కార్తీక్ సాయి ది కిల్లర్ సక్సెస్ మీట్ ఇన్నేళ్ల మా కష్టం ఈ రోజు ఫలించింది : హీరో కార్తీక్ సాయి

288

కార్తీక్ సాయి హీరోగా పరిచయం అవుతూ, డాలీషా, నేహా దేశ్‌పాండే హీరోయిన్స్ గా చిన్నా దర్శకత్వంలో శ్రీమతి లలిత సమర్పణలో యాదవ్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై ఆవుల రాజు యాదవ్ & సంకినేని వాసు దేవ రావు నిర్మించిన చిత్రం కార్తీక్’స్ ది కిల్లర్. ఈ సినిమా ఈ నెల 3న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సందర్బంగా ఆదివారం హైద్రాబాద్ లో సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో హీరో,, దర్శకుడు కార్తీక్ సాయి, హీరోయిన్ డాలీషా, నిర్మాత వాసు దేవరావ్ తో పాటు తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

హీరోయిన్ డాలీషా మాట్లాడుతూ .. ఈ సినిమాను ఇంతగా సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్, ఈ సినిమా కోసం టీం ఎంతగా కష్టపడ్డారో నాకు తెలుసు. ఈ సినిమా విషయంలో ఫలితం మా టీం మొత్తానికి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు తమ సినిమా అని కష్టపడ్డారు. నాకు ఇంతమంచి సినిమాలో ఛాన్స్ ఇచ్చిన కార్తీక్ కు, వాసు గారికి థాంక్స్, ఏ సినిమా అయినా కూడా మూడు విషయాలపైనే ఆధారపడి ఉంది.. అది ఎంటర్ టైన్మెంట్, ఎంటర్ టైన్మెంట్ , ఎంటర్ టైన్మెంట్ .. ! అలాగే ఈ సినిమా కూడా అదే తరహాలో ఎంటర్ టైనేమేంట్ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం. సినిమా ప్రేక్షకులతో కలిసి చూసాను. అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నారు.

హీరో , దర్శకుడు కార్తీక్ సాయి ( చిన్నా ) మాట్లాడుతూ .. మా సక్సెస్ లో అందరు ఉన్నారు. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఇది నా పదేళ్ల కష్టం. దాన్ని ఈ రోజు నిజం చేసారు. ఈ కరోనా సమయంలో ఏ థియటర్స్ లో హౌస్ ఫుల్ లేదండి.. నా సినిమానే కాదు ఎవరి సినిమా అయినా ఫుల్స్ లేవు.. అలాగే మా తమ్ముడు సంతోష్ కు థాంక్స్, అలాగే మా అమ్మ నాన్న, అలాగే వాసుగారికి అందరికి మరోసారి థాంక్స్ చెబుతున్నాను, ఈ సినిమాకు సెకండ్ పార్ట్ కూడా ఉంది.. అందులో కూడా డాలీషా నే హీరోయిన్ , అలాగే మమ్మల్ని సపోర్ట్ చేసిన సురేష్ కొండేటి గారికి థాంక్స్ అన్నారు.

నిర్మాత వాసుదేవరావు మాట్లాడుతూ .. ఈ సినిమాకు నాకింత సపోర్ట్ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. మేము కష్టపడి తీసిన సినిమాను మీరు అందరించినందుకు ప్రేక్షకులకు, మీడియాకు థాంక్స్ . ఏ సినిమాకు అయినా ప్రేక్షకులే ఫైనల్, ఈ సినిమాను ప్రేక్షకుల చేతిలో పెట్టాం.. వారు మాకు మంచి విజయాన్ని అందించారు. ఈ సినిమా విషయంలో ఎడిటర్ నాని, కెమెరా మెన్ ఆర్యన్ , సతీష్, ప్రియా ఇలా ప్రతి ఒక్కరు ఈ సినిమాకు ఎంతగానో కష్టపడ్డారు.. ముక్యంగా మా నాని, తాను పడిన కష్టం గురించి నేను దగ్గరగా చూసాను, నిజంగా అతని కష్టం ఈ రోజు నిజమైంది. ఈ సినిమా విషయంలో మరో ముఖ్యమైన వ్యక్తి సతీష్. ప్రతిదీ దగ్గరుండి చూసుకున్నారు. హీరోయిన్ డాలీషా సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఒక్క టెక్ లో ఏ సీన్ అయిన సరే అదిరిపోయేలా చేసేది. ఈ సినిమాకు ఇంతమంచి సక్సెస్ అందించిన ప్రేక్షకులకు మరోసారి థాంక్స్ అన్నారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ .. చిన్న సినిమాగా విడుదలైన కిల్లర్ సినిమా పెద్ద విజయం అందుకోవడం ఆనందంగా ఉంది. చిన్న సినిమాలు సక్సెస్ అయినప్పుడే పరిశ్రమకు మంచింది. అలాగే ఈ సినిమా విషయంలో కార్తీక్, వాసుగారు మొదటి రోజు ఎలా ఉన్నారో.. సినిమా విడుదల తరువాత ఈ రోజు వరకు వాళ్లలో అదే ఎనర్జీ కనిపించింది. ఇలా చాలా మంది నిర్మాతలు ఉండరు.. సో ఈ నిర్మాతలు ఈ సక్సెస్ తో మరిన్ని సినిమాలు చేయాలనీ కోరుకుంటున్నాను అన్నారు.

లైన్ ప్రొడ్యూసర్ ప్రియా మాట్లాడుతూ.. మూడు రోజుల నుండి డాలీషా మీద, నా మీద అటాక్స్ అవుతూనే ఉన్నాయి. కష్టపడి పనిచేసాం. కష్టం విషయంలో అడా, మగ తేడా లేదు.. సినిమా చుడండి నచ్చితే బాగుందని రాయండి. లేదంటే తిట్టండి అంతే కానీ ఫేక్ న్యూస్, ఫేక్ రివ్యూస్ మాకు అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టు రాయండి. మేమేమి టాటా బిర్లా ల పిల్లలం కాదు.. పైసా పైసా తెచ్చుకుని సినిమా చేసాం. నమ్మకంతో సినిమా చేసాం.. నచ్చితే వెళ్లి చుడండి అంతే కానీ ఇష్టం వచ్చినట్టు చెప్పకండి. సినిమా తీసిన వాళ్ళం మాకు ఎలా చేయాలో ఏమి చేయాలో తెలుసు.. అంతే కానీ మాకు సలహాలు ఇవ్వకండి అన్నారు.


Thanks & Regards
suresh. kondeti