“ఉప్పెన” లాంటి ఒక అద్భుతమైన సినిమా ఇచ్చి నన్ను నిజమైన గురువుని చేసాడు బుచ్చి- బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్.

38

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ కృతి శెట్టి హీరోయిన్ గా నవ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై డేరింగ్ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన అద్భుత ప్రేమ కావ్యం “ఉప్పెన”. ఫిబ్రవరి 12న వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లలో విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టుకొని యునానిమస్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.. ఈ సందర్బంగా సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు..

బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. ‘ సినిమా రిలీజ్ అయిన అన్నిచోట్లనుండి సునామియస్ హిట్ టాక్ వచ్చింది.. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు చాలా చాలా థాంక్స్. నాకు ఇది అద్భుతమైన క్షణం. ఒక శిష్యుడు గురువుని చేసిన రోజు ఇది. ఉప్పెన లాంటి ఒక అద్భుతమైన సినిమా ఇచ్చి నన్ను నిజమైన గురువుని చేసాడు బుచ్చి. చాలా గొప్పగా ఫీలవుతున్నాను. నేను ఎప్పుడూ ఎరా, ఏంట్రా బుచ్చి అని పిలిచేవాడ్ని.. కానీ ఈ సినిమా చూసి బయటికి వచ్చి ఎరా బుచ్చి అని పిలవటానికి సంకోచించి.. బుచ్చి అన్నాను.. అదే ఈ సినిమాక సక్సెస్ కి నిదర్శనం. ఒక డైరెక్టర్ గా నాకు బుచ్చిమీద అంత రెస్పెక్ట్ వచ్చేసింది. తను రాసుకున్న కథని అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు. ఒక కొత్త డైరెక్టర్ లా చేసినట్టు లేదు..ఎంతో ఎక్స్ పీరియెన్స్ ఉన్న డైరెక్టర్ లా “ఉప్పెన” చిత్రాన్ని వండర్ ఫుల్ గా తీశాడు. ప్రీ- రిలీజ్ లో నేను అన్నట్లు ఇది వంద కోట్ల సినిమా.. అది త్వరలో రుజువు కాబోతుంది.. అన్నారు.

నిర్మాతలు నవీన్ ఎర్నేని మాట్లాడుతూ.. ఉప్పెన రిలీజ్ అయిన అన్ని చోట్లనుండి యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. మా బ్యానర్ లో ఇప్పటివరకు 9 సినిమాలు తీశాం. ఫస్ట్3మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.. మళ్ళీ ఉప్పెన చాలా పెద్ద హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన బుచ్చికి, ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు.. అన్నారు.

దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. ఉప్పెన చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.. అన్ని ఏరియాలనుండి పెద్ద హిట్ టాక్ వచ్చింది.. మా గురువు గారు సుకుమార్ గారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా చిత్రాన్ని ఆదరించి పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు, మెగాభిమానులకు నా ధన్యవాదాలు.. అన్నారు.

Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385