అనసూయ ‘కథనం’ ట్రైలర్ లాంచ్

675

ది గాయత్రి ఫిలిమ్స్ మరియు ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కథనం’. రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించగా, బి నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రం ఈనెల 9న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఈ దిశలో భాగంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ట్రైలర్ ను సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు చేతుల మీదుగా విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో లో నిర్మాత మాట్లాడుతూ ‘ సెలవులు కలిసొస్తుండడం, దగ్గర్లో సరైన మరో విడుదల తేదీ లభించక ఆగస్టు 9న వస్తున్నాం. పెద్ద చిత్రంతో పోటీ పడాలని కాదు’ అని చెప్పారు.

అనసూయ మాట్లాడుతూ ‘నాగార్జున గారు నా ఫెవరేట్ హీరో. ఆయన సినిమా పోస్టర్ (మన్మధుడు 2), నా సినిమా పోస్టర్ ఒకే రిలీజ్ టైమ్ కి చూస్తాననుకోలేదు. ఇది ఆయనతో పోటీ పడటం కాదు.. పైగా రెండు చిత్రాలు వేర్వేరు జానర్స్. డబ్బుతో ముడిపెట్టి పెద్ద సినిమా, చిన్న సినిమా అనడం సరికాదు. ప్రేక్షకులకు నచ్చిందే పెద్ద సినిమా, నచ్చకపోతే అది సినిమానే కాదు. ధనరాజ్ వల్లే ఈ చిత్రంలో నటించాను. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో పాట ఒక్కటే. రోషన్ చక్కని నేపథ్య సంగీతం అందించాడు. సతీష్ కెమెరా వర్క్ నాలో కాన్ఫిడెన్స్ నింపింది. సినిమా మెప్పిస్తుందనే నమ్మకముంది’ అని చెప్పారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘మన్మధుడు 2 లాంటి పెద్ద సినిమాకు ఏమాత్రం తీసిపోని రీతిలో ప్రచారం చేస్తున్నాం. నైజాంలో దిల్ రాజు గారు విడుదల చేయడం హ్యాపీ. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అన్నాడు.

ధనరాజ్ మాట్లాడుతూ ‘బాగమతి తర్వాత మళ్ళీ అంత మంచి పాత్ర ఈ సినిమాలో లభించింది. సినిమా చూశాను.. మెప్పిస్తుందనే నమ్మకముంది’ అన్నాడు.

నిర్మాతలు మాట్లాడుతూ :-సినిమా అనుకున్న విదంగా బాగా వచ్చింది ..మంచి డేట్ దొరకడం తో ఈ నెల 9 వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నాము ..అనసూయ నటన సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది ..సెన్సార్ సభ్యులు సినిమా చూసి అబినందించడతో సినిమా పై మాకు మరింత నమ్మకం పెరిగిందని అన్నారు ..

అనసూయ భరద్వాజ్, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రణధీర్, ధన్ రాజ్, పృధ్వి, సమీర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్: ఎస్. బి. ఉద్ధవ్, మ్యూజిక్: రోషన్ సాలూరి , ఆర్ట్: కె.వి రమణ, కో డైరెక్టర్: శ్రీనివాస్ రావు, ఫోటోగ్రఫీ: సతీష్ ముత్యాల, సమర్పకులు: బేబీ గాయత్రి రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎమ్. విజయ చౌదరి, నిర్మాతలు: బి. నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: రాజేష్ నాదెండ్ల.