హ్యాపెనింగ్ యంగ్ హీరో కళ్యాణ్ దేవ్, యంగ్ డైరెక్టర్ రమణ తేజ కాంబినేషన్ లో ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి నిర్మాణ సారథ్యంలో SRT ఎంటర్ టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా కిన్నెరసాని. కంటెంట్‌కి పెద్ద పీఠ వేస్తూ, నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా సినిమాలు నిర్మిస్తున్న ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్ వాళ్ళు.. మరో నిర్మాణ సంస్థ శుభమ్ ఎంటర్ టైన్మెంట్స్ తో కలిసి కిన్నెరసాని చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. కిన్నెరసాని టైటిల్ పోస్టర్‌లో సైతం సినిమా కథాంశం ప్రతిభింబిచేలా ప్రశాంతమైన సముద్రపు ఒడ్డు, యాట్, గొలుసులు, తాళం వంటి ఎలిమెంట్స్ జోడించి డిజైన్ చేయడం జరిగింది. అలానే కిన్నెరసాని టైటిల్‌కి క్యాప్షన్‌గా అతి సర్వత్ర వర్జయత్ (హద్దు లేకపోవడం ప్రమాదకరం) అనే సంస్కృత పదాన్ని కూడా జోడించారు.
తాజాగా ఈ సినిమా నుంచి పార్వతి పురం అనే పాట విడుదలైంది. కిట్టు విస్సాప్రగడ ఈ పాటకు సాహిత్యం అందించగా.. ఉమా నేహా, రేవంత్, ధనుంజయ్ సీపాన పాడారు. పాట చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంటెన్స్ డ్రామాగా ఈ టీజర్ కనిపిస్తుంది. కిన్నెరసాని చిత్రానికి దేశరాజ్ సాయితేజ కథ, కథనం అందిస్తున్నారు. గతంలో సాయి తేజ్ కల్కి వంటి హిట్ చిత్రానికి స్టోరీ అందించడం విశేషం. అలానే ఛలో, భిష్మ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకి సంగీతాన్ని అందించిన మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర పాటలు లహరి మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లోకి విడుదల అవుతున్నాయి. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.
నటీనటులు:
కళ్యాణ్ దేవ్, రవీంద్ర విజయ్, అన్ శీతల్, మహతి బిక్షు, కాశిశ్ ఖాన్ తదితరులు
టెక్నికల్ టీమ్:
దర్శకుడు – రమణ తేజ
బ్యానర్ – ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్ టైన్మెంట్స్
ప్రొడక్షన్: రామ్ తళ్ళూరి
సమర్పణ – సాయిరిషిక
నిర్మాత – రజనీ తళ్లూరి, రవి చింతల
కథ, కథనం – దేశ్ రాజ్ సాయితేజ్
సంగీతం – మహతి స్వర సాగర్
సినిమాటోగ్రాఫర్ – సురేశ్ రఘుతు
ఎడిటింగ్ – అన్వర్ అలీ
లిరిసిస్ట్: కిట్టు విస్సాప్రగడ
ప్రొడక్షన్ డిజైన్ – శ్రీ నాగేంద్ర తంగల
సౌండ్ డిజైన్ – సింక్ సినిమా
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్: జే విద్యా సాగర్
విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: నాగు తలారి
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే
PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్