అమెజాన్ ప్రైమ్ లో MMOF విడుదల

850

విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి హీరోగా ఆర్ ఆర్ ఆర్ ప్రొడక్షన్స్ & జె కే క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి అనుశ్రీ సమర్పణలో రాజశేఖర్,ఖాసీం లు నిర్మించిన చిత్రం MMOF ఎన్.ఎస్ సి దర్శకత్వం వహించగా ఈ సినిమా నేటినుంచి అమెజాన్ ప్రైమ్ లో విడుదలై విజయవంతంగా నదుస్తుందని నిర్మాతలు ప్రకటించారు. థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కిన జేడీ చక్రవర్తి కథానాయకుడు గా నటించిన ఈ సినిమా లో ధియేటర్ నడుపుకునే ఓ వ్యక్తి ఆ థియేటర్లో అడల్ట్ సినిమాలు నడుపుకుంటూ ఉంటాడు. అయితే ధియేటర్ కి వచ్చిన వాళ్ళు చనిపోతూ వుంటారు.. అసలు వీళ్ళు చనిపోవడానికి, ధియేటర్ కి, ఆ అడల్ట్ సినిమాలకి ఉన్న సంభందం ఏమిటి అన్నది సినిమా కథ.. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, టీజర్ కు మంచి స్పందన రాగ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి..

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. సినిమా అమెజాన్ లో విడుదల అయిందని.. తప్పకుండా ఈ సినిమాని చూడండి.. ప్రేక్షకులు కోరుకునే అన్నీ అంశాలు సినిమాలో ఉన్నాయి..థ్రిల్లర్ జొనర్ లో ఇదో కొత్త తరహా చిత్రంగా ఉంటుంది.. ఇది మిస్ అయితే ఓ మంచి థ్రిల్లర్ మిస్ అవుతారు..మంచి సస్పెన్స్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆదరించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను.. అన్నారు..

నటీనటులు

జె.డి చక్రవర్తి, బెనర్జీ ,కిరాక్ ఆర్పీ, చమ్మక్ చంద్ర అక్షిత ముద్గల్ అక్షత శ్రీనివాస్, టార్జాన్,మనోజ్ నందన్, శ్రీ రామచంద్ర , రాజీవ్

సాంకేతిక నిపుణులు

ప్రెసెంట్స్.. శ్రీమతి అనుశ్రీ
ప్రొడ్యూసర్స్.. రాజ శేఖర్, ఖాసీం
దర్శకత్వం ..ఎన్ యస్.సి
మ్యూజిక్.. సాయి కార్తీక్
కెమెరామెన్.. అంజి
డైలాగ్స్.. రాఘవ
ఎడిటర్.. ఆవుల వెంకటేష్
కో-ప్రొడ్యూసర్స్ ..బండి శివ, గుడిపాటి రవి