నవంబర్ 1న ”ఫిలిమ్” ఓటీటీ లాంఛ్, తొలి ప్రీమియర్ గా ”పిజ్జా 2”

539

ఇంట్రెస్టింగ్ కంటెంట్, రేర్ కలెక్షన్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేందుకు ‘ఫిలిమ్’ ఓటీటీ సిద్ధమవుతోంది. ‘ఫిలిమ్’ యాప్ లో కొత్త సినిమాల ప్రీమియర్ లు, ఇండిపెండెంట్ మూవీస్, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులు చూసేయచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘ఫిలిమ్’ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ‘ఫిలిమ్’ లో తొలి చిత్రంగా నవంబర్ 1న ”పిజ్జా 2” సినిమా ప్రీమియర్ కానుంది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు రంజిత్ జయకోడి రూపొందించారు. గాయత్రి నాయికగా నటించింది. ఈ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ”పిజ్జా 2” ‘ఫిలిమ్’ వీక్షకులను ఆకట్టుకోనుంది.

ఇదే కాకుండా త్రిష, నివిన్ పాలీ నటించిన ”హే జ్యూడ్”, మలయాళ స్టార్ మమ్ముట్టి నటించిన ”రంగూన్ రౌడీ”, ప్రియమణి థ్రిల్లర్ ”విస్మయ”, ధృవ, జేడీ చక్రవర్తి నటించిన ”మాస్క్” తదితర చిత్రాలు ఫిలిమ్ ఓటీటీలో ప్రీమియర్ కానున్నాయి. వెబ్ సిరీస్ లు ”ఓయ్ బేబీ”, ”వెనీలా”, ఇండిపెండెంట్ మూవీ ”ఓమ్” (ఓన్లీ మనీ), సూపర్ హిట్ సినిమాలు ‘గుల్టూ’, ‘రుధిరం’, ‘గాడ్ ఫాదర్’, ‘మహిర’, ‘ఇష్క్’, ‘వెంకీ’, ‘ఢీ’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బద్రి’, ‘అతిథి’, ‘నీ స్నేహం’, ‘గమ్యం’…ఇలా చాలా పెద్ద కలెక్షన్ తో మెమొరబుల్ ఫిల్మ్స్ ఆడియెన్స్ చూసేయొచ్చు.

ఈ సందర్భంగా ‘ఫిలిమ్’ ఓటీటీ యాజమాన్యం మాట్లాడుతూ…ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను తెలుగు వీక్షకులకు అతి తక్కువ సబ్ స్క్రిప్షన్ ధరలతో అందించాలనే ఉద్ధేశ్యంతో ‘ఫిలిమ్’ ఓటీటీ ప్రారంభించాం. ‘ఫిలిమ్’ ఓటటీలో మోస్ట్ అవేటింగ్ కొత్త సినిమాలతో పాటు, ఎప్పటికీ గుర్తుండిపోయే సూపర్ హిట్ సినిమాలూ చూడొచ్చు. అరుదైన కలెక్షన్, వివిధ జానర్ చిత్రాలు మా ప్రత్యేకత. మా ఓటీటీలో ప్రీమియర్ అయిన కొత్త సినిమాలను నేరుగా ‘థియేటర్ లో కూడా విడుదల’ చేస్తున్నాం. ఇది ఓటీటీ చరిత్రలో కొత్త ట్రెండ్ అవుతుంది. అన్నారు.