*శ్రీ రాధ్య ఆర్ట్స్ బ్యానర్ ను లాంచ్ చేసిన నిర్మాత రాజ్ కందుకూరి!*

495

సినిమా ఇండస్ట్రీపై మక్కువతో మంచి సందేశం ఉన్న చిత్రాలను తియ్యాలన్న సంకల్పంతో నిర్మాత నున్న శివబాబు శ్రీ రాధ్య ఆర్ట్స్ బ్యానర్ ను స్థాపించడం జరిగింది. దసరా పండగ సందర్భంగా ఈ బ్యానర్ ను నిర్మాత రాజ్ కందుకూరి లాంచ్ చెయ్యడం జరిగింది.

ఈ సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ…
శ్రీ రాధ్య ఆర్ట్స్ బ్యానర్ ను నేను లాంచ్ చెయ్యడం సంతోషంగా ఉంది. ఈ బ్యానర్ ద్వారా ఒక మంచి నిర్మాత ఇండస్ట్రీకి రాబోతున్నాడు. నిర్మాతగా శివబాబు బాగా సక్సెస్ అయ్యి శ్రీ రాధ్య ఆర్ట్స్ బ్యానర్ లో పలు మంచి చిత్రాలు తీయాలని కోరుకుంటున్నాను. ఆయన ఐడియాస్, థార్ట్స్ బాగున్నాయని తెలిపారు.

నిర్మాత నున్న శివబాబు మాట్లాడుతూ…
అందరికి నమస్కారాలు, ముందుగా అందరికి దసరా శుభాకాంక్షలు. మా శ్రీ రాధ్య ఆర్ట్స్ బ్యానర్ ను లాంచ్ చేసిన నిర్మాత రాజ్ కందుకూరి గారికి ధన్యవాదాలు. ఆయన సపోర్ట్ మరువలేనిది. మేము కొత్త నిర్మాతలైన మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. డిసెంబర్ 16న దత్త జయంతి సందర్భంగా మా బ్యానర్ లో కొత్త సినిమా స్టార్ట్ చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎంతోమందికి నీడనిచ్చిన కళామతల్లి దీవెనలు మాపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న అన్నారు.