HomeTeluguజ‌న‌వ‌రి 24న విడుద‌ల కాబోతున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ‘హత్య’

జ‌న‌వ‌రి 24న విడుద‌ల కాబోతున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ‘హత్య’

ప్రస్తుతం థ్రిల్లర్ జానర్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘మధ’ అంటూ సైకలాజికల్ థ్రిల్లర్‌తో అందరినీ మెప్పించిన శ్రీ విద్య బసవ ‘హత్య’ అనే మరో థ్రిల్లర్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ చిత్రం జ‌న‌వ‌రి 24న రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమాను మహాకాళ్‌ పిక్చర్స్ పతాకంపై ఎస్ ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. గురువారం ఈ మూవీ టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ప్ర‌ముఖ న‌టుడు ర‌వివ‌ర్మ చేతుల మీదుగా టీజ‌ర్ విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా…

చిత్ర ద‌ర్శ‌కురాలు శ్రీవిద్య బ‌స‌వ మాట్లాడుతూ ‘‘నా తొలి చిత్రం మధ సినిమాను ప్రేక్ష‌కుల్లోకి తీసుకెళ్లిన మీడియాకు, ఆద‌రించిన అంద‌రికీ ముందుగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. ఐదేళ్ల త‌ర్వాత ఇప్పుడు నేను హ‌త్య సినిమాతో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాను. థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లోనే రెండో సినిమా కూడా చేస్తున్నాను. ఇది అంద‌రికీ తెలిసిన క‌థే అయిన‌ప్ప‌టికీ గ్రిప్పింగ్‌గా, సీట్ ఎడ్జ్ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్ల‌ర్ మూవీగా అల‌రించేలా తెర‌కెక్కించాను. చాలా హార్డ్ వ‌ర్క్‌, ఎఫ‌ర్ట్స్ పెట్టి స్క్రీన్ ప్లే రాసుకుని చేసిన సినిమా ఇది. ఈ ప్ర‌యాణంలో నాకెంతో స‌పోర్ట్ చేసిన న‌టీన‌టులు ధన్య బాలకృష్ణ, రవివర్మ, పూజా రామచంద్రన్ స‌హా అంద‌రికీ థాంక్స్‌. న‌రేష్ అద్భుత‌మైన బీజీఎంను అందించాడు. అభిరాజ్ విజువ‌ల్స్ చ‌క్క‌గా కుదిరాయి. అనిల్ ఎడిటింగ్ సినిమాను మ‌రింత క్యూరియ‌స్‌గా మార్చింది. మ‌ధ స‌మ‌యంలో ర‌వివ‌ర్మ‌గారు నాకు ప‌రిచ‌యం అయ్యారు. క‌లిసి ప‌ని చేద్దామ‌ని అన్నారు. అంత మంచి న‌టుడు నన్ను అప్రోచ్ కాగానే నాకెంతో సంతోష‌మేసింది. ఇప్పుడు హ‌త్య స్క్రిప్ట్ త‌యారు చేసేట‌ప్పుడు ర‌విగారిని దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాను. ఆయ‌న చాలా కొత్త‌గా క‌నిపిస్తారు. నెక్ట్స్ లెవ‌ల్ యూనిక్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపిస్తారు. పూజా రామ‌చంద్ర‌న్ రోల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆమె త‌న న‌ట‌న‌తో దాన్ని మ‌రో రేంజ్‌కు తీసుకెళ్లింది. ధ‌న్య బాల‌కృష్ణ కూడా ఎంతో స‌పోర్ట్ చేసింది. సినిమాను బాగా తీయ‌టానికి ఏం చేయాల‌ని అని ఆలోచించి చేసే టీమ్‌తో ప‌ని చేయ‌టం ఎంతో ప్ల‌స్ అయ్యింది. మా నిర్మాత ప్ర‌శాంత్‌గారికి థాంక్స్‌. ప్రేక్ష‌కులు సినిమాను ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

న‌టుడు ర‌వివ‌ర్మ మాట్లాడుతూ ‘‘నటుడిగా ముందు నుంచి వైవిధ్యమైన సినిమాలు చేయటానికే ప్రాధాన్యమిస్తూ వచ్చాను. అందుకనే ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ఇప్ప‌టి వ‌ర‌కు ద‌క్కుతుంది. మ‌ధ సినిమా టీజ‌ర్ చూడ‌గానే నేను శ్రీవిద్య‌కు కాల్ చేశాను. నేను కూడా సినిమాలో భాగం అవుతాన‌ని అన్నాను. చాలా చిన్న పాత్ర ఉంద‌ని చెప్పింది. నాకు నేనుగా వెళ్లి ఆ సినిమాలో యాక్ట్ చేశాను. అప్పుడు ఆమెతో ప్రారంభ‌మైన ఆ జ‌ర్నీ ఇప్పుడు ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించేలా చేసింది. రొటీన్‌కు భిన్న‌మైన రోల్‌ను శ్రీవిద్య న‌న్ను లుక్ టెస్ట్ చేసి ఎంపిక చేసింది. ఇది నాకొక ఛాలెంజింగ్ రోల్‌. అభిరాజ్ బ్యూటీఫుల్ సినిమాటోగ్రాఫ‌ర్‌. అలాగే న‌రేష్ బీజీఎం, అనీల్ ఎడిటింగ్ సినిమాను మ‌రో ఎత్తుకు తీసుకెళ్లాయి. శ్రీవిద్య కొత్త టైప్ ఆఫ్ మేకింగ్‌కి తెర తీసింది. త‌ను జ‌గ‌మొండి. కావాల్సిన ఔట్‌పుట్ ఇవ్వ‌క‌పోతే త‌ను వ‌ద‌ల‌దు. హ‌త్య సినిమా జ‌ర్నీని ఎంతో ఎంజాయ్ చేశాను. సినిమా అంద‌రినీ ఎంగేజ్ చేసే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌. ఆడియెన్స్‌కు డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది’’ అన్నారు.

న‌టి పూజా రామ‌చంద్ర‌న్ మాట్లాడుతూ ‘‘నాకు కొడుకు పుట్టిన తర్వాత నటించిన తొలి సిినిమా ఇది. చాలా మంది నాకు సినిమాలు ఆఫ‌ర్ చేసిన నో చెబుతూ వ‌చ్చాను. అయితే విద్య‌తో మాట్లాడిన త‌ర్వాత .. ఫుల్ లెంగ్త్ క్యారెక్ట‌ర్ కాక‌పోయినా త‌ప్ప‌కుండా చేస్తాన‌ని చెప్పి మరీ యాక్ట్ చేశాను. నాది కీ రోల్‌. సినిమానంత మార్చేసే చాలా ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించాను. చాలా కాలం త‌ర్వాత హ‌త్య వంటి డిఫ‌రెంట్ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాను. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన డైరెక్ట‌ర్ శ్రీవిద్య‌కి థాంక్స్‌. ర‌వివ‌ర్మ అద్భుత‌మైన న‌టుడు. శ్రీవిద్య ఎక్స్‌లెంట్ డైరెక్ట‌ర్‌. త‌ను ఇండ‌స్ట్రీలో ఇంకా ఉన్న‌త శిఖ‌రాల‌ను చేరుకోవాల‌ని కోరుకుంటున్నాను. అంద‌రి ద‌గ్గ‌రి నుంచి బెస్ట్ ఔట్‌పుట్‌ను రాబ‌ట్టుకుంది. అభిరాజ్ ప్ర‌తీ ఫ్రేమ్‌ను బ్యూటీఫుల్‌గా క్యాప్య‌ర్ చేశారు. న‌రేష్ త‌న మ్యూజిక్‌తో సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లారు. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ న‌రేష్ కుమార‌న్‌.పి మాట్లాడుతూ ‘‘శ్రీవిద్య బసవ మంచి టాలెంటెడ్ డైరెక్టర్. ఏదీ ఒక ప‌ట్టాన ఒప్పుకోదు. కావాల్సిన ఔట్‌పుట్‌ను రాబ‌ట్ట‌కుంటుంది. ర‌వివ‌ర్మ‌గారికి, పూజా రామ‌చంద్ర‌న్‌, ధ‌న్య బాల‌కృష్ణ‌గారికి థాంక్స్‌. అలాగే అభిరాజ్‌కి థాంక్స్‌’’ అన్నారు. ఎడిట‌ర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ‘‘మా డైరెక్టర్ శ్రీవిద్యగారు బోల్డ్ డైరెక్టర్. బోల్డ్ డిసిష‌న్స్ తీసుకుంటారు. ఆమె క‌థ‌ను హ్యాండిల్ చేసిన విధానం ఎంతో ఎంగేజింగ్‌గా ఉంది. ప్ర‌తీ ఒక్క‌రూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. మా టీమ్‌కు థాంక్స్‌’’ అన్నారు.

ఈ చిత్రానికి అభిరాజ్ రాజేంద్రన్ నాయర్ సినిమాటోగ్రఫర్‌గా, నరేష్ కుమారన్.పి సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. అనిల్ కుమార్ పి ఈ చిత్రానికి ఎడిటర్‌గా, ఎస్‌ ప్రశాంత్‌ రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని అప్డేట్లు ఇవ్వనున్నట్టుగా టీం ప్రకటించింది.

నటీనటులు : ధన్య బాలకృష్ణ, రవివర్మ, పూజా రామచంద్రన్ తదితరులు

సాంకేతిక సిబ్బంది: బ్యాన‌ర్‌: మ‌హాకాళ్ పిక్చ‌ర్స్‌, రచన, దర్శకత్వం: శ్రీవిద్య బసవ, నిర్మాత: ఎస్ ప్రశాంత్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: అభిరాజ్ రాజేంద్రన్ నాయర్, సంగీత దర్శకుడు: నరేష్ కుమారన్.పి, ఎడిటర్: అనిల్ కుమార్.పి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్: ఎస్ ప్రశాంత్ రెడ్డి, సౌండ్ డిజైన్: సింక్ సినిమా- సచిన్ సుధాకరన్, హరిహరన్, సౌండ్ మిక్స్: అరవింద్ మీనన్,….


Duddi Sreenu (P.R.O)
8498044499

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES