*హీరో శింబు కొత్త చిత్రం “ఈశ్వరుడు”*

556

నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్రామీణ నేపథ్య చిత్రం “ఈశ్వరుడు”. మహాదేవ్ మీడియా బాలాజీ సమర్పణలో డీ కంపెనీ – కేవీ దురై బ్యానర్ లో ఈ చిత్రం నిర్మితమవుతోంది.ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో శింబు తన స్టైల్ లో లుంగీ కట్టుకొని పడగవిప్పిన పాముని మెడ మీద వేసుకొని కనిపిస్తున్నాడు.

శింబు లుక్ చూస్తుంటే గతంలో కం

టే చాలా బరువు తగ్గినట్లు కనిపిస్తున్నాడు.

ఇక ఈ చిత్రంలో శింబు సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగీతం సమకూర్చనున్నాడు. ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.