ఆది సాయికుమార్ హీరోగా విజ‌న్ సినిమాస్ ప్రొడ‌క్ష‌న్ 3 లాంఛ‌నంగా ప్రారంభం

657

డిఫ‌రెంట్ జోన‌ర్ మూవీస్‌లో వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ త‌న‌కంటూ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు హీరో ఆది సాయికుమార్‌. ఇప్పుడు ఆది క‌థానాయ‌కుడిగా నాట‌కం ఫేమ్ క‌ళ్యాణ్ జి.గోగ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నారు. విజ‌న్ సినిమా బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.3గా ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త నాగం తిరుప‌తి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సునీల్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.
ఆదివారం(ఆగ‌స్ట్ 15) రోజున టి.ఎం.కె(TMK) అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మై పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంది. పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

ఈ చిత్రం కోసం ఆది సాయికుమార్ స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌బోతున్నారు. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాల్‌రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌, మ‌ణికాంత్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

న‌టీన‌టులు:
ఆది సాయికుమార్‌, పాయ‌ల్ రాజ్‌పుత్‌, సునీల్‌, పూర్ణ‌, క‌బీర్ దుహాన్ సింగ్, థాకూర్ అనూప్ సింగ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్‌: విజ‌న్ సినిమాస్‌
ద‌ర్శ‌క‌త్వం: క‌ళ్యాన్ జి.గోగ‌ణ‌
నిర్మాత‌: నాగం తిరుప‌తి రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: తిరుమ‌ల్ రెడ్డి యెల్లా
మ్యూజిక్‌: సాయికార్తీక్
ఎడిట‌ర్‌: మ‌ణికాంత్‌
సినిమాటోగ్ర‌ఫీ: బాల్ రెడ్డి
పి.ఆర్‌.ఓ: సాయి స‌తీశ్‌