HomeTelugu‘డెవిల్’ చిత్రంలో సంగీతం సహజంగా ఉండాలనే సంప్రదాయ వాయిద్యాలు వాడాం: మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్

‘డెవిల్’ చిత్రంలో సంగీతం సహజంగా ఉండాలనే సంప్రదాయ వాయిద్యాలు వాడాం: మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్

డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకున్న కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్స్. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌క నిర్మాత‌గా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా భారీ ఎత్తున విడుద‌ల‌వుతుంది.ఈ సందర్భంగా సంగీత దర్శకుడు హర్షవర్దన్ రామేశ్వర్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే..

* డెవిల్ సినిమా విషయంలో సంగీతం, నేపథ్య సంగీతానికి ఈ స్థాయిలో స్పందన వస్తుందని అనుకోలేదు. అందరికీ నచ్చుతుందని అనుకున్నాం. కానీ ఈ రేంజ్‌లో ప్రశంసలు వస్తాయని అనుకోలేదు. అందరూ ఫోన్లు చేసి ప్రశంసిస్తున్నారు.

* అర్జున్ రెడ్డి తరువాత నన్ను బ్యాక్ గ్రౌండ్ స్పెషలిస్ట్ చేశారు. కానీ నాకు పాటలకు సంగీతం ఇవ్వడమే తెలుసు. అదే నాకు చాలా ఇష్టం. నాకు ఇప్పుడు ఆర్ఆర్, మ్యూజిక్ ఇలా అన్నింట్లో ఆఫర్లు వస్తున్నాయి. డెవిల్ వరకు చాలా విదేశీ సంప్రదాయ వాయిద్యాలు వాడాం. న్యాచురల్‌గా ఉండాలనే అలా ప్రయత్నించాం. ఇప్పుడు అది అందరికీ నచ్చేసింది. 1940 నేపథ్యం కాబట్టి బాగానే రీసెర్చ్ చేయాల్సి వచ్చింది.

* యానిమల్ ఇప్పటి తరం మూవీ. డెవిల్ కోసం నాటి కాలానికి వెళ్లాల్సి వచ్చింది. యానిమల్‌కు పని చేసి డెవిల్ కోసం రావడంతో ముందు రెండు మూడు రోజులు అడ్జస్ట్ కాలేకపోయాను. ఆ తరువాత డెవిల్ ప్రపంచంలోకి వచ్చేశాను.

* డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్ గారి నట విశ్వరూపాన్ని చూస్తారు. బింబిసారను మించేలా ఉంటుంది. సంయుక్త మీనన్ అద్భుతంగా నటించారు.

* అభిషేక్ నామా గారు నన్ను చాలా నమ్మారు. కాస్త లేట్ అయినా పర్లేదు నాకోసం వాళ్లు వెయిట్ చేశారు. ఆయన తలుచుకుంటే ఎవరితోనైనా మ్యూజిక్ చేయించుకునేవారు. కానీ ఆయన నా మీదున్న నమ్మకంతో ఆగారు. నాకు చాలా సపోర్టివ్‌గా నిలిచారు. ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో అవార్డులు కూడా వస్తాయేమో.

* డెవిల్ చిత్రానికి కెమెరామెన్ సౌందర రాజన్ ప్రాణం పెట్టారు. అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. వాటికి తగ్గట్టుగానే ఆర్ఆర్ ఉంటుంది. మేం ఎంత చేసినా విజువల్స్ లేకపోతే ఆ ప్రభావం కనిపించదు.

* డెవిల్ చిత్రంలో మూడు పాటలుంటాయి. కొత్తగా ఉండాలని కళ్యాణ్ రామ్ గారు చెప్పారు. దానికి తగ్గట్టుగా నాకు చాలా ఫ్రీడం ఇచ్చారు. అభిషేక్ గారే ర్యాపర్ రాజకుమారిని సజెస్ట్ చేశారు. ఆమె పాడిన పాట స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది.

* సందీప్ రెడ్డి వంగా యానిమల్ రైటింగ్ చూసి ఆయన దగ్గర పని చేయాలని అనుకున్నా. ఓ రెండు సినిమాలకు పని చేస్తానని కూడా అడిగా. నాకు మ్యూజిక్ బేస్డ్ మూవీని డైరెక్ట్ చేయాలని ఉంది. గిటార్ బేస్డ్ కథ, డ్రమ్స్ శివమణి గారి కథను తెరపైకి తీసుకు రావాలని ఉంది.

* డెవిల్ లైన్‌ను అభిషేక్ నామా గారే చెప్పారు. ముందు నుంచి ఆయనే ఇన్వాల్వ్ అయ్యారు. మ్యూజిక్ సిట్టింగ్స్‌లోనూ ఆయనే ఉన్నారు. నిర్మాతగా ఆయన గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు దర్శకుడిగా ఆయన టాలెంట్ అందరూ చూస్తారు. సందీప్ వంగాతో ఎలా సింక్ అయ్యానో.. అభిషేక్ నామా గారితోనూ అలానే సింక్ అయ్యాను. ఆయనకు మ్యూజిక్ మీద చాలా పట్టుంది.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES