`ఎం3` చిత్ర ద‌ర్శ‌కుడు రామ్ కృష్ణ తోట దర్శకత్వంలో వస్తోన్న మరో సినిమా ‘కోడి కత్తి!!

502


రామ్ కృష్ణ తోట దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఎం3’. (మ్యాన్‌ మ్యాడ్‌ మనీ అనేది క్యాప్షన్‌). ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా ఈ చిత్రం విడుదల దశలో ఉండగానే మరో ప్రాజెక్ట్ ని అనౌన్స్‌ చేశారు. ద‌ర్శ‌కుడు రామ్ కృష్ణ తోట దర్శకత్వంలో వస్తోన్న మరో సినిమా ‘కోడి కత్తి`.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రామ్ కృష్ణ తోట మాట్లాడుతూ – సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో అద్భుతమైన కథ, కథనంతో `ఎం3` చిత్రం రూపొందింది. తెలుగు ప్రేక్షకులు కంటెంట్‌ బేస్డ్‌ మూవీస్‌, కొత్త తరహా సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారు. ఆ నమ్మకంతోనే ఓ కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమాను రూపొందించాం. ‘ఎం3’ చిత్రం కూడా ఆ కోవలోనే ఉంటుంది. ఇక ద‌ర్శ‌కుడిగా నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘కోడి కత్తి`. నిజజీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కె. శరత్ వర్మ పనిచేస్తున్నారు. న‌టీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం“అన్నారు.