HomeTeluguవిధి సినిమాలో నా రియ‌ల్ లైఫ్‌కి పూర్తి భిన్న‌మైన, రా ఫ్లెవ‌ర్ రోల్ చేశాను -...

విధి సినిమాలో నా రియ‌ల్ లైఫ్‌కి పూర్తి భిన్న‌మైన, రా ఫ్లెవ‌ర్ రోల్ చేశాను – హీరో రోహిత్ నందా

రోహిత్ నందా హీరోగా ఆనంది హీరోయిన్‌గా నో ఐడియా బ్యానర్ మీద రంజిత్ ఎస్ నిర్మించిన చిత్ర విధి. శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ ద్వయం తెరకెక్కించిన ఈ మూవీ నవంబర్ 3న థియేటర్లోకి రాబోతోంది. విడుదల సందర్భంగా చిత్ర హీరో రోహిత్ నందా, ద‌ర్శ‌కులు శ్రీకాంత్ రంగ‌నాథ‌న్‌, శ్రీనాథ్ రంగ‌నాథ‌న్ మీడియాతో ప్ర‌త్యేకంగా మాట్లాడుతూ…

హీరో రోహిత్ నందా మాట్లాడుతూ…
* ఓరోజు యూట్యూబ్‌లో వి.ఎఫ్‌.ఎక్స్ వీడియోలు చూస్తుంటే ఓ వీడియో బాగా న‌చ్చింది. దాన్ని ఎవ‌రు చేశారా? అనే వివ‌రాలు తెలుసుకున్న త‌ర్వాత నెంబ‌ర్ దొరికింది. దానికి కాంటాక్ట్ అయితే శ్రీనాథ్ రంగ‌నాథ‌న్ మాట్లాడారు. అప్పుడు నేను ఓ సినిమా చేయ‌బోతున్నాన‌ని, దానికి గ్రాఫిక్స్ స‌పోర్ట్ చేయాల‌ని అన్నాను. దానికి అత‌ను ఓకే చెప్పాడు. కొద్ది సేపు త‌ర్వాత శ్రీకాంత్ రంగ‌నాథ‌న్ ఫోన్ చేసి ఇలా మేం కూడా డైరెక్ట‌ర్స్ కావాల‌ని అనుకుంటున్నాం. మా ద‌గ్గ‌ర కూడా క‌థ‌లున్నాయి, ముందు లైన్స్‌ వినండి అన్నారు. నేను స‌రేన‌న్నాను. మూడు స్టోరీ లైన్స్ పంపించారు. అందులో ఓ లైన్ చాలా క్రేజీగా ఉంద‌నిపించింది. త‌ర్వాత ద‌ర్శ‌కులు చెన్నై నుంచి హైద‌రాబాద్ వ‌చ్చారు. క‌థాప‌ర‌మైన చ‌ర్చ‌లు జ‌రిగిన త‌ర్వాత సినిమా చేద్దామ‌ని నిర్ణ‌యించుకున్నాం.

* నా రియ‌ల్ లైఫ్ క్యారెక్ట‌ర్‌కి పూర్తి భిన్న‌మైన రోల్‌ను ఈ సినిమాలో చేశాను. రా ఫ్లెవ‌ర్‌తో సినిమా ఉంటుంది. సినిమా సెట్స్‌కి వెళ్లే ముందు వ‌ర్క్ షాప్ చేశాం. లుక్‌, డ్రెస్సింగ్ స్టైల్ ఇలా అన్ని విష‌యాల్లో హోం వర్క్ చేసుకున్నారు.

* చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారి సినిమాలు చూసి యాక్ట‌ర్ కావాల‌ని అనుకున్నాను.

* హీరోయిన్ ఆనందిగారు చాలా సెల‌క్టివ్‌గానే సినిమాలు చేస్తుంటారనే సంగ‌తి తెలిసిందే. ఆమె క‌థ విని రెండు రోజులు స‌మ‌యం తీసుకుని సినిమా చేయ‌టానికి అంగీక‌రించారు.

* కొత్త క‌థ‌ల‌ను వింటున్నాను. ఇంకా ఏదీ ఫైన‌లైజ్‌ చేయ‌లేదు.

ద‌ర్శ‌కులు రీకాంత్ రంగ‌నాథ‌న్‌, శ్రీనాథ్ రంగ‌నాథ‌న్ మాట్లాడుతూ…
* మాకొక యూట్యూబ్ ఛానెల్ ఉంది. చిన్న‌ప్ప‌టి నుంచి సినిమా మేకింగ్‌పై ఆస‌క్తిని అలా ఏర్ప‌డుతూ వ‌చ్చింది. యూ ట్యూబ్‌కి సంబంధించినంత వ‌ర‌కు టెక్నిక‌ల్‌గా మంచి అనుభ‌వం ఉండ‌టంతో సినిమా మేకింగ్ చేయాల‌ని అనుకున్నాం.
* వ‌చ్చిన ఓ క‌ల‌ను బేస్ చేసుకుని ఓ లైన్ త‌యారు చేసుకుని దాన్నుంచి క‌థ‌ను త‌యారు చేసుకున్నాం.
* హీరో రోహిత్ నందా మేం అనుకున్న దాని క‌న్నా చ‌క్క‌గా వ‌ర్క్ చేశారు. క‌థ‌ను తయారు చేసే క్ర‌మంలో ఎక్కువ‌గా డిస్క‌ష‌న్స్ జ‌రిగాయి. షూటింగ్ స్టార్ట్ అయిన త‌ర్వాత అస‌లు ఎక్క‌డా ఆలోచించ‌లేదు.
* విధి సినిమా రిలీజ్ త‌ర్వాత నెక్ట్స్ మూవీకి సంబంధించిన నిర్ణ‌యం ఉంటుంది

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES