సుశాంత్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఎస్.దర్శన్ దర్శకత్వంలో లెజెండ్రీ నటి భానుమతి రామకృష్ణ మనవడు రవి శంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్లలతో కలిసి ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 27న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సుశాంత్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, నిర్మాత హరీశ్, డైలాగ్ రైటర్ సాయిబాబా, అభినవ్ గోమటం, సినిమాటోగ్రాఫర్ సుకుమార్, పాటల రచయిత శ్రీనివాస్ మౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు, అవసరాల శ్రీనివాస్, వి.ఎన్.ఆదిత్య, జెమినీ కిరణ్, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రోల్ రైడా, ఎడిటర్ గ్యారీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద థియేటర్‌కు రావడానికి సాహసిస్తున్న జాతి.. తెలుగు జాతి మాత్రమే. ఏమీ భయపడక్కర్లేదు. మంచి కంటెంట్ క్రియేట్ చేసి మరింత ముందుకు వెళ్దాం. ఈ సినిమా చేయబోతున్నట్లు అల వైకుంఠపురములో షూటింగ్ టైమ్‌లోనే సుశాంత్ చెప్పాడు. సినిమా చాలా బాగా వచ్చిందని నేను కూడా బయట వింటున్నాను. సుశాంత్ తనకు తెలియకుండా ఓ చట్రంలో ఇరుక్కుపోయాడని అనుకునేవాడిని. అ . ప్రియదర్శిని పెళ్లిచూపుల నుంచి చూస్తున్నాను. సిన్సియర్ యాక్టర్. ఇలా అందరికీ అభినందనలు. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
హీరో సుశాంత్ మాట్లాడుతూ ‘‘మా సినిమా ప్రమోషన్స్ ప్రభాసన్న విడుదల చేసిన టీజర్‌తో స్టార్ట్ అయ్యింది. తర్వాత సమంత, వరుణ్, చైతన్య సాంగ్స్‌ను, చిన్నమామ(నాగార్జున) ట్రైలర్‌ను విడుదల చేశారు. అందరూ మాకు కావాల్సిన బూస్ట్ ఇచ్చారు. అందరికీ పేరు పేరునా థాంక్స్. త్రివిక్రమ్‌గారు చాలా బిజీగా ఉన్నప్పటికీ నేను అడిగానని వచ్చాడు. ఇక ప్రియదర్శి చాలా ఇంపాక్ట్ రోల్ చేశాడు. వెన్నెలకిషోర్‌గారు బిజీగా ఉన్నా డేట్స్ అడ్జస్ట్ చేసి సినిమా చేశాడు. ఈ సినిమా కాన్సెప్ట్ బేస్డ్. కానీ ఎంటర్‌టైనింగ్‌గా చేశాం. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను సాలిడ్‌గా ఎంటర్ టైన్ చేస్తుందని గ్యారంటీ ఇస్తున్నాను’’ అన్నారు.
నిర్మాత రవి శంకర్ శాస్త్రి మాట్లాడుతూ ‘‘మా టీమ్ కోసం వచ్చిన త్రివిక్రమ్‌గారికి థాంక్స్. పెద్దమ్మమ్మగారితో ఉండే అనుబంధం కారణంగా నాకు చిన్నప్పుడు సినీ ఇండస్ట్రీతో పరిచయం ఉండింది. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. అయితే మంచి సపోర్ట్ దొరికింది. సుశాంత్ అందగాడే కాదు, తెలివైనవాడు, బాగా కష్టపడతాడు. తన ఎఫర్ట్స్ ఈ సినిమాలో కనిపిస్తాయి. ఆగస్ట్ 27న విడుదలవుతున్న మా ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాను సక్సెస్ చేయాలి’’ అన్నారు.
నిర్మాతఏక్తా శాస్త్రి మాట్లాడుతూ ‘‘త్రివిక్రమ్‌గారికి థాంక్స్. సుశాంత్, దర్శన్, మీనాక్షి సహా ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు. ఆగస్ట్ 27న విడుదలవుతున్న సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
దర్శకుడు ఎస్.దర్శన్ మాట్లాడుతూ ‘‘ఎన్నో ఏళ్ల కల నేరవేరిన రోజుది. నాకు అండగా నిలబడిన కుటుంబ సభ్యులకు థాంక్స్. 2010లో నాకు, నా స్నేహితుడికి ఎదురైన ఓ నిజ ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమా చేశాను. ఢమరుకం సినిమా చేసే సమయంలో నా తోటి అసిస్టెంట్స్‌కు చెబితే సినిమాగా చేస్తే బాగుంటుందని వాళ్లు సలహా ఇచ్చారు. దాంతో అప్పటి నుంచి ఈ కథను డెవలప్ చేశాను. మరో కథను కూడా వినలేదు. ఈ సినిమాలో తనను చాలా కొత్తగా చూస్తారు. చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తారు. ఆయన వల్లే సినిమా జరిగినన్ని రోజులు స్మూత్‌గా సాగిపోయింది. థ్రిల్లర్ జోనర్‌లోని ఈ మూవీలో చాలా లేయర్స్ ఉన్నాయి. సినిమా కచ్చితంగా అందర్నీ ఎంటర్‌టైన్ చేస్తుంది’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు మాట్లాడుతూ ‘‘మా సినిమా నిర్మాతలకు థాంక్స్. గీతాంజలి, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల తర్వాత నాకు కాస్త గ్యాప్ వచ్చింది. మళ్లీ సినిమాలు చేయాలనుకుంటున్న సమయంలో హరీశ్‌గారి ద్వారా సుశాంత్‌ను కలిశాను. ఆయన నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. నా పాటల రచయితకు, రోల్ రైడాకు థాంక్స్. దర్శకుడు దర్శన్‌తో చాలా మంచి జర్నీ. చాలా మంచి అవుట్‌పుట్ రాబట్టుకున్నాడు. తనకు మంచి మ్యూజికల్ సెన్స్ ఉంది. తను భవిష్యత్తులో పెద్ద డైరెక్టర్ అవుతాడు. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.
నిర్మాత హరీశ్ మాట్లాడుతూ ‘‘రవిశంకర శాస్త్రిగారు, ఏక్తాగారు, సుశాంత్‌గారి లెగసీస్ ఏంటో తెలుసు. అలాంటి వాళ్లు చేసే సినిమాలో నేను భాగం కావడం అనేది చాలా గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నాం. రవిగారు, ఏక్తాగారు.. సినిమా రేంజ్‌ను పెంచారు. కొత్తవాళ్లను నమ్మి మాకు సపోర్ట్ చేశారు. సుశాంత్‌గారు సహా ఎంటైర్ టీమ్‌కు థాంక్స్. కొత్త సుశాంత్‌ను చూస్తారు. తనలో చాలా ఫైర్ ఉంటుంది. ఈ సినిమా తర్వాత తనకు చాలా కొత్త సినిమాలు వస్తాయి’’ అన్నారు.
హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ‘‘తొలి సినిమా కావడంతో కాస్త నెర్వస్‌గా ఫీల్ అయ్యాను. అయితే నిర్మాతలు రవిగారు, ఏక్తాగారు, హరీశ్‌గారి వల్ల మన అనే భావం ఎక్కవగా క్రియేట్ అయ్యింది. టాలెంటెడ్ టీమ్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ జర్నీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అన్నారు.
సినిమాటోగ్రాఫర్ సుకుమారన్ మాట్లాడుతూ ‘‘డిఫరెంట్ మూవీ. సపోర్ట్ చేసిన డైరెక్టర్ దర్శన్, నిర్మాతలు, ఎంటైర్ టీమ్‌కు థాంక్స్’’ అన్నారు.
Pro: Vamsi – Shekar
9581799555 – 9553955385