యువత చిత్రం తో మంచి మార్క్ లు వేసుకున్న దర్శకుడు పరుశురాం బుజ్జి తన మార్క్ చిత్రాల్ని తీస్తూ తనేంటే ప్రూవ్ చేసుకున్నాడు. యువత లాంటి యూత్‌ఫుల్ హిట్ చిత్రం తరువాత తను మాస్‌మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కించిన సారోస్తారు.. ఆంజనేయులు చిత్రాలు దేనికదే ఢిఫరెంట్ జోనర్ లో చిత్రీకరించిన చిత్రాలుగా మంచి విజయాల్ని సాధించా యి. అలాగే లవ్ అండ్ ఫ్యామిలి ఎంటర్‌టైనర్ గా రూపోందించిన సోలో చిత్రం ఘనవిజయాన్ని సాదించటమే కాకుండా హీరో నారా రోహిత్ కి చాలా మంచి పేరు తీసుకువచ్చింది. అంతేకాదు ఫ్యామిలి ఆడియన్స్ లో ఈ సినిమా కి వచ్చిన క్రేజ్ టెలివిజన్ లో రిపీట్ గా టెలికాస్ట్ అవ్వటమే నిదర్శనం. పరుశురాం బుజ్జి దర్శకుడిగా ఫ్యామిలి ఆడియన్స్ చెంతకు చేర్చింది సోలొ అనే చెప్పాలి. ఆ తరువాత అల్లు శిరీష్ హీరోగా నిర్మించిన శ్రీరస్తు శుభమస్తు చిత్రం మరోక్కసారి ఫ్యామిలి ఎంటర్‌టైనర్ మర్కు ని గట్టిగా నిలబెట్టింది.
మెగా నిర్మాత శ్రీ అల్లు అరవింద్ గారి సమర్పణలో GA 2 పిక్చర్స్ పతకం పై సక్సెసఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన సినిమా “గీత గోవిందం చిత్రాన్ని టాలెంటెడ్ దర్శకుడు పరుశురాం బుజ్జి తెరకెక్కించారు. ఈ చిత్రం 100 కొట్లు వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర పరుశురాం సత్తా చూపించింది. ఫ్యామిలి ఎంటర్‌టైనర్ కి ఎమెషన్ యాడ్ చేసి కమర్షియల్ హంగుల తో పరుశురాం హీరో విజయదేవరకొండ ని సెల్యూలాయిడ్ పై చూపించిన విధానం కి ప్రేక్షకులు భ్రహ్మరధం పట్టారు. దర్శకుడుగా పరుశురాం బుజ్జి ని అగ్రస్థానం లో నిలబెట్టారు. ఇప్పడు సూపర్‌స్టార్ మహేష్ బాబు తో సర్కారువారి పాట చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు పరుశురాం బుజ్జి పుట్టినరోజు(డిసెంబర్ 25) జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా చిత్ర పరిశ్రమ నుండి చాలా మంది ప్రముఖలు తనకి విషెస్ చెప్పారు.
PRO ; ELURU SEENU