ఎస్‌.వి.కృష్ణారెడ్డి చిత్రం ఆర్గానిక్ మామ‌- హైబ్రీడ్ అల్లుడు సెట్లో ఎస్‌.వి. కృష్ణారెడ్డి పుట్టిన‌రోజు వేడుక‌

336

సోహెల్, మృణాళిని ర‌వి జంట‌గా డా. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, మీనా, అలీ, సునీల్ త‌దిత‌ర తారాగ‌ణంతో రూపొందుతోన్న చిత్రం ఆర్గానిక్ మామ‌- హైబ్రీడ్ అల్లుడు. క‌ల్ప‌న చిత్ర బేన‌ర్‌పై క‌ల్ప‌న కోనేరు నిర్మిస్తున్నారు. ఎస్‌.వి.కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బుధ‌వారంనాడు ఈ చిత్రం షూటింగ్ బేగంపేట్‌లోని రమడా మ‌నోహ‌ర్ హోట‌ల్‌లో జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా ఎస్‌.వి. కృష్ణారెడ్డి జ‌న్మ‌దిన‌ వేడుక చిత్ర యూనిట్ స‌మ‌క్షంలో ఆహ్లాద‌ర‌కంగా జ‌రిగింది.

అనంత‌రం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో అచ్చిరెడ్డి మాట్లాడుతూ, జ‌ర్న‌లిస్టు మిత్రులు, చిత్ర యూనిట్ స‌మ‌క్షంలో ఎస్‌.వి. కృష్ణారెడ్డి జ‌న్మ‌దిన వేడుక జ‌ర‌గ‌డం ఆనందంగా వుంది. ప్ర‌తి ఏడాది వ‌చ్చేది. ఆత్మీయుల స‌మక్షంలో జ‌రుపుకోవ‌డంలో ఆనందం వేరుగా వుంటుంది. ఈ చిత్ర క‌థ న‌చ్చి ఎస్‌.వి.కృష్ణారెడ్డిగారు సినిమా తీయ‌డానికి కార‌ణ‌మైంది. అందుకు క‌ల్ప‌న‌గారు ఎంతో ప్రోత్స‌హించారు. సోహెల్ హీరోగా బాగా చేస్తున్నాడు. మృణాళిని రవి మంచి న‌టి. చాలా నాచుర‌ల్‌గా చేస్తుంది. తెలుగులో సుస్థిర స్థానం సంపాదించుకుంటుంద‌నే న‌మ్మ‌క‌ముంది అన్నారు.

ప్ర‌ముఖ నిర్మాత సి. క‌ళ్యాణ్ మాట్లాడుతూ, ఎస్‌.వి. కృష్ణారెడ్డి పెద్ద బేన‌ర్‌లో చేశాడు. స‌క్సెస్ కొట్టాడు అనేలా ఈ సినిమా వుంటుంది. మొన్నీమ‌ధ్య అలీ క‌లిశాడు. 22 ఏళ్ళ క్రితం న‌న్ను హీరోగా ప‌రిచ‌యం చేసి స‌క్సెస్ చేశాడు. ఇప్పుడు సోహెల్ తో ఎస్‌.వి. కృష్ణారెడ్డి సినిమా చేస్తుంటే ఆ వైబ్రేష‌న్స్ వ‌స్తున్నాయి.  ఆయ‌న‌తో 38 ఏళ్ళ జ‌ర్నీ, మా జ‌ర్నీ సూప‌ర్ హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌క‌ముంది అన్నారు.

ఎస్‌.వి. కృష్ణారెడ్డి మాట్లాడుతూ, మ‌నిషికి అదృష్టం వ‌రించాలి. అది నిజం. నాకు అచ్చిరెడ్డిగారి లాంటి వ్య‌క్తిని దేవుడు ఇచ్చాడు. న‌న్ను దిశానిర్దేశం చేసింది ఆయ‌నే. ఆనాడు, ఈనాడు, ఏనాడు కూడా ప్ర‌తిక్ష‌ణం నా భ‌విష్య‌త్ గురించే ఆలోచిస్తారు. ఐదేళ్ళ నుంచి ఐదు క‌థ‌లు రాసుకున్నాను. అలా రాయ‌డానికి కార‌ణం అచ్చిరెడ్డిగారే. ప్ర‌తి డైలాగ్ ఆయ‌న‌కు వినిపించేవాడిని. కొత్త కొత్త ప‌దాలు పుడుతున్నాయ్ అనేవారు.  యు.ఎస్‌. డైరెక్ట‌ర్ అసోసియేష‌న్‌లో నేను మెంబ‌ర్‌ను. అందుకే మీకోసం మిమ్మ‌ల్ని న‌వ్వించ‌డానికి సినిమా చేశాను. అందుకు హీరోగా సోహెల్ ను ఎంచుకున్నాను. కామెడీ, సెంటిమెంట్‌, ఫైట్స్‌, డాన్స్ బాగా చేస్తున్నాడు. క‌మ‌ర్షియ‌ల్ హీరో ల‌క్ష‌ణాలున్నాయి. మృణాళిని ర‌వి మంచి న‌టి. సున్నిత‌మైన భావాల‌న్ని బాగా ప‌లికిస్తుంది. ఇంత‌మందిని అందంగా చూపించ‌డానికి రామ్ ప్ర‌సాద్ సిద్దంగా వున్నాడు. కెమెరామెన్ రామ్ ప్ర‌సాద్‌తో 18 ఏళ్ళ‌నాడు పెళ్లాం ఊరెళితే చేశాం. రెండున్న‌ర కోట్ల ఖ‌ర్చు. 18 కోట్ల రాబ‌డి. అదే సినిమా హిందీలో తీశారు. ప్ర‌తి సినిమాను బాగా మ‌ల‌చాల‌నే త‌ప‌న ఆయ‌నలో వుంది అన్నారు.

సోహెల్ మాట్లాడుతూ, ఈ సినిమాలో నా టాలెంట్‌ను ద‌ర్శ‌కుడు బ‌య‌ట‌పెడుతున్నారు. చిన్న సీన్ కూడా చేసి మ‌రీ చూపిస్తున్నారు. అలా కొంత‌మంది ద‌ర్శ‌కులే వుంటారు. ఎస్‌.వి.కృష్ణారెడ్డిగారికి థ్యాంక్స్‌. రామ్ ప్ర‌సాద్‌గారి కెమెరా ప‌నితం బాగుంది. సూప‌ర్ డూప‌ర్ మూవీలో చేస్తున్నా. లైఫ్‌లో ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంది. నిర్మాత క‌ల్ప‌న‌గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ఎంట‌ర్‌టైన్ మెంట్ ఇవ్వాల‌నే క‌సితోనే అంద‌రం చేస్తున్నాం. అచ్చిరెడ్డిగారు లొకేష‌న్‌కు వ‌స్తే పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. మృణాళిని నేచుర‌ల్‌ న‌టి. ఆమె ఎంట‌ర్ కాగానే నాకు కాంపిటేష‌న్ వ‌చ్చింద‌నే ఫీల్ క‌లిగింది. అని చెప్పారు.

మృణాళిని ర‌వి మాట్లాడుతూ, ఈ సినిమా నాకు రావ‌డం ల‌క్కీగా భావిస్తున్నా. లెజండ‌రీ ద‌ర్శ‌కుడుతో ప‌నిచేస్తున్నందుకు ఆనందంగా వుంది. సెట్లో చాలా కూల్‌గా వుంటారు. చిన్న‌చిన్న మూవ్‌మెంట్స్ బాగా డీల్ చేస్తారు. ఆయ‌న‌లో గొప్ప న‌టుడు వున్నారు. నిర్మాత క‌ల్ప‌న‌గారు కుటుంబ‌స‌భ్యులా చూస్తున్నారు. అంద‌రూ మంచి ఎన‌ర్జీతో ప‌నిచేస్తున్నార‌ని అన్నారు.

నిర్మాత క‌ల్ప‌న మాట్లాడుతూ, మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమా చేయ‌డం చాలా ఆనందంగా వుంది. సెట్లో వున్న ప్ర‌తివారూ త‌ల్లిగా భావించి నేను తిట్టినా భ‌రిస్తున్నారు. అంద‌రూ మంచి స‌హ‌కారం అందిస్తున్నార‌ని తెలిపారు.

కెమెరా మెన్ రామ్ ప్ర‌సాద్ మాట్లాడుతూ, నాపై న‌మ్మ‌కంతో ఈ సినిమా ఇచ్చారు. మీ అంద‌రి స‌పోర్ట్ వ‌ల్లే బాగా చేస్తున్నాను. మంచి హిట్ ఇస్తామ‌నే న‌మ్మ‌కం పూర్తిగా వుంది అని అన్నారు.

న‌టీన‌టులుః సోహెల్, మృణాళిని ర‌వి, డా. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, మీనా, అలీ, సునీల్, అజ‌య్ ఘోష్‌, హేమ‌, ప్ర‌వీన్‌, స‌ప్త‌గిరి త‌దిత‌రులు

సాంకేతిక‌త‌త‌- నిర్మాతః క‌ల్ప‌న కోనేరు, క‌థ‌, క‌థ‌నం, మాట‌లు, సంగీతం, ద‌ర్శ‌క‌త్వంః ఎస్‌.కృష్ణారెడ్డి, డైరెక్ట‌ర్ ఆఫ్ పొటోగ్ర‌ఫీ- సి. రాంప్ర‌సాద్‌, పాట‌లు- చంద్ర‌బోస్‌, భాస్క‌ర‌భ‌ట్ల‌, ర‌వికుమార్‌, పి.ఆర్‌.ఓ- సురేష్ కొండేటి.