కర్మయోగి శ్రీ ధర్మ వ్యాదుడి చరిత్ర” “ఆడియోను విడుదల చేసిన హ్యుమాన్ రైట్స్ చైర్మన్ జె.సి.చంద్రయ్య, బి.సి.కార్పొరేషన్ చైర్మన్ వకులా భరణం కృష్ణ మెహన్

341

త్రేతాయుగంలో జనక పురంలోని మిథిలా నగరంలో శ్రీహరి భక్తుడైన “శ్రీ ధర్మ వ్యాధుడు” వేటగాళ్లు వేటాడి తెచ్చిన మాంసాన్ని విక్రయించి గుడ్డి తల్లిదండ్రులను పోషిస్తూ.. వారిని శివపార్వతులుగా పూజిస్తూ.. ప్రజలకు ధర్మములు, సూక్ష్మ ధర్మములు తెలిపి వారికి భక్తి మార్గం చూపేవారు. తపస్సు గావించి శక్తి సంపాదించిన కౌశికుడు ఎంతో గర్వం కలిగిన వాడు.తను ధర్మవ్యాధుడు గురించి తెలుసుకొని మిథిలానగరము నకు వచ్చి చూడగా ధర్మవ్యాధుడు అంగడిలో మాంసము విక్రయిస్తుండగా చూసి అసహ్యించుకుంటాడు.అది ధర్మవ్యాధుడు గమనించి కౌశికుడు దగ్గరకు వచ్చి మునివర్యా.. వందనములు.. కులవృత్తి చేయడంలో తప్పులేదు అని చెప్పి ధర్మములు, సూక్ష్మ ధర్మములు తెలుపుతూ తల్లిదండ్రులు సేవలో శివపార్వతులు దర్శనం ఉందని ఆ కౌశికుడికి కనువిప్పు కలిగేలా చేస్తాడు.అలా వారికి తల్లిదండ్రులు గొప్పతనాన్ని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి కథే “కర్మయోగి శ్రీ ధర్మ వ్యాదుడి చరిత్ర “.

భోగి కార్ శ్యామల జమ్ము రాజా సమర్పణలో శ్రీ దుర్గా భవాని క్రియేషన్స్ పతాకంపై ఉల్కందే కార్ మురళీధర్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు కీ.శే.. యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు అన్ని పాటలు పాడడం విశేషం.జి.జే రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ భాస్కర్, అనుషా,అశోక్ కుమార్, ఆనంద్ భారతి,వి.మురళీధర్ లు నటిస్తున్న ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో సినీ,రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది.ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన హ్యుమాన్ రైట్స్ చైర్మన్ జె.సి. చంద్రయ్య, బి.సి.కార్పొరేషన్ చైర్మన్ వకులా భరణం కృష్ణ మెహన్, దైవజ్ఞ శర్మ లు “కర్మయోగి శ్రీ ధర్మ వ్యాదుడి చరిత్ర “ఆడియోను విడుదల చేయగా నిర్మాతలు సాయి వెంకట్, రాం సత్య నారాయణ,నవ్యాంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు యస్.వి.యన్.రావ్,వెంకటేశ్వర రాజు, నటికర్ రవి, బి.సి. కార్పొరేషన్ మెంబెర్ ఉపేంద్ర, శాంతా కుమారి, బి.నరసింగ్ రావ్, నేతికర్ శ్రీనివాస్, అనుషా, నటుడు శ్రీనివాస్, రాజేష్ ,భాగ్యలక్ష్మి తదితరులు ఈ చిత్రంలోని పాటలను విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో

చిత్ర నిర్మాత ఉల్కందే కార్ మురళీధర్ మాట్లాడుతూ..మా ఆడియో విడుదల చేయడానికి ఇంతమంది పెద్దల రావడం చాలా సంతోషంగా ఉంది.దర్శకుడు జి.జే. రాజా 10 సంవత్సరాల క్రితం రాసుకున్న ఈ కథను ఎంతో మందికి వినిపించడం జరిగింది. ఈ కథను విన్న రామానాయుడు గారు తీస్తానని ముందుకు వచ్చాడు. అంతలో తను పరమపదించాడు. ఇలా ఎంతోమందిని అడిగిన తర్వాత నాకీ కథ చెప్పడం జరిగింది.

చిత్ర దర్శకుడు జి.జే రాజా మాట్లాడుతూ.. ధర్మవ్యాధుడు యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయాలని సినిమా తీయడం జరిగింది. ధర్మములు సూక్ష్మ ధర్మములు ప్రతి ఒక్కరికి తెలియజేయడమే కాక తన సొంత పిల్లలకు కూడా ధర్మం చెప్పేవాడు. ఏ వృత్తి చేసినా తప్పు లేదు కానీ శ్రీమన్నారాయణ యొక్క నామస్మరణాన్ని మాత్రం మరవకూడదు.అని చెప్పి తన కూతురిని అత్తగారింటికి పంపించిన మహానుభావుడు ధర్మవ్యాధుడు. అలాంటి వారి చరిత్రను సినిమాగా తీసే అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు.కాబట్టి మా చిత్రాన్ని అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుతున్నాను అన్నారు.

నటీనటులు
విజయ్ భాస్కర్, అనుషా,అశోక్ కుమార్, ఆనంద్ భారతి, వి.మురళీధర్ ,కావూరి శ్రీనివాసు, ప్రభావతి, అనూష రెడ్డి, రమ్య, లావణ్య, శ్యామ్ సుందర్, సాయి రాజా గోగి కార్, లక్ష్మణ, జయ, మాస్టర్ ఆయుష్ మాన్, మాస్టర్ మణి కిరణ, మాస్టర్ మణి తేజ, బేబీ శ్రీ విద్య తదితరులు

సాంకేతిక నిపుణులు
సమర్పణ : భోగి కార్ శ్యామల జమ్ము రాజా
సౌజన్య రియల్ ఎస్టేట్ యూనిట్
బ్యానర్ : శ్రీ దుర్గాభవాని క్రియేషన్స్
సినిమా : కర్మయోగి శ్రీ ధర్మవ్యాధుడు చరిత్ర
నిర్మాత : ఉల్కందే కార్ మురళీధర్
సహాయ నిర్మాత : గోదా వెంకట కృష్ణారావు
కథ రూపకల్పన స్క్రీన్ ప్లే దర్శకత్వం : జి జే రాజా
గాయకులు : యస్.పి బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణ సాయి,సుధీర్,లక్మి వినాయక
కెమెరా : పి.దీవరాజ్
సంగీతం : లక్ష్మణ సాయి,లక్ష్మీ వినాయక్,సంజీవ్ కుమార్ మోగేటి
పి.ఆర్.ఓ : మూర్తి