ప‌వ‌ర్ ప్లే సినిమాని ఆదిరిస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ థ్యాంక్స్

381

యంగ్ హీరో రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్‌ల‌ స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం `పవర్ ప్లే`. శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మించారు. మార్చి 5న ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై పాజిటివ్ టాక్‌తో మంచి క‌లెక్ష‌న్స్ సాధిస్తోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్‌లో థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్‌. ఈ కార్య‌క్ర‌మంలో ప‌వ‌ర్ ప్లే మూవీ స‌క్సెస్ కేక్ క‌ట్ చేసి సెల‌బ్రేట్ చేసుకున్నారు.

న‌టుడు మ‌ధు నంద‌న్ మాట్లాడుతూ – “ముందుగా మా టీమ్ అంద‌రికీ కంగ్రాచ్యులేష‌న్స్. నా క్యారెక్ట‌ర్ కి మంచి అప్రిసియేష‌న్ వ‌స్తోంది. ఇంతకు ముందు నేను చేసిన క్యారెక్ట‌ర్స్ తో పోలిస్తే ఈ సినిమాలో నాది డిఫ‌రెంట్ రోల్‌. ఇంత మంచి పాత్ర ఇచ్చిన విజ‌య్ గారికి థ్యాంక్స్. ఆడియ‌న్స్‌కి సినిమా న‌చ్చింది. ఈ థ్యాంక్స్ మీట్ ద్వారా ఈ సినిమా మ‌రి కొంత మందికి చేరువ‌వుతుంది అని న‌మ్ముతున్నాను“ అన్నారు.

న‌టి పూజా రామ‌చంద్ర‌న్ మాట్లాడుతూ – “ఈ కంటెంట్ ఒక రీ ప్రెషింగ్ చేంజ్‌. ఆడియ‌న్స్ తో క‌లిసి సినిమా చూశాను. చాలా ఎంగేజ్ చేసింది. నా పార్ట్ చాలా న‌చ్చింది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కి థ్యాంక్స్‌. టీమ్ అంద‌రికీ మై కంగ్రాట్స్‌“ అన్నారు.

న‌టుడు భూపాల్ మాట్లాడుతూ – “ ఇంత మంచి స‌క్సెస్ ఫుల్ సినిమాలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది“ అన్నారు.

సినిమాటోగ్రాఫ‌ర్ ఐ. ఆండ్రూ మాట్లాడుతూ – “ ఫ‌స్ట్ గా మా టీమ్ అంద‌రికీ శుభాకాంక్ష‌లు. ఫ‌స్ట్ టైమ్ ఒక థ్రిల్ల‌ర్ మూవీ ట్రై చేశాను. స‌క్సెస్ అయింది. ఈ అవ‌కాశం ఇచ్చిన విజ‌య్‌గారికి, నిర్మాత‌ల‌కి నా ద‌న్య‌వాదాలు“ అన్నారు.

హీరోయిన్ హేమ‌ల్ దేవ్ మాట్లాడుతూ – “మీ అందరితో క‌లిసి ఈ మూవీ స‌క్సెస్ ని సెల‌బ్రేట్ చేసుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. విజ‌య్ గారు మంచి కంటెంట్ తో ఒక గొప్ప సినిమా తీశారు. ఈ సంద‌ర్భంగా వారికి నా ద‌న్య‌వాదాలు. మంచి రివ్యూస్ వ‌చ్చాయి. రాజ్ కి ఇది ఒక మెమ‌ర‌బుల్ మూవీ. ఆండ్రూగారు న‌న్ను స్క్రీన్ మీద చాలా అందంగా చూపించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇంత మంచి సినిమాలో అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌ల‌కి నా థ్యాంక్స్‌“ అన్నారు.

ద‌ర్శ‌కుడు విజ‌య్ కుమార్ కొండా మాట్లాడుతూ – “ ప‌వ‌ర్ ప్లే ఫ‌స్ట్ రోజు యావ‌రేజ్ క‌లెక్ష‌న్స్‌తో స్టార్ట్ అయింది. ఆ త‌ర్వాత రోజు నుండి ఆడియ‌న్స్ మౌత్ టాక్‌, మీడియా పాజిటీవ్ రివ్యూస్ వ‌ల్ల డీసెంట్ క‌లెక్ష‌న్స్ సాధిస్తోంది. సినిమా చూసిన ప్ర‌తి వ్య‌క్తి ఒక మంచి సినిమా అని చెబుతున్నారు. ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే ఫ‌స్ట్ టైమ్ రాజ్ ఒక కొత్త జోన‌ర్ ట్రై చేశాడు. పూర్ణ ఇంత‌కు ముందెన్న‌డు చేయ‌ని ఒక క్యారెక్ట‌ర్ చేసింది. పూజా, ద‌న‌రాజ్‌, భూపాల్‌, మ‌ధు ఇలా ప్ర‌తి ఒక్క‌రూ తాము ఇంత‌కు ముందెన్న‌డు చేయ‌ని క్యారెక్ట‌ర్స్ ట్రై చేశారు. నేను ఒక కొత్త జోన‌ర్‌లో చేశాను. మేమంద‌రం క‌లిసి కొత్త‌గా చేసిన మా సినిమాని ఆదిరించిన ప్ర‌తి ఒక్క‌రికీ థ్యాంక్స్‌. మాకు స‌పోర్ట్ చేసిన మీడియా వారికి స్పెష‌ల్ థ్యాంక్స్ “ అన్నారు.

హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ – “ లాక్‌డౌన్ త‌ర్వాత వెంట‌నే మా ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఒరేయ్ బుజ్జిగా.. మూవీ రిలీజైంది. అది కంప్లీట్ ఎంట‌ర్‌టైన‌ర్. త‌ర్వాత వెంట‌నే మేం అంద‌రం క‌లిసి డిఫ‌రెంట్ గా ట్రై చేద్దాం , ఆడియ‌న్స్ ని ఒక కొత్త ఎక్స్‌పీరియ‌న్స్‌ని ఇద్దాం అని ఈ సినిమా చేయ‌డం జ‌రిగింది. మా ఇన్ని నెలల క‌ష్టానికి మంచి రెస్పాన్స్ వ‌స్తున్నందుకు నిజంగా హ్యాపీగా ఉంది. మా సినిమాని ఆద‌రిస్తున్న అంద‌రికీ థ్యాంక్యూ వెరీ మ‌చ్‌. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ త‌క్కువ వ‌చ్చినా ఆడియ‌న్స్ మౌత్ టాక్‌, మీడియా పాజిటీవ్ రివ్యూస్ వ‌ల్ల మంచి క‌లెక్ష‌న్స్ సాధిస్తోంది. చూసిన వాళ్లంద‌రూ బాగుంది అంటున్నారు. ఎవ‌రైనా చూడ‌క‌పోతే థియేట‌ర్ కి వెళ్లి సినిమా చూడండి. రెండు గంట‌ల‌పాటు మిమ్మ‌ల్ని కంప్లీట్ గా సీట్ ఎడ్జ్‌న కూర్చోబెడుతుంది‌“ అన్నారు.

రాజ్ త‌రుణ్‌, హేమ‌ల్ ఇంగ్లే, పూర్ణ‌, మ‌ధు నంద‌న్‌, అజ‌య్‌, కోటా శ్రీ‌నివాస‌రావు, రాజా ర‌వీంద్ర‌, ధ‌న్‌రాజ్‌, కేద‌రి శంక‌ర్‌, టిల్లు వేణు, భూపాల్‌, అప్పాజీ, ర‌వివ‌ర్మ‌, సంధ్య‌ జ‌న‌క్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి

క‌థ‌-మాట‌లు: న‌ంధ్యాల ర‌వి,
సినిమాటోగ్ర‌ఫి: ఐ. ఆండ్రూ,
సంగీతం: సురేష్ బొబ్బిలి‌,
ఎడిటింగ్: ప‌్ర‌వీణ్ పూడి,
ఆర్ట్‌: శివ‌,
ఫైట్స్‌: `రియ‌ల్` స‌తీష్‌,
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: బి.వి సుబ్బారావు,
కో- డైరెక్ట‌ర్: వేణు కురపాటి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: పా‌ల‌ప‌ర్తి అనంత్ సాయి,
స‌మ‌ర్ప‌ణ‌: శ్రీ‌మ‌తి ప‌ద్మ‌,
నిర్మాత‌లు: మ‌హిద‌ర్‌, దేవేష్‌,
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విజ‌య్ కుమార్ కొండా.