చాణక్యనీతికి కాలం చెల్లిందా? మిర్చి వినూత్న పాడ్ కాస్ట్

128


చాణక్యనీతిపై మిర్చి తెలుగు ఒక కొత్త పాడ్ కాస్ట్ ని యూట్యూబ్ లో విడుదల చేసింది. చాణక్యనీతిపై ఇప్పటికే ఎన్నో పాడ్ కాస్టులు, వీడియోలు, ఆర్టికల్స్ వివిధ మాధ్యమాల్లో వచ్చాయి. కానీ, ఈ పాడ్ కాస్ట్ కచ్చితంగా ఆ జాబితాలోకి రాదు. ఎందుకంటే, ఎప్పుడో రెండు వేల ఏళ్ల కిందటి సమాజం కోసం చాణక్యుడి నీతి సూత్రాలనే ఆ వీడియోల్లో చెప్పారు. కానీ, నిజంగా ఈ కాలానికి సరిపోయేవేనా? ఇప్పటికీ ఆ సూత్రాలు పాటిస్తే వెనక్కి వెళ్తామా? ముందుకు వెళ్తామా? అని ఇలాంటి ప్రశ్నలకు సమాధానాన్ని అన్వేషిస్తూ, చరిత్రను అన్వయిస్తూ, ఈ పాడ్ కాస్ట్ లో విశ్లేషణ సాగుతుంటుంది. చాణక్యుడి లాంటి పెద్దగురువు చెప్పిన సూత్రాలు తప్పు అంటే, చాలామంది ఒప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ, ఆయన చెప్పిన సూత్రాలు ఆ నాటికే పరిమితమని, ఆనాటి రాజ్యానికే అవి వర్తించేలా రూపొందించారని అర్థమయ్యేలా ఈ పాడ్ కాస్ట్ వివరించి చెప్తుంది.
చాణక్యుడు పెద్ద గురువుగా, అత్యంత తెలివైన వ్యక్తి ఖ్యాతి గడించారు. కానీ, ఆయన చెప్పిన సూత్రాలను కాలక్రమంలో చాలామంది తమ స్వార్థానికి అనుకూలంగా తిరిగి రాసి కూడా ఉండవచ్చు. చరిత్ర క్రమంలో ఇలాంటి లొసుగులకు అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అవి చాలాచోట్ల వివరించబడ్డాయి కూడా! అయినా, చాణక్యుడి పుస్తకాల్లో, వీడియోల్లో ప్రచారమవుతున్న ఈ కాలానికి సరిపోని కొన్ని నీతి సూత్రాలను ఈ పాడ్ కాస్ట్ లో నిస్పక్షపాతంగా విశ్లేషించారు. ఈ సూత్రాలు ప్రస్తుత సమజానికి సరిపోవని వివరించారు. చాణక్యుడి కళ్లతో ఇప్పటి లోకాన్ని చూడటం ఎలాంటి తప్పో ఈ పాడ్ కాస్ట్ ద్వారా తెలియజేశారు. గణేశ్ తండ రాసిన ఈ పాడ్ కాస్ట్ కి, ఆర్జే భార్గవి తన అద్భుతమైన గాత్రంతో ప్రాణం పోశారు. ఈ గాత్రానికి తగ్గట్టుగా ఆలిస్టర్ అంచిన నేపథ్య సంగీతం, పాడ్ కాస్ట్ భావనకు సరిపోయేలా వినసొంపుగా ఉంది. మిర్చి కంటెంట్ లీడర్ వాణిమాధవి ఇలాంటి కంటెంట్ ని ప్రోత్సహించడం నిజంగా అభినందనీయం.
‘‘ కొన్ని నియమాలు సమాజాన్ని వెనక్కి నడిపిస్తాయి. అలా వెనక్కి నడిపించే వాటి వెంటే చాలామంది నడుస్తుంటారు. అది తెలియకపోవడం వల్ల కావొచ్చు, తెలుసుకోకపోవడం వల్ల కూడా కావొచ్చు. ఏదేమైనా ఒక మీడియా హౌజ్ గా ఏది అన్యాయమో, ఇది అసమంజసమో చెప్పాలి. లేదంటే పబ్లిక్ ఇన్ఫ్లుయెన్సర్ గా మీడియా పాత్రకు న్యాయం జరగదు. లింగవివక్ష, కుటుంబంలో అసమానతలు పెంచే కొన్ని చాణక్యనీతి సూత్రాలను మా రచయిత గణేశ్ చక్కగా విశ్లేషించారు. ఇలాంటి కంటెంట్ శ్రోతలకు ఉపయోగపడుతుందనే బలమైన నమ్మకంతో ఈ పాడ్ కాస్ట్ ని రూపొందించాం’’ అని చెప్పారు. చాణక్యనీతిపై మిర్చి రూపొందించిన ఈ వినూత్న పాడ్ కాస్ట్ ని వెంటనే చూసేయండి. ఎలా ఉందో కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. లింక్: https://youtube.com/playlist?list=PL3gKI5rLIcELJTuowf-3-XVa3gkzaTWQP