*ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘రుద్రాక్షపురం’*

600


టెన్ ట్రీస్ ఫిలిం ప్రొడక్షన్ హౌస్ పతాకంపై సీనియర్ నటుడు నాగమహేశ్, పి‌ఆర్‌ఓ వీరబాబు ప్రధాన పాత్రలలో ఆర్.కె. గాంధీ దర్శకత్వంలో నిర్మాత కనకదుర్గ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం’. 2018లో అనంతపురం జిల్లాలో జరిగిన యధార్థ సంఘటనను ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మణి సాయితేజ, వైడూర్య, పవన్ వర్మ, వర్షిత, రాజేశ్ రెడ్డి, అక్షర నిహా, ఆనంద్ తదితరులు ఇతర పాత్రలలో నటిస్తోన్న ఈ చిత్రం, ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని సెకండ్ షెడ్యూల్‌కి రెడీ అవుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత కనకదుర్గ రాజు మాట్లాడుతూ.. ‘‘ఇటీవల మియాపూర్ గెస్ట్ హౌస్‌లో ‘రుద్రాక్షపురం’ చిత్ర పూజా కార్యక్రమాలు లాంఛనంగా జరిగాయి. నటుడు రాజేంద్ర మొదటి దృశ్యానికి క్లాప్ కొట్టి శుభాశీస్సులు అందించారు. మియాపూర్, బాచుపల్లి పరిసర ప్రాంతాలలో చేసిన చిత్రీకరణతో మొదటి షెడ్యూల్ పూర్తయింది. సెకండ్ షెడ్యూల్ శ్రీశైలం‌లో ప్లాన్ చేశాము. మా దర్శకుడు ఆర్.కె. గాంధీ పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో చిత్రీకరణ చేస్తున్నారు. సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు..’’ అని తెలిపారు.

దర్శకుడు ఆర్ కె గాంధీ మాట్లాడుతూ.. ‘‘2018లో అనంతపురం జిల్లాలో జరిగిన యధార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ చిత్ర కథను రాసుకోవడం జరిగింది. నిర్మాత కనకదుర్గ రాజుగారికి కథ బాగా నచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు నాగమహేశ్, పి‌ఆర్‌ఓ వీరబాబు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. మంచి తారాగణం, సాంకేతిక నిపుణులు కుదిరారు. సినిమా చాలా బాగా వస్తుంది. ఫస్ట్ షెడ్యూల్ శరవేగంగా పూర్తి చేశాము. రెండో షెడ్యూల్‌ శ్రీశైలంలో త్వరలో ప్రారంభం కానుంది. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాము..’’ అని తెలిపారు.

నాగమహేశ్, పి‌ఆర్‌ఓ వీరబాబు, మణి సాయితేజ, వైడూర్య, పవన్ వర్మ, వర్షిత, రాజేశ్ రెడ్డి, అక్షర నిహా, ఆనంద్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ: నాగేంద్ర కుమార్
సంగీతం: ఘంటాడి కృష్ణ
ఫైట్స్: థ్రిల్లర్ మంజు
ఎడిటింగ్: మల్లి
డ్యాన్స్: అన్నారాజ్
నిర్మాత: కనకదుర్గ రాజు
కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్.కె. గాంధీ