అంగరంగ వైభవంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు

404

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి చిరు’త’నయుడిగా ఎంట్రీ ఇచ్చినా మొదటి సినిమాతోనే తనదైన హీరోయిజంతో ఆకట్టుకుని మెగా అభిమానులకు నిజంగా గొప్ప ఆనందాన్ని పంచారు చరణ్. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో రెండో సినిమాగా మగధీర సినిమాతో సినిమా రికార్డులను బద్దలు కొట్టి.. దేశవ్యాప్తంగా చరణ్ అంటే ఇది అనే రేంజ్ స్టామినా చాటాడు. రామ్ చరణ్ మగధీర సినిమా తరువాత అయన హీరోగా వెనక్కి చూసుకోవలసిన అవసరం రాలేదు.. ఆ తరువాత వరుస సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్నాడు.   యువ హీరో తేజ సజ్జ లతోపాటు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ .. మెగాస్టార్ అభిమానులందరికి, పవర్ స్టార్ అభిమానులకు, మెగా పవర్ స్టార్ అభిమానులకు ధన్యవాదాలు, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు.   ఆలాగే ఆచార్య లో మెగాస్టార్ తో కలిసి ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ది గ్రేట్ శంకర్ దర్శకత్వంలో మా బ్యానర్ లో మరో ప్రతిష్టాత్మక చిత్రం ఇలా ఒకే ఇయర్ మూడు భారీ సినిమాలతో రికార్డ్ క్రియేట్ చేయనున్నాడు చరణ్ అన్నారు.

హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ … నేను హైద్రాబాద్ వచ్చిన కొత్తల్లో 2004 సమయంలో పెద్ద మామయ్యకు బర్త్ డే విషెష్ చెప్పాలి అని అనుకున్నప్పుడు బర్త్ డే వేడుకలు ఫాన్స్ తో కలిసి చేసుకుంటారని చెప్పడంతో అలాగే ఫాన్స్ తో కలిసి ఆ ఏడాది , ఆ తరువాత ఏడాది కూడా చేసుకున్నాం. ఆ తరువాత ఇన్నాళ్లకు 2021 లో ఫాన్స్ మధ్య ఇంత పెద్ద ఈవెంట్ లో మా బావ మా చరణ్ పుట్టినరోజు వేడుకలు జరగడం చాలా ఆనందంగా ఉంది.  మెగాస్టార్ చిరంజీవి గారుకీ   మేమంతా అయన పిల్లలం. మాకు మీ సపోర్ట్ ఉంది. మీ ప్రేమకు మేమెప్పుడూ దాసులమే అన్నారు.

తేజ రోజా మాట్లాడుతూ .. నా బర్త్ డె సందర్బంగా చిరంజీవి గారిని కలవడం ఆ రోజు అయన తన ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో కేక్ తెచ్చి బర్త్ డే వేడుకలు జరపడం నేనెప్పటికీ మరచిపోలేను. ఆ తరువాత చరణ్ అన్న నన్ను తీసుకుని వెళ్లి నాకు బట్టలు కూడా కొనిచ్చారు .. ఈ విషయం ఎక్కడ చెప్పలేదు.. కానీ ఇప్పుడు చెబుతున్నాను.. నిజంగా చరనన్న గ్రేట్, నేను ఆ ఫ్యామిలీ లో ఒక్కడిగా నన్ను చూసినందుకు చాలా థాన్స్క్ అన్నారు.

నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ .. రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అయన మా బ్యానర్ కు గొప్ప సినిమా ఇచ్చాడు. అయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను, ఇంకా చాలా చాలా మంచి సినిమాలు చేయాలి, మా బ్యానర్ లో మరోసారి అదే కాంబినేషన్ లో సినిమా చేయాలి అన్నారు.

దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ .. నేను దిల్ రాజు గారికి పెద్ద ఫ్యాన్ ను ఎందుకంటే అయన మా గురువు సుకుమార్ గారిని దర్శకుడు చేసారు. నేను దర్శకుడు అవ్వడానికి కారణం చరణ్ గారు.. నేను ఏ కథ చెప్పినా చాలా ఇంట్రెస్ట్ గా వినేవాళ్ళు. అంతబాగా నన్ను అదరించారు ..ఆయనకు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్నారు.

హీరో వైష్ణవ తేజ్ మాట్లాడుతూ .. మెగా ఫాన్స్ అందరికి చాలా పెద్ద హాయ్. చరణ్ అన్న బర్త్ డే వేడుకలు ఇంత గ్రాండ్ గా చేసినందుకు మీ అందరికి థాంక్స్, అలాగే చరణ్ అన్న ఫాన్స్ కు చిరంజీవి మామ ఫాన్స్ అందరికి హాయ్. ఈ వేడుకల్లో నేను పాల్గొన్నందుకు చాల ఆనందంగా ఉంది. మెగా ఫాన్స్ అందరికి మరోసారి థాంక్స్ అన్నారు.

ఈ వెదికపై కరోనా సమయంలో సేవలు అందించిన పలువురిని సత్కరించారు. ఈ వేదికపై కేక్ ను కట్ చేసారు.


Thanks & Regards
suresh. kondeti