ఫ‌న్ అండ్ ఎమోష‌న్స్‌తో రూపొందిన `గాలిసంప‌త్`

494

బ్లాక్ బ‌స్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్పణ‌లో యంగ్ హీరో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం గాలి సంప‌త్. న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్ర‌సాద్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అనిల్ ఈ చిత్రానికి స‌మ‌ర్పకుడిగా వ్యవ‌హ‌రించడంతో పాటు స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ కూడా చేస్తుండ‌డం విశేషం. అనిల్ కో-డైరెక్టర్, రైట‌ర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనీష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ మార్చి 11న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ జేఆర్‌సి క‌న్‌వెన్ష‌న్స్ లో గాలి సంప‌త్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వ‌హించింది చిత్ర యూనిట్‌. ఈ కార్య‌క్ర‌మానికి ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ముఖ్య అతిథిగా హాజ‌రై గాలి సంప‌త్ బిగ్ టికెట్‌ని ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా..

అనిల్ రావిపూడి బ్రాండ్ ఉంటుంది.
ప్ర‌ముఖ నిర్మాత ఎంఎల్ కుమార్ చౌద‌రి మాట్లాడుతూ – “గాలి సంప‌త్ ఒక అద్భుత‌మైన టైటిల్‌, అలాగే ఎంట‌ర్‌టైన్ మెంట్ టైటిల్‌.

నిర్మాత బివిఎస్ ర‌వి మాట్లాడుతూ – “నేను రాజేంద్ర ప్ర‌సాద్ గారికి పెద్ద ఫ్యాన్‌ని. స‌క్సెస్ ఫుల్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న ఈ సినిమా చాలా పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను“ అన్నారు.

రాజేంద్ర ప్ర‌సాద్ గారికి ప్ర‌తి ఇంట్లో ఫ్యాన్స్ ఉంటారు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని మాట్లాడుతూ – “తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో న‌న్ను అత్యంత ఆప్యాయంగా అన్నా అని పిలిచేది నా త‌మ్ముడు అనిల్ రావిపూడి  అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు అచ్చురాజ‌మ‌ణి మాట్లాడుతూ – “ఇంత‌ మంచి సినిమాలో సంగీతం చేసే అవ‌కాశం ఇచ్చిన అనిల్‌గారికి థ్యాంక్యూ. ఈ సినిమా త‌ప్ప‌కుండా బిగ్ హిట్ అవుతుంది. నిర్మాతలు సాయి, సాహూ గార‌పాటి గారికి మై కంగ్రాట్స్‌“ అన్నారు.

హీరోయ‌న్ ల‌వ్‌లీ సింగ్ మాట్లాడుతూ – “ఇది నా ఫ‌స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌. స్పెష‌ల్‌డే..ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన అనిల్, అనీష్, సాయి గారికి థ్యాంక్స్‌. మార్చి 11న త‌ప్ప‌కుండా గాలి సంపత్ సినిమా చూసి అంద‌రూ ఎంజాయ్ చేయండి“ అన్నారు.

ఫ‌న్ అండ్ ఎమోష‌న‌ల్ జ‌ర్నీ..
చిత్ర ద‌ర్శ‌కుడు అనీష్ మాట్లాడుతూ – “గాలి సంప‌త్ సినిమా విష‌యానికి వ‌స్తే ఆన్ స్క్రీన్ తండ్రి కొడుకుల మ‌ధ్య ఉండే ఫ‌న్ అండ్ ఎమోష‌న‌ల్ జ‌ర్నీ..అదే ఆఫ్ స్క్రీన్ వ‌స్తే అనిల్, సాయి గారి ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్లిద్ద‌రిది ప‌టాస్ కి ప‌దేళ్ల ముందు ఫ్రెండ్‌షిప్‌.  ఈ సినిమాలో ఒక కొత్త విష్ణుగారిని చూస్తారు. మా టీమ్ ని విష్ చేయ‌డానికి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ థ్యాంక్స్‌“ అన్నారు.

నా జీవితంలో ఒక ఆణిముత్యం
న‌ట‌కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ – “గాలి సంప‌త్ సినిమా చూశాక నాకు రెండు మూడు విష‌యాలు అర్ధం అయ్యాయి. జీవితంలో మనం ఏం చేసినా భ‌గ‌వంతుడు మ‌న‌కు ఇచ్చే అవ‌కాశం. అది రానిదే ఎవ‌రూ జీవితంలో ఏమీ చేయ‌లేరు.  గాలి సంప‌త్ నా జీవితంలో ఒక ఆణిముత్యం“ అన్నారు.

ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎమోష‌న్ ప‌ర్‌ఫెక్ట్‌గా కుదిరింది
చిత్ర నిర్మాత ఎస్.క్రిష్ట మాట్లాడుతూ – “ముందుగా ఈ ఈవెంట్ కి వ‌చ్చిన రామ్ గారికి థ్యాంక్స్‌. గాలి సంప‌త్ ఒక చిన్న క‌థ . ఈ క‌థ రాసుకుని దీన్ని సినిమాగా తీయాలి అన‌గానే నా మ‌న‌సులో గుర్తొచ్చిన మాట రాజేంద్ర ప్ర‌సాద్‌గారు  అన్నారు.

కొత్త ప్ర‌య‌త్నాన్ని ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను.

బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ – “నేను సాయి బెస్ట్ ఫ్రెండ్స్‌. మేం దూరంగా ఉన్నా చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటాం. అంత మంచి ఫ్రెండ్‌షిప్ మాది. 2005లో బ్ర‌మ‌రాంబ థియేట‌ర్‌లో అత‌డు సినిమాలో సాయి నాకు క‌లిశాడు. నా క‌ష్ట న‌ష్టాల్లో, నా ఆనందంలో అన్నింటిలో సాయి ఉన్నాడు. ఒక ర‌కంగా చెప్పాలంటే సాయి నా ఫ్యామిలీ మెంబ‌ర్‌. నా స‌క్సెస్ అన్నింటిలో చాలా కీ రోల్ పోషించాడు అలాంటి సాయి నెక్ట్స్ లెవ‌ల్‌కి ఎలా రావాలి అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఎప్పుడూ సాయి నువ్వేం చేసిన నీ వెనుక నేను ఉంటాను అని చెప్పాను.

వ‌ర‌ల్డ్‌లో బెస్ట్ యాక్ట‌ర్ ద‌గ్గ‌ర ట్రైన్ అయ్యాను.
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ – “మేం అడిగిన వెంట‌నే వ‌చ్చిన రామ్ గారికి థ్యాంక్స్‌. నేను డైరెక్ట‌ర్ అవ్వాల‌ని ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను. నేను ఏ క‌థ రాసుకున్నా హీరోగా రామ్‌ మైండ్‌లోకి వ‌చ్చేవారు. కంప్లీట్ యాక్ట‌ర్ ఆయ‌న‌. గాలి సంప‌త్ జ‌ర్నీ..  ` అన్నారు.

నేష‌న‌ల్ అవార్డ్ రావాల‌ని కోరుకుంటున్నాను.
ఎన‌ర్జిటిక్ స్టార్‌ రామ్ మాట్లాడుతూ – “మా స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్ స్టార్ట్ అయ్యిందే రాజేంద్ర ప్ర‌సాద్ గారి లేడిస్ టైల‌ర్ సినిమాతో..ఆయ‌న సినిమాలు వ‌స్తున్నాయంటే చాలు హ్యాపీగా న‌వ్వుకోవ‌చ్చు. ఆయ‌న పేరు ముందు ఏ బిరుదు పెట్టినా అది చాలా చిన్న‌గా క‌న‌ప‌డుతుంది.   టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్“ అన్నారు.

న‌ట‌కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్‌, శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య‌, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మిమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి,

క‌థ‌: ఎస్‌. క్రిష్ణ‌,
ర‌చ‌నా స‌హ‌కారం: ఆదినారాయ‌ణ‌,
సినిమాటోగ్ర‌ఫి: సాయి శ్రీ రామ్‌,
సంగీతం: అచ్చురాజ‌మ‌ణి,
ఆర్ట్‌: ఎ ఎస్ ప్ర‌కాశ్‌,
ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: నాగ‌మోహ‌న్ బాబు. ఎమ్‌,
మాట‌లు: మిర్చికిర‌ణ్‌,
లిరిక్స్‌: రామ‌జోగ‌య్య శాస్ర్తి,
ఫైట్స్‌: న‌భ‌,
కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్, భాను,
మేక‌ప్‌: ర‌ంజిత్‌,
క్యాస్ట్యూమ్స్‌: వాసు,
చీఫ్ కో డైరెక్ట‌ర్‌: స‌త్యం బెల్లంకొండ‌.
నిర్మాణం: ఇమేజ్ స్పార్క్ ఎంటర్ టైన్మెంట్, షైన్ స్క్రీన్స్,
నిర్మాత‌: ఎస్. క్రిష్ణ‌,
స్క్రీన్ ప్లే, సమ‌ర్ప‌ణ‌, దర్శకత్వ పర్యవేక్షణ: అనిల్ రావిపూడి,
ద‌ర్శ‌క‌త్వం: అనీష్.