డేరింగ్ అండ్ డైనమిక్ హీరో నందమూరి కళ్యాణ్ హీరోగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తోన్న చిత్రం ‘బింబిసార’ . వశిష్ట దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించిన కళ్యాణ్ రామ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. సోమవారం రోజున(నవంబర్ 29) బింబిసార టీజర్‌ను నందమూరి కళ్యాణ్ రామ్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. ఏ టైమ్ ట్రావెల్ ఈవిల్ టు గుడ్ అనే క్యాప్షన్‌ను కూడా పోస్ట్ చేశారు. టీజర్‌ను గమనిస్తే త్రిగర్తాల సామ్రాజ్యాధినేత బింబిసారుడు ఏక చత్రాధిపత్యం కోసం రాజ్యాలపై దాడులు చేయడం, ఇతర రాజులను సామంతులను చేసుకోవడం.. ఎదురు తిరిగిన వారిని చంపేయడం వంటి పనులను చేశారనే విషయాన్ని టీజర్ ద్వారా తెలియజేశారు. బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ లుక్ సింప్లీ సూపర్బ్.
‘‘ఓ సమూహం తాలుకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే, కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తల వంచి బానిసలైతే.. ఇందరి భయాన్ని చూస్తూ ఒకరితో ఓ రాజ్యం మీసం మెలేసింది. అదే త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం. బింబిసారుడి ఏక చత్రాధిపత్యం’’ అనే పవర్ ఫుల్ డైలాగ్‌తో కళ్యాణ్ రామ్ బింబిసారుడి పాత్రను ఎలివేట్ చేసిన తీరు.. టీజర్ చివరలో ప్రస్తుత కాలానికి చెందిన యువకుడిగా హీరో కళ్యాణ్ రామ్ విలన్స్‌తో తలపడటం సీన్‌ను చూపించారు. టీజర్‌తోనే సినిమా ఎలా ఉండబోతుంది. ఎలాంటి ఎలిమెంట్స్‌ను ఎలివేట్ చేయబోతున్నామని మేకర్స్ టీజర్‌లో తెలిపారు. ముఖ్యంగా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌కు సంబంధించిన విజువల్స్ ఆడియెన్స్‌ను కట్టిపడేస్తున్నాయి.
‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న హై టెక్నికల్ వేల్యూస్ మూవీ ఇది. కళ్యాణ్ రామ్ సరసన క్యాథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తా’’మని నిర్మాతలు తెలిపారు.
నటీనటులు:
నందమూరి కళ్యాణ్ రామ్, క్యాథిరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ తదితరులు
సాంకేతిక నిపుణులు :
రచన, దర్శకత్వం: వశిష్ఠ్
నిర్మాత : హరికృష్ణ.కె
సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు
సంగీతం: చిరంతన్ భట్
డైరెక్టర్ ఆఫ్ మ్యూజిక్ : సంతోష్ నారాయణ్
ఎడిటర్: తమ్మిరాజు
వి.ఎఫ్.ఎక్స్ ప్రొడ్యూసర్: అనిల్ పడూరి
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె
ఫైట్స్: వెంకట్, రామకృష్ణ
మాటలు : వాసుదేవ్ మునెప్పగారి
పాటలు: రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, వరికుప్పల యాదగిరి
డాన్స్: శోభి, రఘు, విజయ్, యశ్వంత్
పి.ఆర్.ఒ : వంశీ కాకా