అద్భుతం సినిమా ప్రొడ్యూసర్ సృజన్ యరబోలు

453

నా జర్నీ ఓవర్సిస్ లో క్రిష్ గారి కంచె సినిమా డిస్ట్రిబ్యూషన్ తో స్టార్ట్ అయ్యింది అక్కడి నుంచి మహానటి, అర్జున్ రెడ్డి, ఎక్కడకిపోతావు చిన్నవాడా, దాదాపు ముప్పై సినిమాలు కి డిస్ట్రిబ్యూషన్ చేసాను, అక్కడ సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూనే సినిమా మీద వున్నా ఫ్యాషన్ తో సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాను.
తరువాత నిర్వాణ బ్యానర్ లో మను మరియు సూర్యకాంతం అనే రెండు సినిమాలు చేసాము అవి అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేదు అప్పుడు మేమే S originals అని ఓన్ బ్యానర్ స్టార్ట్ చేసి ఫస్ట్ అద్భుతం మూవీ స్టార్ట్ చేసాం కాని కోవిద్ కారణాల వల్ల లేట్ అయ్యి ఫస్ట్ గతం, తిమ్మరుసు రిలీజ్ అయ్యాయికాని మేము ఫస్ట్ అద్భుతం తో నే ముందుకు వద్దాం అనుకున్నాం.

అద్భుతం సినిమా హాట్ స్టార్ట్ లో ఇంత సక్సెస్ అవుతుంది అని ముందే ఊహించాం ఎందుకంటే నేను ఫస్ట్ కధ ని నమ్మి ముందుకు వెళ్తాను, మేము అడగకుండానే చిరంజీవి గారు మా సినిమా చూసి ఆయనే స్వయంగా ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని తెలపటం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.

ఇప్పటికి కి నేను నైట్ షిఫ్ట్ జాబ్ చేస్తూ మిగతా టైమ్ అంత నా ఫోకస్ అంత సినిమాలు కి కేటాయిస్తున్నాను, మా బ్యానర్ నుంచి వరుసగా ఎనిమిది సినిమాలు రాబోతున్నాయి, రెండు ఎలా చేయగలుగుతున్నారు అంటె సిస్టమ్ కరెక్ట్ గా ఉంటె ఏదైనా చేయవచ్చు.

గతం, తిమ్మరుసు, ఇప్పుడు అద్భుతం సినిమాలు లూ, ఫైనాన్సియల్ గా, కంటెంట్ పరం గా మా స్థాయి ని మరింత పెంచాయి ముందు ముందు మరింత బాథ్యత తో ముందుకు వెళ్తాము.

మా బ్యానర్ యొక్క ముఖ్య ఉద్దేశం రాజమౌళి సార్ లాంటి పెద్ద డైరెక్టర్ తో సినిమాలు తీయటం కాదు, రాజమౌళి లాంటి డైరెక్టర్ ని తయారు చేయటం.

నేను డిస్ట్రిబ్యూషన్ లో వున్నాను కాబట్టి ఇక్కడకి వచ్చాక సినిమాలు ప్రొడ్యూస్ చేయటం నాకు చాలా హెల్ప్ అయ్యింది, తిమ్మరుసు సినిమా రైట్స్ కొని సత్య దేవ్ ని చూసి చెప్పు అన్నాను, సత్య దేవ్ చూసి ఈ సినిమా మనం చేస్తున్నాం అన్నారు, అలాగే ఫస్ట్ తీసిన గతం సినిమా కూడా అంత యూ స్ లోనే అక్కడి యాక్టర్స్ తోనే తీసాము అది అమెజాన్ లో స్టీమ్ అయ్యి మంచి పేరు తెచ్చిపెట్టింది.

భవిష్యత్ లో కూడా కంటెంట్ బేస్డ్ సినిమాలు తీయడానికే మా ప్రాధాన్యత ఉంటుంది, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ పరం గా స్కైలాబ్ ఒకటి ఓవర్ సిస్ చేస్తున్నాం, పెద్ద హీరో తో కూడా ఒక కధ చర్చలు జరుగుతున్నాయి ఆ వివరాలు త్వరలోనే తెలియచేస్తాం.