కళ్యాణ్ దేవ్ పుట్టిన రోజు సందర్భంగా శ్రీధర్ సీపాన ప్రొడక్షన్ నెంబర్ 3 ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల..

508

 

 

మెగా హీరో కళ్యాణ్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా శ్రీధర్ సీపాన దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 3 ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2 సమర్పణలో ఈ సినిమా వస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ప్రముఖ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కళ్యాణ్ దేవ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 11న కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి చిన్న వీడియోను విడుదల చేశారు. హీరో కళ్యాణ్ దేవ్ గారి సతీమణి శ్రీజ సైతం ఈ వీడియోలో ఉండటం విశేషం. ఈ చిత్రంలో అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఐ ఆండ్ర్యూ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జునైద్ సిద్ధికి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు.

నటీనటులు:
కళ్యాణ్ దేవ్, అవికా గోర్..

టెక్నికల్ టీం:
రచన-దర్శకుడు: శ్రీధర్ సీపాన
సమర్పణ: గీతా ఆర్ట్స్ 2
నిర్మాణ సంస్థలు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, అభిషేక్ అగర్వాల్
సినిమాటోగ్రఫీ: ఐ ఆండ్ర్యూ
ఎడిటర్: జునైద్ సిద్ధికి
PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్