సంస్కృతి, స్ఫూర్తి, సేవల సంగమం

596


కళలకు కాణాచి తెలంగాణ సంస్కృతి. ఈ తెలంగాణ సంస్కృతిని 33జిల్లాల నుండి వందకు పైగా జానపద కళా రూపాలతో తెలంగాణ కళా జాతరను కళావాహిని సంస్థ నిర్వహించనుందని టెలివిజన్ నిర్మాతల మండలి అధ్యక్షుడు మహమ్మద్ షరీఫ్ అన్నారు.. కళా సంస్కృతికి 30 సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్న సంస్థ కళావాహిని అని ఈ సంస్థ 30వ వార్షికోత్సవాలను ఈ సంవత్సరం ఫిబ్రవరి 12,13,14 తేదిల లో శిల్పా కళా వేదికలో ఘనంగా నిర్వహించనున్నామని సంస్థ వ్యవస్థాపకులు ఎ.రమేష్ తెలిపారు. ఫిబ్రవరి 14వ తేదీ నాడు 2019 తీవ్రవాదులు కాశ్మీర్ లోని పుల్వామా ప్రాంతంలో బస్సులో ప్రయాణిస్తున్న 42 మంది భారత సైనికులను అదును చూసి మట్టుబెట్టారు. దేశక్షేమం కోసం కను రెప్ప మూతపడకుండా, ప్రాణభీతి లేకుండా 24 గంటలు నిలబడ్డ ఆ సైనికులకు నిజమైన నివాళులు ఇవ్వాలన్న సదుద్ద్యేశంతో ‘నేను నా దేశం కోసం నిలబడతాను’ అన్న నినాదంతో 2020 ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచంలో భారతీయుడు అన్నవాడు ఎక్కడవున్నా, ఎలావున్నా దేశం కోసం ఒకేసారి నిలబడాలన్న ఆలోచన తో రూపొందిన సంస్థ ఐ స్టాండ్ ఫర్ ది నేషన్. కళావాహిని ఆధ్వర్యంలో ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ కలిసి హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఫిబ్రవరి 12 నుండి 14వ తేదీన వరకు స్ఫూర్తి, సంస్కృతి మరియు సేవల ధ్యేయంతో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే 14 వ తారీఖున పుల్వామా అమర సైనికులకు ఘన నివాళులర్పించనున్నామని ప్రెసిడెంట్ ఇప్పలపల్లి రమేష్ తెలిపారు. ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ కార్యక్రమం దేశం యావత్తూ సైనికులకు అండగా నిలిచేలా తీర్చిదిద్దామని సంస్థ వైస్ ఛైర్మన్ హరికృష్ణ తెలిపారు.ఈ కార్యక్రమాలకు సోచ్ మరియు బాస్ సంస్థలు తోడ్పాటునందిస్తున్నాయి. అనాధలైన అంధుల జీవితంలో అండగా నిలిచి వెలుగును నింపుతన్న సంస్థ సోచ్. సైనిక నేపధ్యం గల కార్యక్రమంలో భాగస్వాములవ్వడం తమ సంస్థ అదృష్టమని సోచ్ వ్యవస్థాపకులు మధుకర్ రెడ్డి తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. అనాధలైనవారిని చేరదీసి వారి జీవితాలకు బంగారు బాట వేసిన సంస్థ బాస్. కళావాహిని, ఐస్టాండ్ ఫర్ ది నేషన్ కార్యక్రమ వేడుక ఓ అద్భుతమని బాస్ అధినేత రాధాకృష్ణ తెలిపారు. ఫిబ్రవరి 14 2020 వ తేదీన శిల్పకళావేదిక లో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు సీఆర్ పీఎఫ్ ఐజి నేతృత్వంలో తమ పెట్టు బృందంతో పాటు అతిథులుగా రానున్నారని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో అనిల్, వినయ్ కుమార్, తదితరులు పాల్గొని కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు