విక్టరీ వెంకటేష్ నారప్పలో మునిక‌‌న్నా పాత్ర‌లో కార్తిక్..

755


సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా విక్టరీ ఇంటిపేరు గా చేసుకున్న వెంకటేష్ హీరోగా, మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న చిత్రం నారప్ప. ఈ చిత్రం లో నారప్ప భార్య సుందరమ్మ గా ప్రియమణి న‌టిస్తోంది. కాగా నార‌ప్ప పెద్ద కొడుకు మునిక‌‌న్నా గా కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ కార్తిక్ ర‌త్నం న‌టిస్తున్నారు. ఈ రోజు కార్తిక్ పుట్టిన‌రోజు సందర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ మునిక‌న్నా లుక్‌ని విడుద‌ల చేసింది నార‌ప్ప చిత్ర యూనిట్‌.

విక్టరీ వెంకటేష్‌, ప్రియమణి,కార్తిక్ ర‌త్నం త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి,

సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు,
సంగీతం: మణిశర్మ,
ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్‌,
ఆర్ట్‌: గాంధీ నడికుడికర్‌,
కథ: వెట్రిమారన్‌,
స్క్రిప్ట్ కన్సల్టెంట్: సత్యానంద్,
ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌,
లిరిక్స్‌: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంతశ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం,
ఫైనాన్స్‌ కంట్రోలర్‌: జి.రమేష్‌రెడ్డి,
ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: రామబాలాజి డి.,
ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఏపీ పాల్‌ పండి,
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ శంకర్‌ డొంకాడ,
కో- ప్రొడ్యూసర్‌: దేవి శ్రీదేవి సతీష్‌
నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను
దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల