అక్టోబర్ 12 న ప్రేక్షకుల ముందుకు “మా ఊరి సిన్మా “

118


శ్రీ మంజునాథ సినిమాస్ పతాంపై పులివెందుల మహేష్, ప్రియ పాల్ జంటగా శివరాం తేజ దర్శకత్వంలో జి. మంజునాధ్ రెడ్డి నిర్మించిన యాక్షన్ ఎంటర్ టైనర్ “మా ఊరి సిన్మా”. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సదర్భంగా చిత్ర నిర్మాత జి. మంజునాథ రెడ్డి మాట్లాడుతూ మా సిన్మా పాటల వల్ల ట్రెండింగ్ అవ్వడం, ఊహించని అప్రిషియేషన్ రావడం హ్యాపీ గా వుంది., అలాగే మా ఊరి సిన్మా బాగుందని , సిన్మా చూసిన పెద్దలు అభినందిస్తూ వుంటే సంతోషంగా వుంది. ఇది సమిష్టి కృషి పలితం.మేము చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకులు కూడా మెచ్చు కుంటారని ఆశిస్తున్నాను. ఇంత మంచి సినిమాను నిర్మించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు తెలుపుకంటున్నాను అక్టోబర్ 12 న రాబోతున్న మా సినిమాను చుసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.

చిత్ర దర్శకులు శివరాం తేజ మాట్లాడుతూ ” ఇదొక ఊరిలో జరిగే ఇన్స్పైరబుల్ సబ్జెక్ట్ ఇది.మా సినిమా కోసం మా టీమ్ చాలా కష్ట పడ్డారు. వాళ్ళు పడ్డ కష్టం ఈ రోజు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలాగే నన్ను నమ్మి ఈ సినిమా నిర్మించిన మంజునాథ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.”అన్నారు.
పులివెందుల మహేష్, ప్రియపాల్, మైఖేల్ సిద్దు (విలన్)మంజు నాథ్ రెడ్డి, మహేష్ విట్టా, ముఖేష్ , అనంత లక్ష్మి, రమణి, కృష్ణ మోహన్, నేహరెడ్డి, నవనీత్ హరి తదితరులు నటించిన ఈ చిత్రానికి
కెమెరా: దర్మా ప్రభ, సంగీతం: ఎస్.కె.బాజీ, కలరిస్ట్: రత్నాకర్ రెడ్డి
లిరిక్స్ : రాంబాబు గోసాల ఆడియో గ్రఫి: శ్రీ మిత్ర,
సింగర్స్: ఉష, ఇంద్రావతి చౌహాన్
మూల కథ: పులివెందుల మహేష్
పి ఆర్ ఓ:B. వీరబాబు
నిర్మాత: జి. మంజునాథ్ రెడ్డి
డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శివరాం తేజ.