*దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ‌శేఖ‌ర్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ `శాకుంత‌లం` షూటింగ్‌ ప్రారంభం.*

635

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో పౌరాణి్క‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న డైన‌మిక్ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ ఆదిప‌ర్వంలోని ఆహ్లాద‌క‌ర‌మైన ప్రేమ‌క‌థ ఆధారంగా తెర‌కెక్కిస్తోన్న చిత్రం `శాకుంతలం`. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో డిఆర్‌పి-గుణా టీమ్ వర్క్స్‌ ప‌తాకంపై గుణ‌శేఖ‌ర్ కుమార్తె నీలిమ గుణ నిర్మిస్తున్నారు. స్టార్ హీరోయిన్ స‌మంత అక్కినేని శకుంతలగా టైటిల్ పాత్ర పోషిస్తున్నఈ చిత్రంలో మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ హైద‌రాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ క్లాప్ నివ్వ‌గా, సూప‌ర్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు కెమెరా స్విఛాన్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో…

సూప‌ర్ స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్‌ దిల్ రాజు మాట్లాడుతూ.. ‘సమంత మేనేజర్ మ‌హేంద్ర వచ్చి నాతో శాకుంతలం సినిమా గురించి చెప్పాడు. గుణ శేఖర్ మళ్లీ నిర్మాతగా ఎందుకు చేస్తున్నారు.. ఆయన వెనక ఎవరైనా ఉంటే బాగుంటుంది అన్నాను, మీరు ఉంటారా స‌ర్ అని అన్న‌ప్పుడు స‌రే కాని నేను క‌థ వినాలి అని చెప్పాను. గుణ శేఖర్‌కు తగ్గ టీం దొరికింది. అద్భుతమైన సినిమా మీకు అందించేందుకు ప్రయత్నం చేస్తాం’`అన్నారు.

చిత్ర నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ.. ‘నిర్మాతగా నా మొదటి సినిమా. మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చినందుకు అల్లు అర‌వింద్‌గారికి నా ధ‌న్య‌వాదాలు. స‌మంత‌,హ‌న్షిత చాలా స‌పోర్ట్ చేస్తున్నారు“ అన్నారు.

హీరో దేవ్ మోహన్ మాట్లాడుతూ.. ‘తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కావడం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది. ఓ రాజుగా దుష్యంతుడి పాత్రలో కనిపించడం ఎంతో సంతోషంగా ఉంది. గుణ శేఖర్ లాంటి దర్శకుడితో పని చేయడం ఎంతో గర్వంగా ఉంది. అసలు సిసలు నిర్మాత దిల్‌రాజుగారు మా వెనక ఉన్నారు. మీరు కూడా నన్నుఆదరిస్తారని అనుకుంటున్నాను. సమంతతో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉంది. ఆమె ఎంతో సపోర్ట్ చేస్తుందని ఆశిస్తున్నాను’ అన్నారు.

స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని మాట్లాడుతూ.. ‘నాకు ఎప్పుడూ ఓ చిన్న బాధ ఉండేది. నేను కొన్ని పాత్రలు పోషించలేనేమోనని అనుకున్నాను. రొమాంటిక్, విలన్, యాక్షన్ ఇలా అన్ని పాత్రలు చేశాను. కానీ నా డ్రీమ్ రోల్ అంటే పీరియాడిక‌ల్‌ రోల్, రాజకుమారి పాత్రలను చేయాలని అనుకున్నాను. ఇప్ప‌టికీ నేను ఖాళీగా ఉంటే డిస్నీ సినిమాలు చూస్తుంటాను. నా కెరీర్‌లో ఇలాంటి సమయంలో ఈ పాత్ర ఇవ్వడం మరిచిపోలేని గొప్ప బహుమతి.

డైన‌మిక్ డైరెక్ట‌ర్ గుణ శేఖర్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు శాకుంతలం అనే ప్యాన్ ఇండియా‌ సినిమాని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. డీఆర్పీ గుణ టీం వర్క్స్ (దిల్ రాజు ప్రొడక్షన్స్ అండ్ గుణ టీం వర్క్స్) కలిసి సంయుక్తంగా నిర్మించడం ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా దిల్ రాజు వంటి మేకర్ ఈ సినిమాకు వెన్నుతట్టి అన్ని విషయాల్లో ప్రోత్సహించారు. వ్యాపార దృష్టితోనే కాకుండా మంచి సినిమా తీయాలనే ఉద్దేశ్యంతో దిల్ రాజుగారు ఈ సినిమాకు ఎంత బ‌డ్జెట్ అయితే అంత‌ ఖర్చుపెట్టండి మీ వెన‌కాల నేను ఉన్నాను అని అన్నారు. ఇక దుష్యంతుడిగా దేవ్ మోహన్ గారిని కూడా నీలిమనే  సెలెక్ట్ చేసింది. కథ గురించి అంతా తెలుసుకుని ఓకే చెప్పారు. సినిమాకు కావాల్సిన హార్స్ రైడింగ్‌, స్వోర్డ్‌ ఫైటింగ్ ఇలా అన్నీ నేర్చుకున్నారు. రేపు  వీరిద్ద‌రూ సినిమాలో శకుంతలా? దుష్యంతుడా? అనేలా పోటాపోటీగా ఉంటారు“ అన్నారు