దొంగ`తెలుగు థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకున్న హర్షిత మూవీస్ అధినేత రావూరి వి. శ్రీనివాస్!!

791

‘ఖైదీ’లాంటి ఎమోషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చి ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకున్నయాంగ్రీ హీరో కార్తీ హీరోగా వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై దృశ్యం ఫేమ్‌ జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న‌ చిత్రం ‘దొంగ’. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ను హర్షిత మూవీస్ అధినేత రావూరి వి. శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా..

హర్షిత మూవీస్ అధినేత రావూరి వి. శ్రీనివాస్ మాట్లాడుతూ – “ఖైదీ’ లాంటి సూపర్ హిట్ తర్వాత కార్తీ చేస్తోన్న డిఫరెంట్ కమర్షియల్ ఫిలిం ‘దొంగ’. యాక్షన్, ఎమోషన్ అన్ని ఉన్నఈ చిత్రం టీజర్, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్ వస్తోంది. కార్తిగారికి వ‌దిన అయిన జ్యోతిక‌గారు ఈ చిత్రంలో అక్క పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. అలాగే స‌త్య‌రాజ్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. గోవింద్ వ‌సంత మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆర్‌.డి.రాజశేఖర్ విజువ‌ల్స్ ఈ చిత్రానికి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలుస్తాయి. మా బేనర్లో తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం కల్పించిన వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ సంస్థలకి, హీరో కార్తీ గారికి ధన్యవాదాలు. డిసెంబ‌ర్ 20న ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్‌గా విడుద‌ల‌చేస్తున్నాం“అన్నారు.

యాంగ్రీ హీరో కార్తీ, జ్యోతిక, సత్యరాజ్‌, నికిలావిమ‌ల్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి.రాజశేఖర్‌, సంగీతం: గోవింద్‌ వసంత, దర్శకత్వం: జీతు జోసెఫ్‌.