారు, రంగారెడ్డి బ్యాంక్ చైర్మన్ బచ్చు బద్రినారాయణ గారు డాక్టర్ అనిల్ గారి చేతుల మీధుగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, హీరో ప్రవీణ్ KV మాట్లాడుతూ సినిమా చాలా బాగా వచ్చింది ఈ ట్రైలర్ చూసిన తరువాత చాలా ఆనందం వేసింది కష్ట పడి ఇష్టపడి తీసిన చిత్రం ఇది. నటుడిగా దర్శకుడిగా ఈ చిత్రం నాకు చాలా సంతృప్తి నిచ్చింది. సినిమా సెన్సార్ పూర్తిచేసుకుంది . మన సినిమాని U/A గా సెన్సార్ బోర్డు గుర్తించారు. జనవరి లో మా చిత్రం థియేటర్స్ లో రానుంది. తప్పకుండా ఈ చిత్రం ను అందరూ ఆదరించి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నిర్మాత మధుసూదన్ రావు మాట్లాడుతూ…మన తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని కొత్తవాళ్లను ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందుంటారు. చిత్రంలో నడుడుగా, నిర్మాతగా రెండు భాధ్యతలు నిర్వహించాను తప్పకుండా ఈ చిత్రం ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మీ బ్లెసింగ్స్ కావాలని కోరుకుంటున్నాను. ఉప్పల వెంకటేష్ గారు మాట్లాడుతూ , ట్రైలర్ చాలా బాగుంది, పాటలు కూడా అర్థవంతం గా ఉన్నాయి.. సినిమా రంగం డబ్బు, పేరు ఉన్నవారికి మాత్రమే కాదు అని ప్రవీణ్ KV గారు ఈ సినిమా ద్వారా నిరూపించారు అని అభినందించారు. హీరోహిన్స్ వైష్ణవి మాట్లాడుతూ ఈ చిత్రంలో పాటలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. గోవాలో తీసిన సాంగ్ హైలెట్ గా నిలుస్తాయని అన్నారు. శ్రీ వెంకట్ మ్యూజిక్ అద్భుతంగా అందించాడు. బద్రి నారాయణ గారు మాట్లాడుతూ ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది మీ అందరి సపోర్ట్ ఈ సినిమాకి కావాలి అన్నారు. ఈ చిత్రంలో నటించిన మిగితా నటి నటులు తదితరులు ఉన్నారు. ఈ చిత్రం కు సంగీతం శ్రీ వెంకట్, D.O.P సతీశ్ & వివేక్, ఎడిటర్ M.N.R, P.RO బాబు నాయక్.
అత్యంత వైభవంగా మహిషా మూవీ ట్రైలర్ లాంచ్
RELATED ARTICLES