స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సందీప్ మాధవ్ ‘గంధర్వ’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల

310

వంగవీటి, ‘జార్జిరెడ్డి‘ ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా గాయత్రి ఆర్. సురేష్, శీత‌ల్ భ‌ట్ హీరోయిన్స్‌గా రూపొందుతున్న చిత్రం ‘గంధర్వ’. ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, వీర శంక‌ర్ సిల్వ‌ర్ స్క్రీన్స్ ప‌తాకాల‌పై అప్సర్ దర్శకత్వంలో ఎమ్.ఎన్ మధు ‘గంధర్వ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డైలాగ్ కింగ్ సాయి కుమార్, సురేష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

ఇండియ‌న్ సినిమాల్లో రాన‌టువంటి ఓ డిఫ‌రెంట్ క‌థాంశంతో ద‌ర్శ‌కుడు అప్స‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించ‌ని ఓ డిఫ‌రెంట్ రోల్‌లో సందీప్ మాధ‌వ్ క‌నిపించ‌నున్నారు. ఫ‌స్ట్‌లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే హీరో సందీప్ మాధ‌వ్ రౌడీల‌ను చిత‌క్కొడుతున్నారు. హీరో చేతులు ఓ కుర్చీకి క‌ట్టేయ‌బ‌డి ఉన్నాయి. ఇవ‌న్నీ చూస్తుంటే గంధ‌ర్వ సినిమాలో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలుంటాయ‌ని తెలుస్తుంది. సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. నాగు.వై ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌.

ర్యాప్ రాక్ ష‌కీల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నిరంజ‌న్ జె.రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

న‌టీన‌టులు:
సందీప్ మాధ‌వ్‌, గాయ‌త్రి ఆర్‌.సురేశ్‌, శీత‌ల్ భ‌ట్‌, సాయికుమార్‌, సురేశ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: అప్స‌ర్
ప్రొడ్యూస‌ర్‌: ఎం.ఎన్‌.మ‌ధు
బ్యాన‌ర్స్‌: ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, వీర శంక‌ర్ సిల్వ‌ర్ స్క్రీన్స్‌
సంగీతం: ర్యాప్ రాక్ ష‌కీల్‌
సినిమాటోగ్ర‌ఫీ: నిరంజ‌న్ జె.రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: నాగు.వై
చీఫ్ కో – డైరెక్టర్ : ప్రకాష్ పచ్చల
ఆర్ట్‌: జె.కె.మూర్తి
ఎడిట‌ర్‌: బ‌స్వా పైడి రెడ్డి
పాట‌లు: రామ‌జోగ‌య్య శాస్త్రి, అప్స‌ర్‌

పి.ఆర్‌.ఓ: సాయి స‌తీశ్‌, రాంబాబు పర్వత నేని