సుశాంత్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఎస్.దర్శన్ దర్శకత్వంలో లెజెండ్రీ నటి భానుమతి రామకృష్ణ మనవడు రవి శంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్లలతో కలిసి ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 27న సినిమా విడుదలవుతుంది. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను కింగ్ నాగార్జున ట్విట్టర్‌లో విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో హీరో సుశాంత్, నిర్మాత హరీశ్ కోయిలగుండ్ల, కృష్ణచైతన్య, సాయిబాబా, వెంకట్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు, అభినవ్ గోమటం తదితరులు పాల్గొన్నారు.
నిర్మాత హరీశ్ కోయిలగుండ్ల మాట్లాడుతూ ‘‘నాగేశ్వరరావుగారి మనవడు, భానుమతిగారి మనవడు కలిసి సినిమా చేస్తే బావుంటుందని రవిశంకర్‌గారితో చెప్పగానే ఆలోచన బావుందని ఆయన ఒప్పుకున్నారు. దర్శన్ చెప్పిన కథ బాగా నచ్చింది. సుశాంత్ కారణంగానే నేను నిర్మాతనయ్యాను. చాలా మంచి ప్రాజెక్ట్‌ను నాకు ఇచ్చినందుకు తనకు థాంక్స్. సుశాంత్‌ను కొత్తగా చూస్తారు’’ అన్నారు.
ప్రవీణ్ లక్కరాజు మాట్లాడుతూ ‘‘గీతాంజలి, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల తర్వాత అనుకోకుండా మూడేళ్లు గ్యాప్ వచ్చింది. ఇండస్ట్రీకి మంచి చిత్రంతో రావాలని అనుకుంటున్న సమయంలో ఈ సినిమాలో అవకాశం వచ్చింది. నాపై నమ్మకంతో సుశాంత్ ఇచ్చిన సపోర్ట్‌తో ఇంత మంచి మ్యూజిక్ ఇవ్వగలిగాను. మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా కచ్చితంగా నచ్చుతుంది’’ అన్నారు.
డైరెక్టర్ ఎస్.దర్శన్ మాట్లాడుతూ ‘‘2010లో నేను, నా స్నేహితుడు ఫేస్ చేసిన నిజ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. కథ వినగానే సుశాంత్‌గారికి, హరీశ్‌గారికి బాగా నచ్చింది. మరో సినిమా చేయకుండా ఈ సినిమా కోసమే వెయిట్ చేశారు సుశాంత్. మధ్య అల వైకుంఠపురములో సినిమా చేశారాయన. నిర్మాతలు రవిశంకర్‌గారు, ఏక్తా మేడమ్‌గారికి, హరీశ్‌గారికి థాంక్స్. సుకుమార్‌గారు అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించారు. అలాగే ప్రవీణ్ లక్కరాజు బ్యూటీఫుల్ మ్యూజిక్ అందించారు. వెంకట్‌గారు నేను అనుకున్న పాత్రను మరోలెవల్‌కు తీసుకెళ్లారు. అందరికీ థాంక్స్’’ అన్నారు.
హీరో సుశాంత్ మాట్లాడుతూ ‘‘దర్శన్ ఈ సినిమాను నిరంజన్ రెడ్డిగారితో చేయాల్సింది. తనతో ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు నిరంజన్‌రెడ్డిగారితో మాట్లాడి, ఆయన ఒప్పుకున్న తర్వాతే ఈ సినిమాను స్టార్ట్ చేశాం. ఈ సందర్భంగా నిరంజన్‌గారికి థాంక్స్. . ఈ సినిమా విడుదల కాకముందే తను బిజీ హీరోయిన్ అయ్యింది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అభినవ్, కృష్ణచైతన్య ఇలా మంచి ఆర్టిస్టులు సినిమాకు కుదిరారు. సినిమాలో కొత్తదనం ఉంటుంది. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అన్ని ఎమోషన్స్ ఉంటాయి. రొటీన్‌కు భిన్నమైన చిత్రమని గ్యారంటీగా చెప్పగలను’’ అన్నారు.
నటీనటులు:
సుశాంత్, మీనాక్షి చౌదరి, వెంకట్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం, ఐశ్వర్య, నిఖిల్ కైలాస, కృష్ణచైతన్య తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: ఎస్.దర్శన్
నిర్మాతలు: రవి శంకర్ శాస్త్రి, ఎక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల
నిర్మాణ సంస్థలు: ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్
సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్
మ్యూజిక్: ప్రవీణ్ లక్కరాజు
ఎడిటర్: గ్యారీ బి.హెచ్
డైలాగ్స్: సురేశ్ భాస్కర్
ఆర్ట్: వి.వి
పి.ఆర్.ఓ: వంశీ శేఖర్
Pro: Vamsi – Shekar
9581799555 – 9553955385